బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) ఈ వారం ప్రారంభమైన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ గురువారం కూడా కొనసాగుతోంది.
ఈ టాస్క్ లో ఇప్పటికే శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు టాస్కులు పూర్తి చేశారు. మరుసటి రోజు సూపర్ హీరోస్ టీం నుంచి ప్రియాంక వచ్చింది. విలన్ టీంలోంచి ఎంత మంది ఎన్ని రకాల టాస్కు(Task)లు ఇచ్చిన, విచిత్ర జ్యూస్ లు ఇచ్చినా కూడా తాగింది. పేడ, పెయింట్, ఎగ్ ఇలా అన్ని రకాలుగా తన ఒంటి మీద పోసుకుంది.
జుట్టు కట్ చేసుకోవాలని సిరి కత్తెర ఇచ్చింది. జుట్టు అంటే నాకు ప్రాణం, దాన్ని చూసుకునే బతుకుతున్నాను ఇవ్వమంటే (Cancer) పేషెంట్స్ కోసం ఇస్తాను అని ప్రియాంక ముందుకు వచ్చింది. కానీ సిరి వద్దని చెప్పింది. టాస్క్ చేస్తావా? లేదా? అని టెస్ట్ చేశాను అంతే అని చెప్పింది.
రవి రకరకాల ఫిజికల్ టాస్కు(Physical Task)లు ఇచ్చాడు. సిట్ అప్స్ చేయించాడు. బకెట్ చేత్తో నిటారుగా పట్టుకోవాలని అన్నాడు. చివరి వరకు ప్రియాంక క్విట్(Quit) అని చెప్పలేదు. హీరోస్(Heroes) టీం కి ప్రియాంక ఒక పాయింట్ సంపాదించి విజేత(Winner)గా నిలిచింది.
టాస్క్(Task)లో భాగంగా సిరి, షన్ను మధ్య కాస్త దూరం వచ్చింది. ఎగ్స్ టాస్కులో తన కోసం త్యాగం చేశాను కాబట్టి ఈ సారి నువ్వు నాకు చేయాల్సిందేనని జెస్సీని షన్ను అడిగాడు.
సిరి అలిగిందని షన్ను ఆమె కోసం గుంజిళ్లు కూడా తీశాడు. అందరి ముందు సారీలు చెప్పాడు. అలా అందరి ముందు సారీ చెప్పడంతో హాగ్(Hug) చేసుకుంది సిరి. అయితే ఇదంతా అర్దరాత్రి జరిగింది. ఉదయం కాగానే మళ్లీ టాస్క్(Task) మొదలైంది. దాంతో పాటే గొడవలు కూడా షురూ అయింది.
ఇక ఈ సారి హీరోస్(Heroes) టీంకు అవకాశం వచ్చింది. వారు విలన్(Vilan) టీం నుంచి ఆనీ మాస్టర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. రకరకాల డ్రింకులు ఇచ్చారు, మిరపకాయ్ తినమని ఇచ్చారు.
పెయింట్ పూసుకోమ్మన్నారు. ఐస్ వాటర్ ఒంటి మీద పోసుకోమన్నారు. దాంట్లో కాజల్ పేడ కలిపింది. ఇలా ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆనీ మాస్టర్ చివరి వరకు నిలబడి విజేత(Winner)గా గెలిచింది.
సిరి మధ్యలో బెడ్ రూమ్ లోకి వెళ్లి హౌస్ మేట్స్(House mates) బట్టలు చిందరవందరగా పడేస్తుంది. ఇక శ్రీరాం కూడా అలానే చేస్తాడు. తాళం కోసం అందరూ పరిగెడుతున్న సమయంలో విశ్వ, మానస్ మధ్య గొడవ జరుగుతుంది. సిరి, ప్రియాంకలు ఒకరినొక్కారు తోసుకుంటూ వెళ్తారు.
