బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) లో సోమవారం నామినేషన్(Nomination) ప్రక్రియ చాలాఆసక్తి గా సాగింది. మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్స్‌లో సన్నీని ఇరికించాలని సిల్లీ రీసన్ తో గేమ్ ఆడిన ప్రియా.
సన్నీ ని గొడవకు లాగే ప్రయత్నం చేసిన ప్రియా. మరి హౌస్ లో ప్రియా సన్నీ ల మధ్య ఎలాంటి వాతావరణం ఏర్పడిందో తెలియాలంటే 45వ ఎపిసోడ్ లో చూద్దాం.
ఇక నిన్నటి నామినేషన్స్(Nominations) లో జరిగిన రచ్చపై సన్నీ, కాజల్, మానస్‌లతో చర్చలు చేసుకుంటారు. ప్రియ నాతో గేమ్ ఆడాలనుకుంది. రవికి సపోర్ట్ చేయాలని అనుకుంటే ఎందుకు నామినేషన్ చేయాలి.. ఇదే పాయింట్ మీద నాగార్జున సార్ నన్ను అడిగితే నేను సమాధానం చెప్తా నా దగ్గర సరయిన కారణం ఉందని సన్నీ చెప్పాడు.
అసలు హౌస్‌లో ఒకే మాట, ఒకే ఆట. ఒకటే టీం గా వుండే షణ్ముఖ్, సిరి, జెస్సీ ఎవరి ఆట వాళ్లు ఆడాలి.
ఫ్రెండ్ షిప్ చూపించకూడదు ఇండిపెండెంట్ ఆట ఆడాలి అంటూ చెప్పడం పై కాస్త కొత్త గా, వింత గా అనిపించింది.
రవిని ఎందుకు నామినేట్ చేశారు. మళ్లీ అతనికి ఎందుకు సపోర్ట్ చేశారో నాకు అర్థం కాలేదని ప్రియను అడిగాడు జెస్సీ.. కాజల్‌ని నామినేట్ చేస్తే ఒప్పుకోడు. అందుకే అతన్ని బుక్ చేద్దాం అనే రవిని నామినేట్(Nominate) చేశా అతని గేమ్ చాలా సిల్లీగా ఉందని చెప్పింది ప్రియ. ‘
రవి టవల్ సోఫాపై ఆరేస్తున్నాడని సిల్లీ రీజన్ చెప్పిందే ప్రియ, ఆ సిల్లీ కారణం చెప్పి రవిని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సన్నీ నామినేషన్స్ విషయంలో చేసింది కరెక్ట్ కాదని అతనితో వాదనకు దిగాడు మానస్.
మరోవైపు కాజల్ కన్నింగ్ గేమ్ ని బయటపెట్టింది ప్రియాంక. ప్రియ దగ్గరకు వెళ్లి మనం కొట్టుకుని తిట్టుకుందాం అప్పుడే జనంలోకి వెళ్తాం అని అడిగిందట.
ఆమె పెద్ద డ్రామా క్వీన్, లేడీ నారద ఈ బిరుదులు నేను ఊరికే ఇ్వవను ఇందుకే ఈ డ్రామాలు చూసే ఇస్తాను అని చెప్పగానే శ్రీరామ్ వామ్మో ఇలా కూడా ఉంటుందా? అని అన్నాడు.
మరోవైపు సన్నీ-రవిలు నామినేషన్స్ పై డిస్కస్ చేసారు. ప్రియా ప్లాన్ ప్రకారమే నిన్ను నామినేట్ చేసింది. టార్గెట్(Target) నువ్వు కాదు. నేను ఆమె నిర్ణయాన్ని మార్చుకోమని నువ్వు ఎందుకు చెప్పలేదు. నిన్నే ఎందుకు నామినేట్(Nominate) చేసిందో అర్థమైందా? అని రవితో అన్నాడు సన్నీ. ఇక ప్రియాంక ఏడుస్తూనే ఉంది. మానస్ కూడా అర్ధం చేసుకోవడం లేదు అని ఆనీ మాస్టర్ దగ్గర ఫీల్ అయింది.
మానస్ ని నేను ఎంత ఇష్టపడతాను. నా మనసు ఏంటో అతనికి తెలియదా. ప్రియాంక చెప్పింది కరెక్టే కదా అని సన్నీతో చెప్పొచ్చు కదా. నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు మానస్ అంటూ బాధపడింది ప్రియాంక .
తరువాత సన్నీ చేసిన తప్పుని ఒప్పుకోడు అని కాజల్ దగ్గర అనడంతో.. సన్నీ తప్పు చేశాడంటే నేను ఒప్పుకోను రవి అని అంటుంది కాజల్ . శ్వేత టాపిక్ తీయడం తప్పుకాదా? అని అనడంతో నా దగ్గర కూడా ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి. నువ్వు కలిసి గేమ్ ఆడదాం అని అంటావు. వెంటనే నామినేట్ చేస్తావు అని కాజల్ అన్నది.
నీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లియర్‌గా నా జీవితంలో నా పెళ్లానికి కూడా ఎక్స్ప్లైన్ నేను వరస్ట్ పెర్ఫామర్ ఇచ్చానంటే దానికి కారణం ఉంది అని చెప్పడంతో సారీ చెప్పింది కాజల్.
అదే కాజల్ మాటలు చూస్తే తన స్ట్రాటజీ(Strategy) తో గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తోంది తన మాటలు అంత ఫేక్ ల కనిపిస్తోంది.
