బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) పెన్నెండో వారం చాలా ఆసక్తికరంగా సాగింది. ఫ్యామిలీ ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ లో పండగా వాతావరణాన్ని తీసుకొచ్చింది. అలాగే వీకెండ్ షో లో మరి కొంత మంది కుటుంబ సభ్యులు వచ్చి స్టేజి పై సందడి చేశారు. అయితే ఆదివారం ఎలిమినేషన్ లో రవి ఎలిమినేట్(Eliminate) అవ్వడం ఎవరు ఊహించలేదు, అటు కంటెస్టెంట్స్ కి, చూసే ప్రేక్షకులకు కూడా షాకింగ్ గా ఉందనే చెప్పాలి.
మరి ఆదివారం నాటి ఎపిసోడ్ హైలైట్స్(High Lights) మీకోసం!
బిగ్ బాస్(Big Boss) షో విన్నర్(Winner) కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ(Prize Money) మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్ విన్నర్ కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ తో పాటుగా షాద్‌నగర్‌లోని సువర్ణభూమి(Suvarna Bhoomi) ఇన్ ఫ్ట్రా స్ట్రక్చర్ నుంచి 25 లక్షలు విలువైన, 300 చదరపు గజాల భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని కింగ్ నాగార్జున అధికారికం (Official)గా ప్రకటించాడు.
ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్మేట్స్ ను అడిగారు నాగ్. అందులో కొంత మంది సొంతింటి కల గురించి చెప్పారు. మరి కొందరేమే సేవా కార్యక్రమాలకు కొంత ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు.
ప్రైజ్ మనీ(Prize money) ని ఎం చేస్తుందో చెప్పే ఛాన్స్ ముందు గా ప్రియాంక కి ఇచ్చిన హోస్ట్ నాగ్. పింకీ మాట్లాడుతూ ‘నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని ఆశ ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా’ అని చెప్పుకొచ్చింది.
శ్రీరామ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్ తో కలిసి ఉండాలన్నది నా కోరిక’ అని చెప్పాడు. ఇక రవి వంతు రాగా ‘కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పాలన్న కోరికను నెరవేర్చుకుంటా’ అని చెప్పాడు రవి.
ఆ తరువాత కాజల్ తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకుంటానంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్(Old Age Home)కట్టాలనుకుంటున్నానని చెప్పింది. సువర్ణ కుటీర్(Suvarna Bhommi Kuteer)లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని (Saloon) బిజినెస్ పెడతానన్నాడు. మానస్ తనకు వచ్చిన డబ్బుతో ప్రొడక్షన్ హౌస్(Production House) నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తానని చెప్పాడు.
షణ్ముఖ్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు 25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో 25 లక్షలిస్తానన్నాడు.
సిరి శ్రీహాన్ పేరెంట్స్ కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధుల(Blind)కు సాయం(Help) చేస్తానని తెలిపింది.
తర్వాత షణ్ముఖ్, ప్రియాంక సే(Safe)ఫ్ అవగా రవి, కాజల్ మాత్రమే నామినేషన్స్(Nominations) లో మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్( Eviction Free Pass)ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్ చేస్తావా? అని నాగ్ సన్నీని అడిగాడు.
ఆ పాస్ తనకు రావడం కోసం ఎంతగానో ఫైట్ చేసిన కాజల్‌కు వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్(Eliminate) అయ్యాడని నాగ్ వెల్లడించాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఉపయోగం లేకపోయింది. రవి కోసం వాడి ఉంటే కనీసం అతడైనా సేవ్(Save) అయ్యేవాడు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేట్ అవ్వడం తో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్(Gift Voucher)ను అతడికి బహుమతిగా ఇచ్చాడు.
హౌస్ మేట్స్(House mates) ఎవరు రవి ఎలిమినేషన్(elimination) ను ఊహించలేకపోయారు. దింతో అందరూ ఎమోషనల్(Emotional) గా ఫీల అయ్యారు , రవి కి కన్నీటి తో వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి త్వరగా యోసే నుంచి బయటకు వస్తానని అనుకోలేదని బాధపడ్డాడు.
తరువాత ఈ బిగ్‌బాస్(Big Boss) జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? అనే ఆట రవి తో ఆడించిన కింగ్ నాగార్జున. షణ్ను పాస్ అయ్యాడని చెప్పడంతో, చాలా మ్యేచురెడ్(Matured) అని చెప్పగా అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు.
లేట్‌గా కనెక్ట్ అయిన చందూలో అన్నీ పాజిటివ్సే(Positives) ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్ చేశాడు. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. టాప్ 5లోకి రావాలని సిరిని మోటివేట్ చేశాడు. మానస్‌ను చూసి చాలా ఇన్స్పైర్(Inspire) అయ్యానంటూనే అతడికి ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు.
షణ్ను ఎంతకూ కన్నీళ్లను ఆపుకోలేకపోవడంతో రవి. నేనెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్(Big Boss) హౌస్ లో హౌస్ మేట్స్(Housemates) లో ఆట తీరు మారొచ్చు .
ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో వూహించనివే జరుగుతుంటాయి. ఇక ముందు కంటెస్టెంట్స్(Contestants) మధ్య గట్టి పోటీనే ఉంటుందనిపిస్తుంది. పదమూడో వారం ఎలా వుండబోతుందో?
ఎలాంటి పరిణామాలు వుంటాయో ? బిగ్‌బాస్(Big Boss) హౌస్ మేట్స్ కి ఎలాంటి ట్విస్ట్ లు ఇవ్వనున్నాడో ? చూడాలి మరి.