జొన్నలు(Sorghum), వీటిని ఇప్పుడు ఆహారంగా తీసుకోవడం చాలా తగ్గించేశారు. కానీ వీటిలో ఉండే పోషకాల(Nutrients) చిట్టా తెలుసుకుంటే మళ్లీ తినాలనిపిస్తుంది. జొన్నల్లో పీచు పదార్థాలు(Fiber), ప్రొటీన్లు(Proteins) ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తోడ్పడతాయి.
కాబట్టి అన్ని ధాన్యాల కంటే.. జొన్నలే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు(Experts). ప్రపంచవ్యాప్తంగా జొన్నలు అధికంగా పండుతాయి. గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత అధికంగా పండే పంట జొన్న. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న(Health Benefits) జొన్నలను డైట్(Diet) లో చేర్చుకోవడం వల్ల హెల్తీ(Healthy)గా ఉంటారు.
జొన్నల ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి క్యాన్సర్(Cancer), మధుమేహం(Diabetes) వంటి రోగ్యాలను నయం చేస్తాయి. విభిన్నమైన ఆరోగ్యప్రయోజనాలున్న జొన్నల గురించి తెలుసుకుందాం.
జొన్నలు మేలైన పోషకాహారం. పాస్పరస్(Phosphorus), మాంగనీస్(Manganese), కాపర్(Copper), కాల్షియం(Calcium), జింక్(Zinc), పొటాషియం(Potassium) వంటి రకరకాల పోషకాలు జొన్నల్లో సమృద్దిగా ఉన్నాయి. సరైన ఆరోగ్యానికి జొన్నలను తరచుగా తీసుకోవడం చాలా అవసరం.
జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ప్లమ్స్ వంటి ఫ్రూట్స్(Fruits) లో కంటే జొన్నల్లోనే ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయని అధ్యయనాలు నిరూపించాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటీస్, న్యూరోలాజికల్ వ్యాధులు(Neurological Disease) దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్(Protects) చేస్తాయి.
కాబట్టి ఇన్ని లాభాలున్న జొన్నలను మీ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి. జొన్నలలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా యాక్టీవ్ గా ఉంటడానికి జొన్నలు సరైన ఆహార పదార్ధం.
జొన్నలను ఎక్కవగా ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు.. క్యాన్సర్ ను నిరోధించే శక్తి కూడా వీటిలో ఉంది. చర్మ క్యాన్సర్(Skin cancer) కూడా దరిచేరకుండా చేస్తుంది. ఉదర సమస్యలకు చెక్ పెట్టడానికి జొన్నలు బాగా తోడ్పడతాయి. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్(Gastric Problems) నుంచి బయటపడేస్తుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు జొన్నలు తీసుకోవడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది.విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన శక్తిని జొన్నలు అందిస్తాయి.
శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తాన్ని పెంచే ఇనుము, క్యాల్షియం, బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్(Folic Acid) వంటివి పుష్కలంగా లభిస్తాయి. జొన్నల్లో ఇనుము, జింకు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఇవి క్యాలరీలు పెరగకుండా చేయడమే కాదు.. శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తాయి.
అనారోగ్యంతో బాధపడే వాళ్లకు జొన్నలు సరైన ఆహారం. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన ఆహారపదార్థాలు పెట్టడం ఎంతో మంచిది. సత్వర శక్తిని అందిస్తాయి.
జొన్నలు అన్ని రకాల ధాన్యాలకంటే బలవర్ధకమైనవి. వీటిలో ఉండే పోషకాలు, తల్లికే కాదు, బిడ్డకు మంచిదే. కాబట్టి పాలిచ్చే తల్లులకు జొన్నలతో చేసిన ఆహారం పెట్టడం మంచిది.