ఎస్. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ (Sushanth), మీనాక్షి హీరో హీరోయిన్లు గా రూపొందిన చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని AI స్టూడియోస్ & శాస్త్రా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
థ్రిల్లర్ మూవీ (Thriller movie)గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ముందు కు త్వరలో రానుంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Prerelease event) మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఈవెంట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) అతిధి గా విచ్చేసారు.
ఇక ఈ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. భారత దేశం (India) లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా (World-wide)థియేటర్స్ కి రావడానికి సాహసిస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే..ఇది సంతోషించాల్సిన విషయం అన్నారు. ఈ మూవీ లో ఒక పాట ఒక రోజులోనే తీశారు అది చాలా ఆనందం గా ఉందన్నారు,
ప్రవీణ్ సంగీతం (Music)నాకు బాగా నచ్చింది,ఈ మూవీ లోని పాటలు బాగున్నాయి అన్నారు. కరోనా నుంచి మనందరం బయటకు వచ్చి ఇంకా బాగా పనిచేసే రోజులు రావాలని..ప్రజలందరూ అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే రోజులు రావాలని ఈ ఫంక్షన్ (Fucntion)తో మొదలవ్వాలి అని కోరుకుంటున్నాను అని త్రివిక్రమ్ అన్నారు.
‘చిలసౌ’ సినిమాతో సుశాంత్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా చూసే ‘అల.. వైకుంఠపురములో’ మూవీ చేయమని అడిగాను. ‘చిలసౌ’, ‘అల.. వైకుంఠపురములో…’ తర్వాత సుశాంత్‌కు ‘ఇచట వాహనములు నిలుపరాదు’ హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది’’ అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ –
‘ఈ చిత్రం లో దర్శన్ ఓ కొత్త సుశాంత్‌ను చూపించారు’’ అన్నారు. అలాగే ‘త్రివిక్రమ్‌గారు చెప్పింది వాస్తవమని అన్నారు. కెరీర్ మొదట్లో ఎలాంటి మూవీస్ ఎంచుకోవాలి తెలియక రాంగ్ డెసిషన్స్ తీసుకున్నానని, అది నా తప్పే అని అన్నారు.
‘చిలసౌ’ చిత్రం చేస్తున్నప్పుడు, ‘మూవీస్ హిట్టయిన, ప్లాపైనా ఇండిపెండెంట్‌గా ఉండమని’ నాగార్జున గారు సలహా ఇచ్చారు. కాన్ఫిడెంట్ (Confident) గా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాను అని తెలిపారు.
ఇక నిర్మాత హరీశ్ మాట్లాడుతూ
‘‘ ఈ మూవీ కి అసోసియేట్ అవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు . ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, ప్రియదర్శి, శ్రీనివాసరెడ్డి,అవసరాల శ్రీనివాస్, జెమినీ కిరణ్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ చిత్రం హీరో సుశాంత్ కి హిట్ అవ్వాలని కోరుకుంటూ,ఆల్ ది బెస్ట్ సుశాంత్ (All the best Sushanth) …..