నేచురాల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy). పునర్జన్మల నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కేకిన్చారు. టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్(Rahul) డైరక్షన్(Direction) లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు(Boxoffice) వద్ద మంచి హిట్ ని సొంతం చేసుకుంది.
గతేడాది డిసెంబర్ 24న బాక్సాఫీసు వద్ద ఈ మూవీ సందడి చేసింది. ఆ తరువాత ఓటీటీ(OTT)లోనూ ఈ సినిమా రికార్డులు సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్(Netflix) లో అత్యధిక రేటింగ్ సాధించడంతోపాటు.. దాదాపు 10 వారాల పాటు టాప్ ట్రెండ్‌లో ఉంది.
తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీ మరో రికార్డు(Record)ను క్రియేట్(Create) చేసింది. ఆస్కార్ అవార్డు(Oscar Award)కు మూడు విభాగా(3 Ctaegories)ల్లో నామినేట్ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. పీరియాడిక్ డ్రామా(Periodic), బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ విభాగాల్లో పోటీ పడుతున్నట్లు తెలిపింది.
ఫైనల్ లిస్టు(Final List)లో ప్లేస్ దక్కించుకుని.. ఆస్కార్ అవార్డు దక్కించుకుంటుందో లేదో చూడాలి మరి. నిహారిక ఎంటర్టైన్మెంట్ (Niharika Entertainments) పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మించారు. డ్యూయెల్ రోల్లో నాని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రోజీ పాత్రలో సాయిపల్లవి (Sai Pallavi) జీవిచేసింది.
మరో హీరోయిన్గా కృతి శెట్టి (Krithi Shetty) నటించింది. లాయర్‌గా మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian) అలరించింది. అంటరానితనం, బానిసత్వం, కులవివక్షలను ఎండగడుతూ.. స్త్రీ ఎవడికి దాసి కాదని చెబుతూ తీసిన ఈ సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది.
మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ లో నాని, సాయి పల్లవి అద్భుతమైన యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంతో నాని ఫ్యాన్స్(Fans) తెగ సంబరపడిపోతున్నారు.