పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’ (Radhe Shyam Movie).1960 నాటి వింటేజ్ ప్రేమకథ తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి, మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్(UV Creations), టీ సిరీస్ బ్యానర్ల(T Series Banners)పై భూషణ్ కుమార్(Bhushan Kumar), వంశీ(Vamsi), ప్రమోద్(Pramodh), ప్రసీద(Prasida) సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్(Viral) గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల(OTT Rights)ను దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీపడుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) భారీ మెుత్తానికి రాధేశ్యామ్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ .
సాధారణంగా ఏ మూవీ అయిన థియేట్రికల్ రిలీజ్ అయినా 4 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫాం(Digital Platform)కు వస్తుంది. అంటే ‘రాధేశ్యామ్’ ఏప్రిల్ 11(April 11th) తర్వాతే ఓటీటీ(OTT)లోకి అడుగుపెట్టాలి.
అయితే ఈ మూవీ ఏప్రిల్ 2న ఉగాది పండగ ఉండటంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాధేశ్యామ్ స్ట్రీమింగ్(RadheShyam Streaming) చేయాలని అమెజాన్(Amazon) నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.