బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) లో ఏడో వారం ముగిసింది.
ఆదివారంతో కంటెస్టెంట్స్ బిగ్ హౌస్(Big Boss) లోకి వచ్చి 50 రోజులు ముగిసింది. సండే అంటేనే ఫండే కాబట్టి నాగ్ సార్ హౌస్ మేట్స్(House mates) తో గేమ్స్ ఆడించాడు. ఇందులో భాగంగా నాక్ అవుట్ గేమ్ ఆడాలని అయితే ఓ స్పెషల్ పవర్ ని చివర్లో ఇస్తానని హౌస్ మేట్స్ కి చెప్పాడు నాగ్.
ఈ గేమ్ ను దశల వారి గా ఆడిస్తూ, చివరకు మిగిలిన కంటెస్టెంట్ కు పవర్ ఇస్తాను అని నాగ్ చెప్పాడు.
మరి సండే రోజు జరిగిన ఆ ఫన్ గేమ్స్ ఏంటో? ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారో ఇక్కడ చూద్దాం.
మొదటి టాస్క్(Task) లో పట్టుకోండి చూద్దాం అనే ఆటను ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో పదకొండు పిల్లోలను పెట్టాడు. కానీ ఇంట్లో ఉన్నది పదమూడు మంది. అంటే మొదటి రౌండ్లో ఇద్దరు పక్కకు తప్పుకుంటారన్న మాట.
బజర్ మోగిన తరువాత పరిగెత్తి పిల్లోలను పట్టుకోవాలని నాగ్ చెప్పాడు. పిల్లో దొరకని హౌస్ మేట్స్(House mates) మిగతా వాళ్ల దగ్గరి నుంచి బతిమిలాడి పిల్లోలను తీసుకోవచ్చు లేదా లాక్కోవచ్చు ఏదైనా చేయోచ్చు అని తెలిపాడు.
అయితే కాజల్, సిరిలకు పిల్లోలు దొరకలేదు. కానీ సిరి కోసం షన్ను తన పిల్లోను ఇచ్చాడు. అలా మొదటి రౌండ్ ముగిసే సరికి కాజల్, షన్ను అవుట్ అయ్యారు.
రెండో ఆటగా చలనచిత్ర వీర అంటూ ఆడించాడు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే. పరిగెత్తి గంటను కొట్టి జవాబులు చెప్పాలి. అలా ఎవరు తప్పు చెబితే రెండో రౌండ్ నుంచి తప్పుకుంటారని చెప్పాడు.
ఇంద్ర సినిమాలో చిరంజీవి పాత్రల పేర్లు సరిగ్గా చెప్పలేక జెస్సీ అవుట్ అయ్యాడు.
100 పర్సెంట్ లవ్ మూవీ లో తమన్నా కారెక్టర్ పేరు చెప్పలేక ప్రియ అవుట్ అయింది.
అలా ఈ టాస్క్(Task) లో తప్పు సమాధానాలు చెప్పి మానస్, ప్రియాంక కూడా అవుట్ అయ్యారు. ఆ తరువాత మళ్లీ నీళ్లు కన్నీళ్లు అనే ఆట ఆడించాడు.
ఇంతకు ముందు అవుట్ కంటెస్టెంట్లు తమకు నచ్చిన కంటెస్టెంట్స్(Contestants) ని గెలిపించుకోవడానికి హెల్ప్ చేయొచ్చని చెప్పాడు. ఇక నీళ్లు నింపే టాస్క్ చివరి సమయానికి రవి, లోబో అవుట్ అయ్యారు.
ఆ తరువాత మిసెస్ ప్రభావతి లోబోని తన కోడి కూత తో సేఫ్(Safe) చేసింది. మిగిలిన కంటెస్టెంట్ల(Contestants) కు రకరకాల జంతువలు సౌండ్స్ ను ఇచ్చింది. మిగిలిన ఆనీ, శ్రీరామ, విశ్వ, సిరి, సన్నీలకు మ్యూజికల్ చైర్ ఆటనుపెట్టాడు. ఇందులో మొదటి పాటకే సిరి అవుట్ అయింది.
రెండో సారికి సన్నీ అవుట్ అయ్యాడు. అలా చివరకు శ్రీరామచంద్ర, ఆనీ, విశ్వలు మిగిలారు. తాను ఓ కలర్ పేరు చెబుతాను ఇంట్లోంచి ఆ కలర్ వస్తువులను పట్టుకుని రావాలని నాగ్ తెలిపాడు. ఈ టాస్క్‌లో శ్రీరామచంద్ర ఓడిపోయాడు.
చివరకు ఆనీ, విశ్వలు మిగిలితే టోపీ పోటీ అని టాస్క్ పెట్టాడు. అయితే ఆనీ, విశ్వలకు సపోర్ట్ చేసేవారు విడివిడిగా ఉండమన్నాడు. ఈ టాస్క్ లో ముందు గా విశ్వ టోపీ కింద పడిపోవడం తో ఆనీ మాస్టర్ విన్నర్ గా నిలిచి స్పెషల్ పవర్(Special power) పొందారు.
కానీ ఆ పవర్ ఏంటో అన్నది బిగ్ బాస్(Big Boss) చెబుతాడని తెలిపాడు. అంత వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని సూచించాడు.
