ఇస్రో (ISRO)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (Indian Institute of Remote Sensing)లో అనేక  ఉద్యోగాలకు  నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది . ఈ నోటిఫికేష‌న్‌ ద్వారా వివిధ  విభాగాల్లో 16 జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెల‌కు రూ.31,000 జీతం చెల్లిస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతి లో ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల పంప‌డం లాంటి విధానం ఏమీ లేదు. నేరుగా అర్హతలు ఉన్న  అభ్యర్థులు అప్లికేష‌న్ ఫాం ప్రింట్ తీసుకొని ఇస్రో కార్యాల‌యానికి ఇంట‌ర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూ (Interview) తేదీలు అక్టోబ‌ర్ 22, 2021 నుంచి అక్టోబ‌ర్ 27, 2021 వ‌ర‌కు నిర్వహిస్తారు. నోటిఫికేష‌న్‌, మ‌రింత స‌మాచారం కోసం ఆఫీషియల్  వెబ్‌సైట్ https://www.iirs.gov.in/recruitment-walk-in-interview-jrf  లో చూడాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:     

  1. ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
  2. నోటిఫికేష‌న్‌లో అప్లికేష‌న్ ఫాంను నింపి సంబంధిత డాక్యుమెంట్లు (Documents) తీసుకొని ఇంట‌ర్వ్యూకి వెళ్లాలి.
  3. ఇంట‌ర్వ్యూ ద్వారా మెరిట్ (Merit) అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం:

  • కేవ‌లం ఆఫ్‌లైన్(Offline) ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ముందుగా ఇస్రో వెబ్‌సైట్‌(Website)కి వెళ్లి, నోటిఫికేష‌న్ పై క్లిక్ చేయండి
  • నోటిఫికేష‌న్‌లో పూర్తి స‌మాచారం నింపి ఫారం ని ప్రింట్ చేసి, డాక్యుమెంట్ల‌తో ఇంట‌ర్వ్యూకి వెళ్లాలి.
  • ఇంట‌ర్వ్యూ తేదీలు అక్టోబ‌ర్ 22, 2021 నుంచి అక్టోబ‌ర్ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది

అర్హతలు:           

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 16 జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో(JRF) ఉద్యోగాల‌ను, రెండు రీసెర్చ్ అసోసియేట్(RA) ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. ఎం.స్సీ (M.sc), ఎం.టెక్ (M.tech) అర్హత వున్నా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్ ల వివరాలు

  • జేఆర్ఎఫ్-66, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ ఫారెస్టి/ ఎకోల‌జీ/ బీఓటీవై / ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌/ వైల్డ్ లైఫ్/ బ‌యోడైవ‌ర్సిటీ చేసి ఉండాలి. లేదా రిమోట్ సైన్స్‌లో ఎమ్మెసీ, ఎంటెక్ చేసి ఉండాలి.
  • జేఆర్ఎఫ్-67, రిమోట్ సైన్స్‌లో ఎంఈ, ఎంటెక్ చేసి ఉండాలి. లేదా ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్ చేసి ఉండాలి. లేదా బీఈ/ బీటెక్‌లో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ కోర్సులు చేసి ఉండాలి.
  • జేఆర్ఎఫ్-68, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ ఫారెస్టి/ ఎకోల‌జీ/ బీఓటీవై / ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌/ వైల్డ్ లైఫ్/ బ‌యోడైవ‌ర్సిటీ చేసి ఉండాలి.
  • జేఆర్ఎఫ్-69, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫిజిక్స్‌, అట్మాస్పియరిక్ సైన్స్‌, మెట్రోల‌జీలో ఎమ్మెస్సీ/ ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • జేఆర్ఎఫ్-70, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో బాట‌నీ, ఎన్వినరాన్‌మెంట్ సైన్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.
  • జేఆర్ఎఫ్-71, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫారెస్టీ, ఫిజిక్స్‌, మాథ్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.
  • జేఆర్ఎఫ్-72, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో బీఈ/ బీటెక్ లేదా ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.
  • జేఆర్ఎఫ్-73, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎంటెక్ పూర్తి చేయాలి.
  • జేఆర్ఎఫ్-74, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎంటెక్ పూర్తి చేయాలి.
  • జేఆర్ఎఫ్-75, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • జేఆర్ఎఫ్-76, గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.