స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SIDBI) వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌(Notification) ప్రకటించింది. ల‌క్నో(Lucknow) ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ(Company)లో ప‌లు విభాగాల్లో ఉన్న స్పెష‌లిస్ట్ పోస్టుల‌(Specialist Post)ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు శుక్ర‌వారంతో గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు(Full Details) ఇక్కడ చూద్దాం !

 ఖాళీలు, అర్హతల వివరాలు:

  • నోటిఫికేష‌న్‌(Notification)లో భాగంగా మొత్తం 21 ఖాళీల‌(Posts)ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
  • వీటిలో లీగల్‌ కౌన్సిల్(Legal Council), చీఫ్‌ ఆఫీసర్(Chief Officer), లీడ్‌ ఆఫీసర్(Lead Officer), లీడ్‌స్పెషలిస్ట్(Lead Specialist), స్టాటిస్టీషియన్(Statistician), డేటాసైంటిస్ట్(Data Scientist), ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫీసర్(Procurement Officer), బ్రాండింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్(Branding and Communication Officer), రిస్క్‌ అనలిస్ట్(Risk Analyst), రిస్క్‌ ఆఫీసర్(Risk Officer), కన్సల్టెంట్(Consultant) వంటి పోస్టులు ఉన్నాయి.
  • పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు(Candidates) పోస్టుల ఆధారంగా గ్రాడ్యుయేషన్(Graduation), లా డిగ్రీ(Law Degree), బీఈ(B.E)/బీటెక్‌(B.Tech)/ఎంఈ(M.E)/ఎంటెక్(M.Tech), ఎంబీఏ (MBA)/ పీజీడీఎం(PGDM) /పీజీడీబీఎం(PGDBM) /సీఏ(CA)/సీఎఫ్‌ఏ(CFA)లో ఉత్తీర్ణత(Qualified) పొంది ఉండాలి. వీటితో పాట ప‌ని(Work)లో అనుభవం(Experience) త‌ప్పనిస‌రిగా ఉండాలి.
  • అభ్యర్థుల(Candidates) వ‌య‌సు, పోస్టుల ఆధారంగా 30 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్యమైన విష‌యాలు:

  • ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌(E-Mail) విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు త‌మ పూర్తి వివ‌రాల‌ను [email protected] మెయిల్ ఐడీ(Mail Id)కి పంపించాలి.
  • అభ్యర్థుల‌ను తొలుత ప‌ని అనుభ‌వం ఆధారంగా షార్ట్‌ లిస్టింగ్(Short Listing) చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ(Interview) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ(Application Submission) 28-01-2021తో ముగియనుంది.

టీటీడీ కాలేజీల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నారు.. పూర్తి వివరాలివే

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి డిగ్రీ & పీజీ క‌ళాశాల‌(College), శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌(SGS College), శ్రీ వేంక‌టేశ్వర ఆర్ట్స్ కళాశాలల్లో(SVU) 2021-22 విద్యా సంవత్సరంలో ఎంట్రన్స్ కి  గాను ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు(Spot Admissions) నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత విద్యాశాఖాధికారి(Educational Officer) గోవింద‌రాజ‌న్ బుధ‌వారం(Jan 26th) ఒక ప్రకట‌న‌లో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు జనవరి 29వతేదీ లోపు ఒరిజినల్ (Original Certificates) తో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ (College Principals)ని సంప్రదించాలని కోరారు. కాగా, స్పాట్ అడ్మిష‌న్లు పొందిన వారికి హాస్టల్ సీట్లు(Hostel Seats), ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్(Tuition Fee Reimbursement)  ఉండవని ఆయన తెలిపారు.