బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) రియాలిటీ షో(Reality show) పూర్తవ్వడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో ఆడియన్స్(Audience) కి మరింత ఎంటర్టైన్మెంట్(Entertainment) ఇవ్వడానికి బిగ్ బాస్ టీం(Big Boss Team) కొత్త కొత్త టాస్క్ లు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ (Contestants) మాత్రమే వున్నారు. ఈ వారం నామినేషన్స్ (Nominations) లో శ్రీరామ్ మినహా హౌస్ మేట్స్అందరు నామినేషన్‌లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ లి రోల్ రిక్రియేషన్(Role Recreation) అనే టాస్క్ ఇచ్చి వారి తో కామెడీ చేసి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేయించిన బిగ్‌బాస్. అయితే ముందు గా హౌస్ మేట్స్ కి సూపర్ లగ్జరీ(Super Luxury) ఐటమ్స్ తో సూర్ ప్రెస్(Surprise) ఇచ్చిన బిగ్ బాస్.
పిచ్చా ఫ్రైడ్ చికెన్, పానీ పూరి, బర్గర్ వంటి లగ్జరీ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చి ఎవరికీ ఇష్టమైన ఐటమ్ ని ఎంపిక చేసుకోమన్నారు. ఈ ఐటమ్స్ ని పొందడానికి హౌస్ మేట్స్(House mates) కి గులాబ్ జామున్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ గులాబీ జామున్ తినాలంటే చేతులు ఉపయోగించకూదని షరతు పెట్టాడు బిగ్ బాస్.
ఎవరైతే ఎక్కువగా గులాబ్ జామ్‌లు తింటారో వాళ్లు లగ్జరీ ఐటమ్స్ పొందుతారని చెప్పారు. అయితే హౌస్‌లో ఉన్నవాళ్లలో సిరి తప్ప మిగిలిన వాళ్లెవరూ తినలేకపోయారు.
హౌస్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల నుంచి ఒక్కరి రోల్(Role) ని ఇంకొక్కరు ప్లే చేయాలనీ ఆదేశించిన బిగ్ బాస్(Big Boss). ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్(Voting Booth) నుంచి ప్రేక్షకుల నుంచి ఓటింగ్ అప్పీల్(Voting Appeal) చేసుకునే ఛాన్స్ ఉంటుందని బిగ్ బాస్ బిగ్ ఆఫర్(Offer) ఇచ్చారు. టాస్క్‌లో ముందు గా సన్నీ ప్రియాంకలా మారగ, కాజల్ మానస్‌లా మారిపోయింది. ఇలా ఒక్కొక్కరు వేరే వేరే పాత్ర(Role)లు ధరించి వారిని ఇమిటేట్ చేశారు.
మానస్ క్యారెక్టర్‌లో ఉన్న కాజల్ ప్రతిసారి పింకీకి ఐలవ్యూ చెప్పడాన్ని మానస్ తప్పుపట్టాడు. గబ్బు చేస్తే బాగుండదని మానస్ ముందే హెచ్చరించగా ఎట్ల అనిపిస్తే అట్ల చేస్తామని సన్నీ తేలిగ్గా తీసిపాడేశాడు. ఎంటర్‌టైనింగ్ చేస్తున్నామని కాజల్ చెప్పబోగా ‘ఎంటర్‌టైనింగ్(Entertaining)గా చేస్తే చేయ్ కానీ 100సార్లు ఐ లవ్యూ అని ఎవడు చెప్పాడు?’అని కాజల్‌పై మానస్ సీరియస్ అయ్యాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్ మానస్ క్యారెక్టర్ చేయనని బయటకు వెళ్లిపోయింది.ఆ తరువాత మానస్ ప్రియాంకలా, సన్నీ మానస్‌లా మారిపోయి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు.
మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ జెస్సీలా మారి సిరిని ఓ రేంజ్‌లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ సిరిని ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక కాజల్ సన్నీలా మారి అతన్ని బాగానే ఇమిటేట్(Imitate) చేసింది .
ఇక ఆ తరువాత సన్నీలా సిరి,షణ్ముఖ్‌లా సన్నీ, కాజల్‌లా శ్రీరామ్.. ఆనీ మాస్టర్‌లా మానస్, రవిలా కాజల్, వారి వారి పాత్రలో పెర్ఫామెన్స్ ఇచ్చిపడేశారు. అయితే సన్నీ షణ్ముఖ్ పాత్రని చేస్తూ, సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‌ని మాటి మాటికి హగ్ చేసుకుంటూ రారా అంటూ హగ్(Hug)లతో షణ్ముఖ్‌ని నలిపేసి.. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ షణ్ముఖ్-సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేసి ఫన్(Fun) తోనే వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్ ఇచ్చిపడేశాడు.
సన్నీ చేసిన ఆక్షన్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధంకాక .. షణ్ముఖ్, సిరిలు వారి వారి పాత్రలోనే ఉండిపోయారు. హే.. హగ్ చేసుకోకు అని షణ్ముఖ్ అంటుంటే.. సన్నీ ఫ్రెండ్ షిప్ హగ్ ఫ్రెండ్ షిప్ హగ్ అని పెర్ఫార్మన్స్(performance) చేస్తూనే వెటకారం చేసాడు. మొత్తానికైతే ట్రోలింగ్స్(Trolings)కి కావాల్సినంత కంటెంట్ దొరికేసిందనే చెప్పాలి. ఈ టాస్క్‌లో సన్నీ పెర్ఫార్మన్స్ తో పాటు సిరి, షన్నులను ఓ ఆట ఆడేసుకున్నాడు.
ఇక నేను చపాతీ గాడ్నీ, పులిహోర గాడ్ని అంటూ షన్ను పర్సనల్ ఎమోషన్స్(Personal Emotions) ని కూడా సన్నీ రోల్ ప్లే(Role play) తో వెటకారం చేసి చూపించాడు. దింతో హర్ట్(Hurt) అయినా షన్ను నువ్వు పర్సనల్ ఎమోషన్స్ ని కూడా టచ్ చేసేతున్నావ్ అని కౌంటర్ ఇస్తూనే అందరు తెగ నవ్వుకున్నారు. కానీ సన్నీ ఓవర్ ఆక్షన్ లిమిట్స్ ని క్రాస్ చేయడంతో నువ్వు చేస్తున్నది, బయటకు వేరే విధంగా వెళ్తుంది. నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావ్ అని హెచ్చరించాడు. మొత్తంగా ఈ అప్పడం టాస్క్(Task) లో సన్నీ అప్పడం చేసేసాడు. తన మనసులో ఉన్నదంతా రోల్ ప్లే ద్వారా చూపించేసాడు, మొత్తానికి షన్ను, సిరిలను బ్యాడ్ గా చూపే ప్రయత్నం చేసాడనిపించింది.
అయితే నిజానికి షణ్ముఖ్, సిరిలు గేమ్‌ని గేమ్(game)లాగే చూశారు కాబట్టి ఫన్ మోడ్(Fun Mode) లో సాగింది. వాళ్ళే కనుక సీరియస్ అయ్యి ఉంటే, మళ్లీ ఆట అప్పడం అయ్యేది.