డ్రోన్లు ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి చేయబడ్డ పరిజ్ఞ్యానం. ఇంకా దీని యొక్క సామర్ధ్యాన్ని పూర్తి శాతం వినియోగించుకోలేక పోతున్నాం. ఇందుకు కారణాలు చాలా ఉన్నా అందులో ముఖ్యమైనది మాత్రం దీనిని నిర్ణీత flight time తరువాత ఛార్జ్ చేయాల్సి రావడమే. ఇందుకోసం తప్పనిసరిగా డ్రోన్ ను కిందకి దించి కొన్ని గంటలు ఛార్జ్ చేయాలి. ఆ తరువాత మాత్రమే ఇది మళ్ళీ గాలిలోకి ఎగరడానికి అవకాశం ఉంది. ప్రధానంగా డ్రోన్ల వినియోగాన్ని ఆటంకం కలగడానికి ఇదే ప్రధాన కారణం.
అయితే ఈ పరిమితిని అధిగమించి డ్రోన్లను నిరంతరం గాలిలో ఎగిరేలా చేయడానికి ప్రయత్నాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే లండన్ కు చెందిన Imperial College of London లోని Department of Electrical and Electronic Engineering కు చెందిన పరిశోధకులు ఒక ప్రయోగం చేసారు. అదేంటో అది డ్రోన్లను గాలిలో ఉండగానే ఎలా ఛార్జ్ చేస్తుందో చూద్దాం.
ఇందుకు వీరు 100 ఏళ్ల క్రితమే Nikole Tesla ప్రతిపాదించిన inductive coupling ను ఆధారంగా చేసుకున్నారు. ఇంతకీ ఈ inductive coupling అంటే ఏంటో చూద్దాం. రెండు సర్క్యూట్ లను దగ్గరగా ఉంచడం ద్వారా వాటి మధ్య electromagnetic field (విద్యుత్ అయస్కాంత క్షేత్రం) ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక దాంట్లో చేసిన మార్పులు మరో దాంట్లో ఫలితం కనిపిస్తుంది. అంటే ఒక సర్క్యూట్ లో కరెంటు పెంచితే మరో సర్క్యూట్ లో దాని voltage difference కనిపిస్తుంది అన్న మాట.
ఇప్పుడు ఈ పరిశోధకులు ఒక 12 సెంటీమీటర్లు వ్యాసం (diameter) కలిగిన డ్రోన్ ను తీసుకుని దానిలో బాటరీ తీసేసి దాని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో మరి కొన్ని మార్పులు చేసారు. అలాగే దాని చుట్టూ రాగి ని చుట్టారు. అలాగే నేల మీద ఒక సర్క్యూట్ బోర్డు తో తయారైన ఒక transmitter ను ఉంచారు. దానిని ఒక పవర్ సోర్స్ కు కనెక్ట్ చేసారు. ఇప్పుడు ఈ డ్రోన్ ను ఈ transmitter frequency కి ట్యూన్ చేసారు. తద్వారా ఈ transmitter కు చేరే విద్యుత్తు వైర్లెస్ గా ఈ డ్రోన్ కు చేరుతుంది. ఎలా అంటారా ఈ విద్యుత్తును తీసుకోవడానికి మనం పైన చెప్పున్న రాగి తీగ యాంటెన్న లా ఉపయోగపడుతుంది. నేల మీద transmitter వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం వల్ల వచ్చే AC విద్యుత్తును లాక్కుని, డ్రోన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో చేసిన మార్పుల వల్ల అవి DC గా మార్చుకోగలవు. ఇంకేం బాటరీని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండానే డ్రోన్ గాలిలో ఉండగానే ఛార్జ్ అయిపోతుంది అన్న మాట.
అయితే ఈ పద్ధతికి ఒక పరిమితి ఉంది. ఇలా డ్రోన్ గాలిలో ఛార్జ్ కావడానికి అది ఆ అయస్కాంత క్షేత్రం లో అందుబాటులో ఉంటేనే సాధ్య పడుతుంది. అంటే transmitter ను ఉంచిన చోటికి కొన్ని సెంటీమీటర్ల ఎత్తులో మాత్రమే సాధ్య పడుతుంది. ఏది ఏమైనా ఇంత వరకు ఒక ప్రయోగంలో విజయవంతం కావడం ఇదే మొట్ట మొదటి సారి అంటున్నారు ఈ పరిశోధకులు. వీరి అభిప్రాయం ప్రకారం దీనికి మరింత మెరుగులు దిద్ది దీనిని మరో ఏడాది కల్లా వాణిజ్య అవసరాలకు అందుబాటులోకి తీసుకువస్తామని అంటున్నారు ప్రొ. Paul Mitcheson.