ఆ తరువాత సిరి, షన్ను మధ్య మళ్లీ గొడవలు స్టార్ట్ అయింది. ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ సిరి తరుపున జెస్సీ అడుగుతాడు. అప్పుడు సంచాలక్ కాబట్టి అలా అరిచాను అంటాడు అది తప్పు అయితే నామినేట్(Nominate) చేయండని, వరస్ట్ పెరఫార్మెర్(Worst performer)గా చెప్పండి అంటాడు.
రాత్రి సారి చెప్పింది గుంజిళ్లు తీసింది మాత్రం చెప్పవా? ప్రతీ అమ్మాయి దగ్గరకు వెళ్లి అలా చేస్తానా? అంటూ సిరి, జెస్సీల మీద షన్ను గట్టిగా అరుస్తాడు . ముందు మీ ఆట మీరు ఆడండి అని షన్ను అంటే నువ్వు కూడా ముందు నీ ఆట నువ్వు ఆడు అని సిరి అంటుంది.
అందరి బట్టలను అలా పడేయడం, ఇన్నర్స్ ను కూడా అలా విసిరేయడంతో షన్ను ఫైర్(Fire) అవుతాడు. ఇన్నర్స్ ఎందుకు అలా పడేసావు, అవి సర్దు అంటూ సిరికి ఆర్డర్ వేస్తాడు షన్ను. తరువాత చేస్తాను అంటే వినకుండా, ఇప్పుడే చేయమంటూ ఫోర్స్ చేస్తాడు. నేను చేయను అంటూ సిరి గట్టిగా చెప్తుంది.
ఇదే నీ కారెక్టర్(Character) అంటూ సిరిని హర్ట్ చేస్తాడు. దీంతో సిరి ఏడుస్తుంది. టాస్కు(Task)ల్లో అయిన గాయాలకంటే నువ్వు అనే మాటలే ఎక్కువగా బాధపెడుతున్నాయి అని సిరి ఏడుస్తూనే మండిపడుతుంది.
ఇక సిరి అలా ఏడ్వడంపై ప్రియాంక సెట్టైర్(Settaire) వేస్తుంది. అలా ఒకరు బాధలో ఉంటే ఇలాంటి జోకులు వేయోద్దు నిన్న నువ్వు కూడా ఏడిస్తే అందరూ అలానే అనుకొనివుంటే అని మానస్ క్లాస్ పీకుతాడు.
నిన్ను ఎవరైనా హర్ట్ చేస్తే వారు నాశనం అవ్వాలని కోరుకుంటావు అని ప్రియాంక మనస్తత్వం గురించి మానస్ చెప్పాడు. దీంతో ప్రియాంక హర్ట్ అయి వెళ్లిపోయింది. ఆ తరువాత మళ్లీ కాసేపటికి వచ్చి మానస్‌తో మాట్లాడుతుంది.
ఇక సిరి గురించి కాజల్, షన్నులు డిస్కషన్(Discussion) పెడతారు. సిరి చాలా స్ట్రాంగ్(Strong), టాస్కు(Task)ల్లో బాగా ఆడుతుంది అని షన్ను అంటే సిరి రాడ్ అని కాజల్ అంటుంది. బీభత్సమైన రాడ్ అంటూ సిరి టాస్క్ లో ఆడే విధానం గురించి చెప్తాడు షన్ను. ఇకపై ఎప్పుడైనా టాస్కులు ఉంటే నా వైపు ఉండమని అంటాను.
ఈ సారి మాత్రం కావాలనే వేర్వేరు టీం లు వున్నాము. అందరికి ఇద్దరు కలసి ఆడటం లేదు అని తెలియడం కోసమే అని అంటాడు షన్ను. మరో వైపు వంటగదిలో ప్రియాంక, సిరి ల మధ్య మళ్లీ గొడవ మొదలైంది.
ఇక ప్రోమో(Promo) లో సిరి, షన్ను మధ్య గొడవలకు దారితీసినట్టు కనిపిస్తోంది. నువ్వు ఫేక్(Fake) అంటూ షన్ను మొహం మీదే చెప్పేసింది సిరి. ఆ తరువాత ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది సిరి.
.