అగ్ని తో మనందరికీ ప్రతీ నిత్యం సంపర్కం ఉంటూనే ఉంటుంది. అటువంటి అగ్ని సంబంధిత వస్తువుల విషయంలో మనం ఏమరపాటుగా ఉన్నామా నిప్పుతో చెలగాటం ఆడినట్టే. ఎందుకంటే ఒక్కసారి అగ్గి రాజుకుంటే ఇక ఆ అగ్ని జ్వాలలకు అన్నీ ఆహుతి అయిపోవాల్సిందే. ఇందుకు సాక్ష్యంగా మనకు చరిత్రలో మర్చిపోలేని అగ్ని ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు కొన్నేళ్ళ క్రితం ఉండ్రాజవరంలోని ONGC ప్లాంట్ లో అగ్ని ప్రమాదం వల్ల సంభవించిన మంటలను అదుపులోకి తేవడానికి 3 నెలలు శ్రమించారంటే దీని సామర్ధ్యం ఏంటో మనకు అర్ధం అవుతుంది. ఇళ్ళల్లో, అపార్ట్ మెంట్లలో గ్యాస్ సిలిండర్లు, పరిశ్రమల్లో పేలుడు పదార్ధాలు, అడవుల్లో నిప్పు రవ్వలు ఇలా ఎన్నో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి కారణాలు. అయితే భారీ భారీ పరిశ్రమల్లో, అడవుల్లోని మంటలను అదుపు చేయడానికి ప్రత్యేకమైన శిక్షణ, సిబ్బంది అవసరం. కానీ మన ఇళ్ళల్లోని భద్రత మన చేతుల్లోనే ఉంది. ఇందుకోసం మనం fire extinguisher అయిన ఒక రెడ్ సిలిండర్ ను మనం చూస్తూనే ఉంటాం కానీ దానిని ఎలా ఉపయోగించాలో ఎవ్వరికీ తెలియదు. ఇందుకోసం అత్యవసర సమయంలో ఉపయోగించేందుకు అత్యంత సులభంగా ఎవ్వరైనా ఉపయోగించే ఒక fire extinguisher ను తయారు చేసారు జపాన్ కు చెందిన Bonex అనే సంస్థ. ఇక దాని పని తీరు, ప్రత్యేకతలు మొదలైనవి తెలుసుకుందాం.

Fire extinguisher

Fire extinguisher Fire extinguisher

SAT 119 Eco Throwable Fire Extinguisher. దీన్ని జపాన్ సంస్థ తయారు చేయడం వల్ల ఈ 119 అనే సంఖ్య అక్కడి అత్యవసర సర్వీసులకు సంబంధించినది కాబట్టి ఆ సంఖ్య పెట్టడం జరిగింది. ఇది ప్రత్యేకమైన ప్లాస్టిక్ తో తయారు చేసిన 500 ml బాటిల్. దీనిలో ఉండే ద్రవం ammonium phosphate dibasic, మరియు ammonium bicarbonate ల తో తయారు చేసారు. దీనికి నీటి కంటే 10 రెట్లు మంటలను ఆర్పే శక్తి ఉంది. పైగా దీనిలోని కెమికల్స్ పూర్తిగా non flammable మరియు non explosive. ఈ బాటిల్ మూత తీసినా తీయకుండా విసిరినా, దీన్ని తయారు చేసిన ప్లాస్టిక్ వల్ల ఇది కింద పడగానే విరిగిపోయి ద్రవం బయటికి వచ్చేస్తుంది. దాని వల్ల ఆశ్చర్యకరమైన రీతిలో మంటలు ఆరిపోతాయి. అందుకోసం కింది వీడియో ను చూడచ్చు.

అయితే దీనిలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది గృహాలలో జరిగే చిన్న చిన్న అగ్ని ప్రమాదాల వరకూ పనికొస్తుంది. అంటే ఏదైనా అడవుల్లో, లేదా భారీ పరిశ్రమల్లో సంభవించిన అగ్ని ప్రమాదాలకు అంత ఉపయోగకరం కాదు. పిల్లలూ దీన్ని తేలిగ్గా ఉపయోగించవచ్చు కాబట్టి ఇది ఇళ్ళల్లో తప్పనిసరిగా ఉండాల్సిన అత్యవసర వస్తువు అని చెప్పచ్చు.

Courtesy