పశ్చిమ దేశాల్లో ఉండే వారికి మంచు తో పరిచయమే. దాని వల్ల వారు పడే ఇబ్బందుల గూర్చి ఇక్కడి వారికి కధలు కధలుగా చెబుతుంటారు. ముఖ్యంగా వారి ఇంటి బయట కొన్ని అడుగుల మంచు పడి వారు బయటకు కూడా వెళ్ళలేకపోవడం అక్కడి వారికి అనుభవమే. అప్పుడు ఒక పారతో ఆ మంచును మొత్తాన్నీ వారి వాహనం మీద నుంచీ, వారి దారి నుంచీ తొలగించుకోవాల్సి వస్తుంది. ఇది చెప్పినంత సులభమేమీ కాదు. కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ఈ కష్టానికి స్వస్తి చెబుతూ ఒక కొత్త మంచు తొలగించే యంత్రాన్ని తయారు చేసారు Rob Kinley మరియు వారి బృందం.
ఈ యంత్రం మీ ఇంటి ముంగిట తిరుగుతూ మంచును అన్ని వైపులా సునాయాసంగా తొలగిస్తుంది. దీనికి ఆరు చక్రాలు, మంచును తొలగించడానికి 50 అంగుళాల వెడల్పాటి బ్లేడు, రాత్రి కూడా మంచు తొలగించడానికి ఉపయోగపడే 10 watts LED లైటు, ఒక మొబైల్ కెమెరా కూడా దీనికి అమర్చారు. అంతే కాదు ఈ యంత్రం తనంతట తానూ ఛార్జ్ అయ్యేటట్టు దీనిలోనే బాటరీ కూడా ఉండడం విశేషం. దీనిని ఒక రిమోట్ ద్వారా మీ మానిటర్ లో చూసుకుంటూ అది అన్ని వైపులా తిరిగేట్టు చేయచ్చు. ఇక ఇది ఎలా పని చేస్తుందో చూడండి.