ఒకప్పుడు పిల్లలంతా కలిసి దొంగా పోలీస్ ఆట ఆడుకునేవారు. ఇక రాబోయే తరాలకు ఈ ఆట లోని మజా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇంటిలో ఏ గదిలో, ఏ గోడ వెనుక, ఫర్నిచర్ కింద దాక్కున్నా కనిపెట్టే పరికరం అందుబాటులోకి రాబోతోంది.
అమెరికా లోని MIT (Massachussetts Institute of technology) లోని CSAIL (Computer Science and Artificial Intelligence lab) కు చెందిన Dina Katabi మరియు Fadel Adib కలిసి RF Capture అనే పరికరాన్ని తయారు చేసారు. దీని ద్వారా మూసి ఉన్న గదిలోని మనిషి ఉన్నడా లేదా, ఉంటే ఎంత మంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో కూడా చెప్పేస్తుంది.

ఈ RF Capture ఒక వై ఫై రౌటర్ లాంటిది. దీనిలో 20 ఎంటేన్న (antenna) లు wireless signals ఆధారంగా పని స్తాయి. ఇవి ఇంటిలోని మనుషుల కదలికలు అంటే నడుస్తున్నాడా, రాస్తున్నాడా, కూర్చున్నాడా అంతెందుకు మనిషి ఉచ్వాసనిశ్వాసలను సైతం చూపించేస్తుంది. ఎలా అంటే దీని నుంచి వచ్చే వైర్లెస్ సిగ్నల్స్ ఇంట్లోకి వ్యాపించి మన శరీర అవయవాలను తాకి పరావర్తనం చెంది ఆ సంకేతాలు దీనిలోని transmitter కు చేరుస్తాయి. ఇవి చూస్తే అన్నీ కలగలపి ఏమీ అర్ధం కావు. కానీ ఇక్కడ CSAIL పరిశోధకులు తయారు చేసిన algorithm ద్వారా ఈ సంకేతాలు, ఒక్కో మనిషి ఎత్తు, బరువును బట్టి ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. అంటే ఇవి ఒక మనిషి లోని తల, మెడ, భుజం, చేతులు, గుండె, కాళ్ళు…ఇలా ఒక రూపాన్ని తయ్యారు చేసి చూపిస్తుంది. అలా గదిలో ఎంత మంది ఉన్నా ఖచ్చితంగా ఒక్కో మనిషికీ, ఒక్కో ప్రత్యేకమైన రూపాన్ని వారి ఎత్తు, ఒంటి తీరు ఆధారంగా వేరు చేసి చూపిస్తుంది. ఇది చాలా వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞ్యానo అని చెప్పచ్చు. ఈ పరికరం కేవలం సెల్ ఫోనులో 1/10000 వంతు రేడియేషన్ ను మాత్రమే ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ SIGGRAPH Asia 2015, జపాన్ లో ప్రదర్శించనున్నారు.

ఈ పరిజ్ఞ్యానాన్ని అభివృద్ధి చేసి అమెరికాలోని ప్రతీ ఇంట్లో ఉపయోగించాలని అనుకుంటున్నారు. దీనిని ఇంట్లో పెట్టడం ద్వారా ఇంట్లో ఎవరైనా పెద్ద వయసు వారు స్పృహ తప్పి పడిపోతే ఈ పరికరం దాన౦తట అదే 911 కు సమాచారమిచ్చే విధంగా దీన్ని తయారు చేయాలని Adib యోచిస్తున్నారు. అంతే కాదు దీన్ని మన ఇంట్లో TV లు, లైట్లు, AC లు వంటి వాటికి కూడా అనుసంధానం చేసుకోవచ్చు.

ఇక ఈ పరిజ్ఞ్యానాన్ని ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. రక్షణ శాఖ, అగ్ని మాపక, మిలిటరీ, గేమింగ్, స్మార్ట్ హోం సెక్యూరిటీ వంటి ఎన్నో రంగాల్లో ఈ పరికరం ఉపయోగపడుతుంది.

Courtesy