దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్(Banking) దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త(Good News) చెప్పింది.
భారీగా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదల చేసింది SBI. మొత్తం 665 ఖాళీల(665 Posts)ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్(Specialist Officer) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ(Application process) ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20ని ఆఖరి తేదీ(Last date)గా నిర్ణయించారు. అర్హత(Qualified), ఆసక్తి(Interest) కలిగిన అభ్యర్థులు(Candidates) ఆ తేదీలోగా అప్లై(Apply) చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్(Online) విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు : 665
మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్) 1
సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ – సపోర్ట్ 2
మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్) 2
ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ బిజినెస్ 2
రిలేషన్ షిప్ మేనేజర్ 335
ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ 52
సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ 147
రిలేషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) 37
రీజినల్ హెడ్ 127
కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ 75
విద్యార్హతల వివరాలు:
సంబంధిత స్పెషలైజేషన్లలో బీఈ(BE)/బీటెక్(B.TECH)/ఎంఈ(ME)/ఎంటెక్(M.TECH), ఎంబీఏ(MBA)/పీజీడీఎమ్(PGDM)/పీజీ డిగ్రీ(PG Degree)/ఐటీ(IT)) లేదా అందుకు సమానమైన విద్యార్హతలను కలిగి ఉండాలి.60 శాతం మార్కులను పొంది ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అభ్యర్థులు ఇతర అనుభవం(Other Experience), తదితర పూర్తి వివరాల(Full Details)ను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు(Age) 32 – 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే:
- అభ్యర్థులు మొదటగా ఈ లింక్ (https://recruitment.bank.sbi/crpd-sco-2022-23-16/apply) ఓపెన్ చేయాలి.
- తరువాత న్యూ రిజిస్ట్రేషన్(New Registration) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సూచించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది
- వివరాల నమోదు తర్వాత సబ్మిట్(Submit) పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్(Application Form) ప్రింట్(Print) తీసుకోవాలి.