గుడ్డు(Egg)తో వెరైటీ ఆమ్లెట్స్(Variety Omelet’s) చేసుకుంటాం. అందులో స్పానిష్ ఆమ్లెట్(Spanish Omelet) పేరుకు తగ్గట్టుగానే టేస్ట్ లో కూడా అదిరిపోతుంది. స్పానిష్ పొటాటో ఆమ్లెట్ అనేది స్పెయిన్(Spain) నుండి వచ్చిన ఒక సాంప్రదాయక వంటకం(Traditional Dish) మరియు స్పానిష్ వంటకాలలో ఈ రెసిపీ(Recipe) సిగ్నేచర్ వంటల(Signature Dish)లో ఒకటి. ఇది కేవలం ఐదు పదార్థాల(FIVE Ingredients)తో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే క్లాసిక్ వంటకం(Classic Dish). ఆ రెసిపీ ఏంటో వాటికీ కావాల్సిన పదార్దాలేంటో నాతో పాటు మీరు నేర్చుకోండి

కావలసినవి:

500 గ్రా బంగాళాదుంపలు

1 ఉల్లిపాయ,(ఈ రెసిపీ కి వైట్ ఆనియన్స్ అయితే బాగుంటది )

150ml ఆలివ్ నూనె

3 టేబుల్ స్పూన్లు తరిగిన ఫ్లాట్ లీఫ్ పార్స్లీ

6 గుడ్లు

తయారు చేయు విధానం:

  • బంగాళాదుంపల(Potatoes) తొక్కును పీల్ చేసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, వీటితో పాటు ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఒక పెద్ద ఫ్రైయింగ్ పాన్‌(Frying Pan)లో ఆలివ్ నూనెను వేసి వేడయ్యాక, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను వేసి మెత్తగా, పాక్షికంగా మూతపెట్టి, 30 నిమిషాలు, బంగాళాదుంపలు మెత్తబడే వరకు ఫ్రై చేయాలి. బంగాళాదుంపలు మరియు ఉల్లిపాయలను పెద్ద గిన్నెలో వడకట్టండి (వడకట్టిన నూనెను పక్కన పెట్టండి).
  • ఒక గిన్నెలో గుడ్లను వేసి బీట్ చేయాలి, బీట్ చేసిన గుడ్లలో పార్స్లీ(Parsley) మరియు ఉప్పు మరియు మిరియాలు బంగాళదుంపలు వేసి బాగా కలపండి . వడకట్టిన నూనెను చిన్న పాన్‌లో కొద్దిగా వేడి చేయండి.
  • పాన్‌లోకి అన్నింటినీ వేసి, ఒక మోస్తరు వేడి మీద ఉడికించి, ఆమ్లెట్‌ను కుషన్‌ ఆకృతిFluffy Shape) చేయడానికి గరిటెలన్నిటిది ఉపయోగించండి.
  • ఇప్పుడు ఒక పక్క బాగా ఫ్రై అయ్యాక మరో పక్క కి తిప్పాలి, మరికొన్ని నిమిషాలు ఉడికించాలి.
  • అలా రెండు వైపులా ఆమ్లెట్టే ని ఫ్రై చేశాక, ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ గా వుండే స్పానిష్ పొటాటో ఆమ్లెట్ రెడీ