ఆ తరువాత రవి, సిరి, జెస్సీ సేఫ్ అయ్యారు. చివరకు మిగిలిన ఆనీ, ప్రియ ఎలిమినేషన్స్(Eliminations) లో ట్విస్ట్ పెట్టాడు. ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారా? అని అనుమానం కలిగించేలా కొద్ది సేపు అందరిని టెన్షన్ పెట్టించాడు.
గార్డెన్ ఏరియాలో ఉన్న పెట్టెలో ఇద్దరూ మాయం అవ్వడంతో ఇంటి సభ్యులు షాక్ తిన్నారు.ఇక ప్రియ ఎలిమినేట్ అయి ఉంటుందని అనుమాన పడ్డ ప్రియాంక వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.
కాసేపటి తరువాత పవర్ రూం నుంచి ఆనీ మాస్టర్ ఏడ్చుకుంటూనే వచ్చింది. ప్రియ ఎలిమినేట్ అవ్వడంతో ఆనీ మాస్టర్ కూడా ఎమోషనల్(Emotional) అయింది.
ఇక స్టేజి మీద కి వచ్చిన ప్రియా కి తన బిగ్ బాస్(Big Boss) జర్నీ చూపించిన నాగ్. ఈ షో కి రావడం వల్ల ప్రపంచాల్లో ఎక్కడ వదిలేసినా కూడా బతికేస్తాను అని ప్రియ ఎంతో గర్వంగా చెప్పుకుంది.
ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు ఇస్తావో ఎందుకు ఇచ్చావో కూడా చెప్పమని ప్రియకు టాస్క్ ఇచ్చాడు నాగ్. అందులో భాగంగా లోబోకు ఐదు మార్కులు ఇచ్చింది. ఎటు ఉంటాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాదు. మన వైపు ఉన్నట్టు ఉంటాడు కానీ ఉండడు.ఏదో ఒక సైడ్ వంద శాతం ఉండు అని సలహా ఇచ్చింది.
విశ్వకు ఐదు మార్కులు ఇచ్చింది. టాస్కుల్లో అందరికీ ఛాన్స్ ఇవ్వు. కొంచెం జాగ్రత్తగా ఆడు. ఎవ్వరినీ హర్ట్ చేయకు, నువ్ హర్ట్ అవ్వకు అని సూచించింది. రవికి ఏడు మార్కులు ఇచ్చింది. చాలా మంచి వాడు. ఇక నిన్ను సిల్లీ కారణాలతో నామినేట్(Nominate) చేసేవారు ఉండరు అని ప్రియ నవ్వుతు సెట్టైరే వేసింది .
సిరి, షన్నులకు ఎనిమిదన్నర ఇచ్చింది. మీ ముగ్గురు ఎప్పటికీ ఇలాగే కలసి వుండండి. గేమ్ బాగా ఆడుతున్నారు ఇలాగే ఆడండి అని సుచించింది. శ్రీరామచంద్రకు ఎనిమిది మార్కులు ఇచ్చింది. అంతగా కలవలేదు. కానీ నాకు పాట నేర్పిస్తాను అని అన్నాడు అని ప్రియ చెప్పగానే, ప్రియ కోసం ఓ పాట పాడమని నాగార్జున అడిగాడు.
ఎందుకంటే ప్రేమంటే మూవీ లోని పాట పాడి అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. ప్రియాంకకు పది మార్కులకు వంద మార్కులు ఇచ్చింది. చాలా మంచిది అని చెప్పుకొచ్చింది.
ఆనీ మాస్టర్‌కు కూడా పది మార్కులు ఇచ్చింది. చాలా చూసి వచ్చింది. కానీ అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంది. కానీ అందరిని క్షమించేస్తుంది. అలానే ఉండండి. అలానే ఆట ఆడండి అని అడ్వైజ్ చేసింది . జెస్సీకి ఎనిమిది మార్కులు ఇచ్చి ఆట విషయానికి వచ్చే సరికి బాగా ఆడుతుంటాడు అని చెప్పింది. కాజల్‌కు ఏడు మార్కులు ఇచ్చింది. మొదట్లో బాగానే ఆట ఆడింది. కానీ ఇప్పుడు ఆమె వేసే ప్రతీ అడుగు మాకు తెలిసిపోతోంది. చాలా జాగ్రత్తగా ఆడు అని సలహా ఇచ్చింది.
మానస్‌కు పది మార్కులు ఇచ్చింది. మానస్ బంగారు కొండ. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. సన్నీకి 9 మార్కులు ప్రియ ఇచ్చింది. ఆటలో ఎన్నో అనుకున్నాం అవన్నీ అక్కడికే వదిలేయాలి. నా ప్లేట్లో తినే హక్కు, నా కాఫీ కప్పులో కాఫీ తాగే హక్కు ఒక్క సన్నీకి మాత్రమే ఉంటుందని ప్రియ చెప్పుకొచ్చింది. ఈ వారం ఇంకా దగ్గర అవుదామని అనుకున్నాను కానీ అంతలోపే ఎలిమినేట్ అవుతున్నారు అని సన్నీ ఎమోషనల్ అయ్యాడు. ఆలా ప్రియా ఎలిమినేషన్(Elimination) తో సండే కాస్త పూర్తయింది ఇక సోమవారం సంగతి ఎలా ఉండబోతోందో. ఈ సారి నామినేషన్(Nomination) ప్రక్రియను ఎలా ప్లాన్ చేసాడో బిగ్ బాస్.