మనలో చాలా మందికి ఎన్నో అద్భుతమైన ఆలోచనలు, ఊహలు వస్తుంటాయి. అవి కావలసిన వారికి తీరిగ్గా చెప్దాం అనుకుంటారు. కానీ ఆ తరువాత ఆ విషయం ఏంటా అని ఆలోచిస్తే అస్సలు గుర్తు రాదు. మరి కొంత మందికి ఇప్పటికీ కొన్ని విషయాలు కాగితం మీద రాసుకుంటారు, కానీ అవసరమైనప్పుడు ఆ కాగితం మరెక్కడో ఉంటుంది. ఇలా ఎన్నో మంచి ఆలోచనలు, భావాలు, ఊహలు మరుగున పడి పోతుంటాయి. ఇక సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది మరీ పెద్ద ఇబ్బంది.
అయితే ఫోన్లో ఇలా స్పీచ్ టు టెక్స్ట్ నోట్స్ తీసుకునే యాప్ లు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. అవి ఎంత బాగా పని చేస్తాయో చెప్పేదేముంది. ఒకటి చెప్తే మరొకటి ప్రత్యక్షమవుతుంది. అందులోనూ రద్దీ లో ఉన్నప్పుడో మరే ఇతర చప్పుడు ఉన్నా కూడా ఇవి మన స్పీచ్ ను సరిగ్గా అర్ధం చేసుకోలేవు. అందుకే వచ్చేసింది Senstone.
Senstone ఇది మనకు ఫోన్లో స్పీచ్ టు టెక్స్ట్ నోట్స్ రాసే పరికరం. ఫోన్లో దీనికోసం రూపొందించిన యాప్ ద్వారా పని చేస్తుంది. ఇక ఇది చూడడానికి ఒక చిన్న పరికరం. ఇంచుమించు ఒక రూపాయి నాణెం అంత పరిమాణంలో ఉండి మన షర్టు కాలర్ కు తగిలిచుకోవడం ద్వారా మన మాటలని టెక్స్ట్ గా మన ఫోన్లో రాసెస్తుంది. దీన్లో రెండు మైక్ లు ఉన్నాయి. ఒకటి మీ స్వరాన్ని రికార్డు చేస్తే మరొకటి మీ చుట్టుపక్కల ధ్వనులను రికార్డు చేయడం ద్వారా మీరు చెప్పేది వేరు చేసి నోట్స్ రాయగలదు. ఇందులో మీ మాటల్ని నోట్స్ రాయడం తో పాటు అలాగే వాయిస్ రికార్డింగ్ లాగా సేవ్ చేసి ఉంచుతుంది. ఇక ఈ రెండు రకాల ఫైల్స్ ను, అదే టెక్స్ట్ మరియు ఆడియో ఫైల్స్ ను మీ ఫోన్లో ఎవరికంటే వారికి షేర్ చేయచ్చు. అంతే కాకుండా దీనిలోని బిల్ట్ ఇన్ AI algorithm ద్వారా అన్ని టెక్స్ట్ మరియు ఆడియో ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లౌడ్ లోకి చేరిపోతుంటాయి.
దీనిని షర్టు కాలర్ కు తగిలించుకుని రెండు సార్లు తడితే చాలు ఇది మీ వాయిస్ ను టెక్స్ట్ గా మార్చే పనిలో పడుతుంది. ఇక దీనిని కేవలం అరగంట పాటు ఛార్జ్ చేస్తే పూర్తిగా నాలుగు రోజుల పాటు పని చేస్తుంది. ఇది iOS మరియు ఆండ్రాయిడ్ ఫోన్లకు పని చేస్తుంది. దీని మరో ప్రత్యేకత ఏంటంటే దీనిని ఉపయోగించడానికి మన ఫోన్ పక్కన ఉండాల్సిన పని లేదు. మన ఫోన్ ఎక్కడున్నా సరే, దీనిని తగిలించుకుని వెళ్తే చాలు మీ మాటలని ఫోన్లోకి ఎక్కించేస్తుంది. ఇక దీని ధర $145.