టాలీవుడ్(Tollywood)లో స్టైలిష్ దర్శకుడి(Stylish Director)గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి (Surender Reddy) రూపొందించిన స్పై థ్రిల్లర్(Spy Thriller) మూవీ ఏజెంట్(Agent). అఖిల్ అక్కినేని (Akhil Akkineni), సాక్షి వైద్య (Sakshi Vaidya) జంటగా నటించిన, ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్(AK Entertainments Banner)పై అనిల్ సుంకర (Anil Sunkara)నిర్మించిన ‘ఏజెంట్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ట్రైలర్(Trailer) చూసిన తర్వాత అవి రెట్టింపయ్యాయి.ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తం(World Wide)గా విడుదల కానుంది.
ఇక రిలీజ్ డేట్(Release Date) దగ్గర పడటంతో చిత్ర యూనిట్(Movie Unit) ప్రమోషన్స్(Promotions) జోరు పెంచింది. అయితే, ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ‘ఏజెంట్’ మూవీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పలు అభ్యంతరాలు (Objections) వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అయితే అందిన సమాచారం మేరకు సెన్సార్ బోర్డ్ ఏజెంట్ సినిమా చూసిన తర్వాత ఎనిమిది అభ్యంతరాలు తెలిపింది.రెగ్యులేటరీ గైడ్లైన్స్ కు అనుగుణంగా లేకపోవడంతో సినిమాలోని కొన్ని బూతు పదాలు (Cuss Words) మ్యూట్ చేయబడ్డాయి.
దీంతో పాటు ప్రేక్షకులపై ఎటువంటి నెగెటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు రెండు వయొలెన్స్ సీన్లను కూడా బ్లాక్ చేశారట. ఇక ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ చూస్తుంటే సినిమాను హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్లతో స్టైలిష్గా తీసినట్లు స్పష్టమవుతోంది.
ఇదిలా ఉంటే, భారీ బడ్జెట్(Huge Budget)తో రూపొందిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్(Malayalam Mega star) మమ్ముట్టి(Mammothy) కీలక పాత్ర(Key Role)లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్గా నటించగా, హిప్హాప్ తమిజా(Hip Hop Thameeja) సంగీతం(Music) అందించారు.
ఇక ఆదివారం వరంగల్ నగరంలో ఏజెంట్ ప్రీరిలీజ్ రిలీజ్ వేడుక(Pre release Event) గ్రాండ్(Grand)గా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అఖిల్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఏ విధంగా కష్టపడ్డాడో వెల్లడించాడు.
అంతేకాదు ఏజెంట్ మూవీ కథ గురించి తనకు కొంత తెలుసని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ సందర్భంగా ఫాన్స్(Fans) కు తెలిపారు.