లౌక్యం(Laukyam), లక్ష్యం(Lakshyam) చిత్రాలతో వరుస హిట్లు(Hits) అందుకున్న గోపీచంద్(Gopichand), శ్రీవాస్(Srivaas) కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈసారి రామబాణం(RAMA BANAM) అంటూ హ్యాట్రిక్(Hatrick) కొట్టేందుకు సిద్ధమయ్యారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్(TG Viswaprasad), వివేక్ కూచిభొట్ల(Vivek kuchibotla) సంయుక్తంగా నిర్మిస్తున్న(Produced) ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి(Dimple Hayathi) నటిస్తుండగా జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ(Kushboo) కీలక పాత్రలు(Main Role) పోషిస్తున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా విక్కీస్ ఫస్ట్ యారో(First Arrow) చిత్ర బృందం(Movie Unit) ఓ ప్రత్యేక వీడియో(Special Video)ను విడుదల(Release) చేసింది. పవర్ ఫుల్(Powerful) యాక్షన్(Action) సన్నివేశాల(Scenes)తో రూపొందించిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో దర్శకుడు(Director) శ్రీవాస్ గోపీచంద్ పాత్రను చేతికి బాణంలాంటి లాకెట్ ని పెట్టుకుని బాణంలా గమ్యం వైపు దూసుకుపోయే దూకుడు యువకుడిగా మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో గోపీచంద్ పురాణ ఫైట్ సీక్వెన్స్(Fight Sequences) తో మాకో మ్యాన్‌గా ఎంట్రీ ఇవ్వడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.45 సెకన్ల వీడియోలో గోపీచంద్ యాక్షన్ తో అదరగొట్టాడు. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్(Mickey J.Mayor) సంగీతం(Music) అందిస్తున్నారు.
టైటిల్‌కి గోపీచంద్ అభిమానులు, ఫాన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్(Response) తో మేకర్స్ కూడా అంతే థ్రిల్‌గా ఉన్నారు. గ్రాండ్ కాన్వాస్‌పై రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా ఉండేలా శ్రీవాస్ రూపొందించాడు. రామ బాణం చిత్రానికి భూపతి రాజా కథ అందించగా, వెట్రి పళని స్వామి(Vetri Palani Swamy) సినిమాటోగ్రాఫర్(Cinematographer). మధుసూదన్ పడమటి(Madhusudhan Padamati) డైలాగ్స్(Dialogues), ప్రవీణ్ పూడి(Praveen Pudi) ఎడిటర్(Editor)గా వ్యవహరిస్తున్నారు.
ఈ ఎంటర్టైనర్ 2023 వేసవి(Summer)లో విడుదల(Release)కు సిద్ధమవుతోంది. సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.