ఇక కెప్టెన్సీ(Captaincy) పోటీదారులు టాస్క్(Task) ఇచ్చిన బిగ్ బాస్(big boss). ప్రభావతి అనే కోడిపెట్ట సమయానుకూలంగా గుడ్లు పెడుతుందని.. అలాగే పై నుంచి గుడ్లు వర్షం కూడా పడుతుందని ఆ గుడ్లను ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్లే కెప్టెన్సీ పోటీదారులు అవుతారని టాస్క్ ఇచ్చారు.
వ్యక్తిగతంగా ఎవరి ఆట వాళ్లు ఆడాలని సంపాదించిన గుడ్లను వ్యక్తిగతంగా కేటాయించిన గూడుల్లో గుడ్లు దాచుకుని కాపాడుకోవాలని చెప్పారు బిగ్ బాస్. ఇక టాస్క్ అలా మొదలైందో లేదో రవి హౌస్ మేట్స్ ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. లోపల ఉన్న గుడ్లు తెచ్చి వాటిని మన స్టిక్కర్లు అంటిస్తే సరిపోతుంది కదా అని ఆనీమాస్టర్కి సలహా ఇచ్చాడు. అప్పుడే ఆట మొదలెట్టేసాడు గేమ్లోరవి తో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు షణ్ముఖ్.
అయితే సన్నీ, మానస్, కాజల్ ఒక టీం గ ఏర్పడి గేమ్ ఆడతారు. గుడ్లు కోసం పోతే ఇక్కడ గుడ్లు నొక్కేస్తార కాబట్టి , మేం గుడ్లు కోసం వెళ్తాం నువ్వు గుడ్లను సేవ్ చేస్తావా అంటూ అని అడిగాడు సన్నీ. కాజల్ సరే అన్నడం తో ఈ ముగ్గురూ కలిసి ఆడుతున్నారని బిగ్ బాస్ షన్ను, సిరి, జెస్సీ లు గుసగుసలాడారు. అయితే మధ్యలో ప్రియ నేను అందరి గుడ్లను దొంగతనం చేస్తా ఎవరు ఏం చేస్తారో చేసుకోండి హ హ అంటూ కాస్త వ్యంగం గా మాట్లాడుతుంది. నేను గుడ్డుకి వెళ్లను బుద్ది వాడతా అని తన గేమ్ స్ట్రాటజీ ని చూపెడతా అంటుంది ప్రియ.
ప్రియ సన్నీ బుట్టలో ఉన్న గుడ్లను దొంగిలించింది. దీంతో సన్నీకి కోపం వచ్చింది.. నా జోలికి వస్తే బాగోదని ముందే చెప్పా? అని అనడంతో బరాబర్ తీసుకుంటా అదే నా గేమ్ దోచుకో పంచుకో ఎవడికీ బయపడేది లేదు నీలాంటోడిని మస్త్ చూసేసినా అంటూ గడ్డిపరక తీసి హేళన చేసింది ప్రియ. దీంతో సన్నీ కోపం రెట్టింపు అయ్యింది డైరెక్ట్‌గా వెళ్లి ప్రియ పక్కన కూర్చుని ర కౌంటర్ ఇచ్చాడు. అయితే ప్రియ మాత్రం సన్నీని రెచ్చగొట్టడానికే తెగ ట్రై చేసింది. సన్నీని మానస్‌ని వేరు చేయడానికి తనకి ఇచ్చిన గుడ్లను మానస్‌కి ఇచ్చి నువ్వు కెప్టెన్ పోటీదారుడు కావాలని చెప్పింది ప్రియ.
అయితే మొదటి రౌండ్ ముగిసే సరికి ఎక్కువ మానస్ దగ్గర 32, సన్నీ దగ్గర 23 గుడ్లు ఉండటంతో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ప్రియాంకతో పాటు ప్రియ కూడా మానస్‌కి గుడ్లు త్యాగం చేసింది. అయితే సిరి గుడ్లపై స్టిక్కర్లు అంటించకుండా ఆమె స్టిక్కర్లు ఎవరో నొక్కేయడంతో సిరి అందరి బెడ్లను చెక్ చేసింది. అందరితో పాటు షణ్ముఖ్, జెస్సీ బెడ్లను చెక్ చేయడంతో షణ్ముఖ్ హర్ట్ అయ్యాడు. అయితే నేను వాళ్ల బెడ్లు చెక్ చేయలేదు. ఏమి చేయకపోయినా నన్నే తిడతారు ఎప్పుడు అంటూ ఏడ్వడం మొదలుపెట్టింది.
సన్నీ నీతో నాకు 15 ఏళ్ల ఫ్రెండ్ షిఫ్ ఉండకపోవచ్చు, కానీ ఈ మూడు వారాలు అనుక్షణం నీతోనే ఉన్నాను. నీ మీద ఎవరైనా అరిస్తే నేను తట్టుకోలేను అని అన్నాడు.చూస్తుంటే, మానస్. మానస్, సన్నీ ల మధ్య చాల మంచి బాండింగ్ వుంది. అయినా సిరి నిన్ను ఎందుకు నామినేట్(Nominate) చేసిందో నాకు అర్థం కాలేదు అని సన్నీ అనడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు మానస్. నాకు ఇక్కడ కొంతమంది పద్దతి నచ్చడం లేదు అని బాధ పడ్డాడు. ఇక బుధవారం ఎపిసోడ్ ప్రోమో (Promo)లో ప్రియా, సన్నీ ల మధ్య గొడవ తారాస్థాయి కె వెళ్లినట్టు చూపెట్టారు.