దక్షిణ కొరియా(South Korea) స్మార్ట్ దిగ్గజం శాంసంగ్ నిన్న (ఫిబ్రవరి 9)న నిర్వహించిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో(Galaxy Unpacked Event) సరికొత్త ప్రొడక్ట్స్ (Products) లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లతో పాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్8(Galaxy tab S8) సిరీస్ ట్యాబ్లెట్లను రిలీజ్ చేసింది. ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు యాపిల్ ఐప్యాడ్ లైనప్‌కు గట్టి పోటీనిచ్చే ఛాన్స్ ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 సిరీస్‌లో(Samsung Galaxy Tab S8) గెలాక్సీ ట్యాబ్ S8, గెలాక్సీ ట్యాబ్ S8 ప్లస్(Plus), గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రా(ULTRA) అనే మూడు వేరియంట్లు ఉంటాయి. అన్ని మోడల్స్ 5జీ కనెక్టివిటీ(Connectivity)కి మద్దతును ఇస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 12 వెర్షన్(Android 12 Version) అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓఎస్(Out Of the Box)పై పనిచేస్తాయి. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8 సిరీస్ ట్యాబ్లెట్లలోని ఫీచర్ల(Features)ను పరిశీలిద్దాం.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 స్పెసిఫికేషన్లు
గెలాక్సీ ట్యాబ్ S8 అనేది రెగ్యులర్ వేరియంట్. ఇది 11-అంగుళాల WQXGA డిస్ప్లే(Display)తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతిస్తుంది. దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్(Finger Print Sensor)ను కూడా అందించింది. ఈ ట్యాబ్లెట్ ఎస్ పెన్(Tablet 0S)కు మద్దతిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ S8 8 జీబీ, 12 జీబీ ర్యామ్(Ram) ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆక్టా-కోర్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ మోడళ్ల(Storage Model)లో వస్తుంది.
డెడికేటెడ్ కార్డ్ స్లాట్(Dedicated Card Slot)ని ఉపయోగించి స్టోరేజ్‌ను 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఈ టాబ్లెట్‌కు రెండు వైపులా కెమెరాలు ఉంటాయి. దీని వెనుకవైపు, 13 మెగాపిక్సెల్, 6- మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరాలను అందించింది. ఇక, ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను చేర్చింది. టాబ్లెట్‌లో AKG, డాల్బీ అట్మోస్‌తో నడిచే క్వాడ్ స్టీరియో స్పీకర్లను అమర్చింది. శామ్సంగ్ టాబ్లెట్ 8,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్(Fast Charging)కు మద్దతిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8+ స్పెసిఫికేషన్లు..
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 ప్లస్ 12.4 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే(Display)తో వస్తుంది. గెలాక్సీ ట్యాబ్ S8 మాదిరిగానే దీని రెండు వైపులా సింగిల్ సెట్ కెమెరాలను అమర్చింది. డిస్ప్లే కింది భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించింది. ఈ ట్యాబ్లెట్లో 10,090mAh బ్యాటరీ(Battery)ని అమర్చింది. ఈ బ్యాటరీ 45W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రా స్పెసిఫికేషన్లు..
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రా వేరియంట్ అత్యుత్తమ ఫీచర్లతో వస్తుంది. ఈ టాబ్లెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 14.6 -అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే(Display)ను కలిగి ఉంటుంది. గెలాక్సీ ట్యాబ్ 8 అల్ట్రా మోడల్ 8 జీబీ, 12 జీబీ, 16 జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలోని 512 జీబీ స్టోరేజ్‌ను 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. సెక్యూరిటీ కోసం డిస్ప్లే క్రింద ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది. కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 13- మెగాపిక్సెల్, 6 -మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలను చేర్చింది. ఇక, దీని ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం డ్యూయల్ 12 -మెగాపిక్సెల్, 12 -మెగాపిక్సెల్ (అల్ట్రా-వైడ్) కెమెరాల(Cameras)ను పొందుపరచి వుంది. ఈ ట్యాబ్లెట్ 11,200mAh బ్యాటరీ ప్యాక్(Battery Pack)తో వస్తుంది.