ప్లాస్టిక్ వ్యర్ధం ఒక పెను భూతమై కూర్చుంది. దీని వాడకం సౌకర్యంగానే ఉన్నా ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు మాత్రం భూమిలో కరుగడానికి కొన్ని వoదల సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు భూమిలో ఉన్న ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు – అవి కప్పులు, కవర్లు ఇంకే ప్లాస్టిక్ వస్తువైనా కావచ్చు భూమిని కలుషితం చేస్తాయి. భూమినే కాదు మనం నదులలోకీ, సముద్రాలలోకీ పంపిస్తున్న ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు ఆ నీటిలోని జీవరాసులకు కూడా ముప్పు తెచ్చి పెడుతున్నాయి. ఇక దీన్ని తగులబెడితే దాని నుంచీ వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ మనం పీల్చే గాలిని కలుషితం చేస్తుంది. ఇంత కధ ఉంది కాబట్టే ఈ ప్లాస్టిక్ ను ప్రక్షాళన చేయడానికి ఎన్నో పద్ధతుల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి నుండి తిరిగి ఒక రకమైన ఇంధనం తయారు చేసుకోవడం వంటివి ఒక పద్ధతి. కానీ ఇప్పుడు ఒక విలక్షణమైన పద్ధతి గురించి తెలుసుకుందాం. ఇందులో మొట్ట మొదటి సారిగా ప్లాస్టిక్ ను ప్రక్షాళన చేయగా ఒక సురక్షితమైన ఆహార పదార్ధం తయారైంది. ఆ వివరాల్లోకి వెళ్తే
ఆస్ట్రియా కు చెందిన పరిశోధకులు Katharina Unger మరియు తన బృందం ఒక కొత్త సాంకేతిక పరికరాన్ని తయారు చేసారు. ఇందులో ప్లాస్టిక్ ను ఒక రకమైన fungi పూర్తిగా తిని ఫలితంగా పుట్ట గొడుగులు తయారైయ్యాయి. అయితే ఈ పద్ధతిలో ఎలాంటి విష పదార్ధాలు by products గా రాకపోవడం విశేషం. ఈ పరిశోధనకు మూలం మాత్రం 2012 లో యేల్ విశ్వ విద్యాలయం (Yale University) చేపట్టిన ఒక పరిశోధన. ఇందులో భాగంగా వారు అమెజాన్ అడవుల్లో Pestalotiopsis microspora అనే ఒక రకమైన పుట్టగొడుగు (fungus) ప్లాస్టిక్ లో ఉపయోగించే poly urethane ను తిని బ్రతుకుతుందని కనుగొన్నారు. అటు తర్వాత ప్లాస్టిక్ ను తినే fungus ఎన్నో ఉన్నాయని తెలిసిoది. ఇప్పుడు Unger, Julia Kaisinger మరియు Utrecht University in the Netherlands, కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా Fungi Mutarium అనే పరికరాన్ని తయారు చేసారు. Pleurotus ostreatus మరియు Schizophyllum commune అనే fungus ను ఇందులో ఉపయోగించారు.
fungus పెరగడానికి అనువుగా గాలి చొరబడని (anerobic environment) ఒక గాజు పాత్రలో చిన్న చిన్న కప్పులలో UV లైటు ద్వారా sterilise చేసిన ప్లాస్టిక్ ను ఉంచి అందులో ఈ ఎంచుకున్న fungus ను వేసారు. కొన్ని వారాలు మరియు నెలల తరవాత ఈ fungus ప్లాస్టిక్ ను పూర్తిగా తినేసి పుట్టగొడుగులుగా తయారైంది అన్నమాట. ఇవి తినడానికి పూర్తిగా సురక్షితమైనది అని వీరు అంటున్నారు. తినడం సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇది కేవలం ఒక నమూనా (prototype) మాత్రమే. ఇంకా దీని మీద ఎంతో పరిశోధన జరిగి దీనిని ఎంతో మెరుగు పరచాల్సి ఉంది. అయితే దీని ప్రయోజనం మాత్రం అందరూ ఇళ్ళల్లో సైతం ప్లాస్టిక్ ను recycle చేయగలగడమే దీని లక్ష్యం.
వీరి ప్రయత్నం ఫలించి ఈ ప్లాస్టిక్ మహమ్మారి నుంచీ మనకు త్వరగా విముక్తి దొరకాలని ఆశిద్దాం.