పోషకాల(Nutrition) విషయానికి వస్తే మిల్లెట్స్(Millets) ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తాయి. దక్షిణ భారత(South Indian) రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్లలో ఫాక్స్‌టైల్ మిల్లెట్స్(Fox tile Millets) ఒకటి. వీటినే కొర్రలు అని పిలుస్తారు. కొందరు అండుకొర్రలు అంటారు.
ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలలోనూ మిల్లెట్లను తినడాన్ని ఇష్టపడుతున్నారు. వీటిని సూపర్ ఫుడ్(Super food)గా చెబుతారు.
అనేక రకాల వ్యాధులను తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తి(Immunity Power)ని పెంచడాని(Increases)కి ఈ మిల్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
కావలసినవి:
ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కొర్రలు) – 1 కప్పు
మూంగ్ దాల్ (పెసర పప్పు) – 1/2 కప్పు
నెయ్యి – 3 స్పూన్లు
మిరియాలు (మిర్యాలు) – 4 లేదా 5
అల్లం (అల్లమ్) – 1 చెంచా తురుముకోవాలి
జీర (జిలకర్ర) – 1 స్పూన్
పచ్చిమిర్చి – 1
జీడిపప్పు (జిడిపప్పు) – కొన్ని
ఉప్పు – రుచికి సరిపడినంత
తయారు చేసుకునే విధానం:
- జీడిపప్పు(Cashew nuts)ను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- పెసర పప్పును బాణలిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- కుక్కర్‌లో నెయ్యి(Ghee), జీరా(Jeera), మిరియాల బంకులు(Pepper), అల్లం(Ginger), మిరపకాయలు(Mirchi) వేసి జీరా చల్లే వరకు వేగించండి. తర్వాత మీకు ఖిచిడీ మామూలుగా కావాలంటే 3 కప్పుల నీళ్లు (1 కప్పు ఫాక్స్‌టైల్ మిల్లెట్ + ½ కప్పు మూంగ్ పప్పు కోసం) జోడించండి. లేదంటే ఖిచిడీ కొద్దిగా మెత్తగా ఉండాలంటే 4 కప్పుల నీళ్లు కలపండి.
- నీరు మరిగేటప్పుడు ఉప్పు కలపండి. నీరు మరిగిన తర్వాత కొర్రలు మరియు వేయించిన మూంగ్(MOONG) పప్పు వేసి కుక్కర్
(Cooker)మూసివేయండి.
- 3 విజిల్స్ వచ్చే వరకు వేచి ఉండండి మరియు మీ ఖిచిడీ సర్వ్ (Serve Khichadi) చేయడానికి రెడీగా వుంది.
- చివరగా జీడిపప్పు(Cashew nuts), కొత్తిమీర(Coriander)తో గార్నిష్(Garnish) చేయాలి.
పోషక విలువలు:
కొర్రల(Millets)ను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ(Nervous system) ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజూ కొర్రలను తినాలి. అల్జీమర్స్(Alzheimer’s) ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది.
కొర్రలలో అనేక రకాల బి విటమిన్లు(B Vitamins) ఉంటాయి. ఇవి మెదడు(brain) పనితీరు(Function)ను మెరుగు పరుస్తాయి. మెదడును యాక్టివ్(Active)గా ఉంచుతాయి.
మెదడు అభివృద్ధికి సహాయ పడతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా(Oxygen Circulation)ను పెంచుతాయి. దీంతో జ్ఞాపకశక్తి(Memory), ఏకాగ్రత(Concentration) పెరుగుతాయి.
మలబద్దకం (Constipation)సమస్య అరికట్టవచ్చు. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువును(Over Weight) తగ్గించుకోవచ్చు.
కొర్రలను తినడం వల్ల వ్యాధులు(Diseases), ఇన్‌ఫెక్షన్లు(Infections) రాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్(Diabetes) ని అదుపు(Control)లో ఉంచుతుంది.