వేసవి వచ్చిందంటేనే.. చర్మ సమస్యలు(Skin Problems) స్టార్ అయినట్లు సిగ్నిల్ వచ్చినట్టే. ఈ హాట్ సమ్మర్(Hot Summer)లో చాలామందిని ఇబ్బంది పెట్టే కామన్ సమస్య చెమట కాయలు. చెమటకాయల కారణంగా దురద(itching) పెట్టి.. చికాకుగా ఉంటుంది.
చెమటకాయలు ఉన్న ప్రాంతంలో సుర్ సుర్ మంటూ మంట మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. కామన్‌గా నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద చెమట కాయలు ఎక్కువగా వస్తుంటాయి. వీటి తీవ్రత ఎక్కువైతే చర్మం ఎర్రపొక్కులుగా మారటం, గోకటం వల్ల చర్మం చిట్లి రక్తం కారడం జరుగుతుంది.
ఇంట్లో దొరికే వస్తువులతోనే చెమట కాయలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. చర్మం చల్లబడితే చెమటకాయలు తగ్గుతాయి. రెండు పూటలు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. చర్మాన్ని సున్నితంగా కడగితే.. రంధ్రాలు తెరుచుకుంటాయి.
చర్మ రంధ్రాలు మూసుకోవడం చెమటకాలకు ముఖ్యం కారణం. స్నానం చేసిన తర్వాత.. శరీరంపై తడి లేకుండా టవెల్‌తో శుభ్రంగా తుడవండి. ఒకవేళ చర్మం తడిగా ఉంటే చమటకాయల(Heat Rashes) సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపూలు, జాజిపూలు, వట్టివేళ్ల చూర్ణం వేసి గంటసేపు నాననిచ్చి, ఆ నీటితో స్నానం చేయడం మంచిది. ఇటువంటి స్నానం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. చెమటకాయలు ఉన్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ పెట్టండి. దీని వల్ల చర్మం ఎరుపు, దురద, వాపు తగ్గుతుంది.
ఈ ఐస్ ప్యాక్(Ice Pack) ఎక్కువ సేపు అలానే ఉంచొద్దు. ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే ఉంచాలి.200 మిల్లీ లీటర్ల రోజ్ వాటర్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె, 200 మిల్లీ లీటర్ నీరు కలపండి. ఈ ద్రావణాన్ని ఐస్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేయండి. నాలుగైదు క్యూబ్స్ తీసుకుని పల్చని మస్లిన్ బట్టలో చుట్టి చెమట కాయలు ఉన్న ప్రదేశంలో మృదువుగా అద్దండి. రోజ్ వాటర్ స్కిన్ పీహెచ్ బ్యాలెన్స్ (Skin VH Balance)మెయింటెయిన్ చేస్తుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ ని కంట్రోల్ చేస్తుంది.
చెమటకాయల సమస్య ఉన్నప్పుడు వదులు బట్టలు వేసుకోవడం మంచిది. చెమటకాయలకు గాలి తగిలితే త్వరగా తగ్గుముఖం పడతాయి. బాడీని కూల్‌గా, బాగా గాలి తగిలేట్లుగా ఉంచుకోవడం మంచిది. సమ్మర్లో తేలికగా, వదులుగా ఉండే బట్టలు లేత రంగు(Light Colors)ల్లో ఉన్నవి వేసుకోవాలి. అప్పుడే ఎయిర్ సర్క్యులేషన్ ఉండి బాడీ కూల్‌గా ఉంటుంది. సింథటిక్ బట్టలు, టైట్ గా ఉండే బట్టలు పూర్తిగా పక్కన పెట్టేసి కాటన్ బట్టలు వేసుకోండి.
చెమటకాయలు వచ్చిన ప్రాంతంలో.. గంధపు చెక్కని సానపై అరగదీసి ఆ ముద్దను రాయాలి. పేలిన చోట పల్చని పూతలా వేసుకుంటే, మంట, దురద తగ్గుతాయి. ఇందులో కర్పూరాన్ని కలిపి పేలిన చోట లేపనంలా రాసినా సమస్య అదుపులోకి వస్తుంది. చందనం పొడి(Sandal Powder), వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి పల్చని లేపనంలా చెమట కాయలపై రాసినా మంచిదే.
కలబంద గుజ్జుని రాసుకున్నా కూడా చెమటకాయల నుంచి ఉపశమనం కలుగుతుంది. వట్టివేర్ల తైలాన్ని చెమట పొక్కులు, గడ్డలు వచ్చినప్పుడు పైపూతగా వాడతే.. త్వరగా తగ్గుముఖం పడతాయి.
పెరుగు చర్మాన్ని బాగా చల్లబరుస్తుంది. చెమట కాయలు ఉన్న ప్రదేశంలో చల్లని పెరుగుని అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తగా ఓ వస్త్రంతో అద్దండి. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్(Anti Bacterial), యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్(Anti Fungal Properities) ఉన్నాయి.
ఇది మీ చమట కాయలను త్వరగా తగ్గిస్తుంది. తాటి ముంజెలలోని నీటిని చెమట కాయలపై రాసి, ఆరిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో మృదువుగా తుడిచేయాలి. పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, ముంజెలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పల్చని మజ్జిగ… వంటి చలువచేసే పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. కారం, గరం మసాలా, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఓట్స్(Oats)ను పొడిగా చేసుకుని గోరు వెచ్చని నీటిలో కలపడండి. దాన్ని చెమట కాయలపై రాసి, 20-30 నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం ఉంటుంది. శరీరానికి చెమట ఎక్కువ పడితే చెమట కాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెమట పడ్డకుండా చల్లటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించండి. రోజూ చన్నీటి స్నానమే చేయండి. కానీ, ఎండ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే చెమట కాయలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే స్నానం చేసేప్పుడు సబ్బును తక్కువగా వాడాలి. పిల్లలను ఎండలో ఆడనివ్వకండి. చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఉక్కపోత, వేడి వాతావరణంలో ఉన్నట్లయితే చెమట కాయలు రావచ్చు. బయటకు వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్ లోషన్లు(Sun Screen Lotions) రాసుకోండి. వేడి గాలు, ఎండలు శరీరం లోని శక్తిని పీల్చేస్తాయి. అందుకనే మీరు హైడ్రేటెడ్(Hydrate) గా ఉండడం ఎంతో అవసరం. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి నాచురల్ కూలర్స్(Natural Coolers) తీసుకోండి.