చిరంజీవి(Chiranjeevi) నటించిన హిట్లర్(Hitler) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో చిరంజీవి నటించిన తీరు, చెల్లెళ్ల పట్ల ఆయన ఎంత ఆరాటపడ్డాడో అందరికీ తెలిసిందే.
అయితే అందులో చిరంజీవి చాలా సీరియస్గా కనిపించడం మనందరం చూశాం.
అదే కథని కాస్త మార్చి ఇప్పుడున్న ట్రెండ్(Trend)కి అప్లై చేస్తే ఎలా ఉంటుందో, హిట్లర్ సినిమా కూడా రీమేక్(Remake)నే అక్షయ్ కుమార్ పరిచయం చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అక్షయ్ కుమార్ తన నలుగురు చెల్లెళ్లతో కలిసి రక్షా బంధన్(Raksha Bandan) అంటూ నవ్వించాడు.
రామ్ చరణ్(Ram Charan) రక్షా బంధన్ ట్రైలర్(Trailer)ను షేర్ చేసారు. అన్నదమ్ముల బంధం ఎంతో పవిత్రమైనదన్నారు. దర్శకుడు(Director) ఆనంద్ ఎల్ రాయ్(Anand L Rai)కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇక అక్షయ్ కుమార్(Akshay Kumar) నటన(Acting)కు ఫిదా(Fida) అయిపోయానని తెలిపాడు. ఈ ట్రైలర్లో అక్షయ్ కుమార్ అందరినీ ఆకట్టుకున్నాడు. నలుగురు చెల్లెళ్లు, వారికి పెళ్లి చేస్తేనే గానీ తాను తన చిన్ననాటి ప్రేయసిని పెళ్లి చేసుకోలేడు చెల్లెళ్లకి పెళ్లి చేసిన తరువాతే తాను చేసుకోవాలి. తన నలుగురు చెల్లెళ్లకి పెళ్లి చేసేందుకు పడ్డ తంటాలను ఎంతో వినోదాత్మకం(Entertaining)గా చూపించేశాడు. కట్నం సమస్యలు, ఆడ పిల్లల సమస్యలను ఎంతో హృద్యం(Heartily)గా చూపించాడు.
ఇక ట్రైలర్ చివర్లో చెల్లికి పెళ్లి చేసేందుకు సిద్దమవుతాడు. నా పెళ్లికి అంత డబ్బు ఎలా వచ్చింది? అని అన్నయ్యను అడుగుతుంది. దుకాణం అమ్మేసాను అని అంటే, మరి మిగతా వాళ్ళపెళ్లిళ్లు ఎలా చేస్తావు అన్నయ్య అని అడుగుతుంది. దానికి జవాబుగా రెండు కిడ్నీలు వున్నాయిగా? అంటూ ట్రైలర్ జోక్(Trailer fun)తో ముగుస్తుంది. మొత్తం మీద ఈ ట్రైలర్ అందరికి ఎమోషనల్ ఫన్ రైడ్(Emotional Fun Ride) లా అనిపిస్తుంది.
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11(AUGUST 11TH)న విడుదల(Release) కానుంది.