త్రీడీ మోషన్(3D Motion) క్యాప్చర్ టెక్నాలజీ(Capture Technology)తో రూపొందిన చిత్రం ఆది పురుష(Aadhi Purush). ప్రభాస్(Prabhas), బాలీవుడ్ డైరెక్టర్(Bollywood Director) ఓం(Om) కంబోలో మన ముందుకు రాబోతున్న ఈ మూవీ జూన్ 16(June 16th)న విడుదల(Release)కు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూవీ నిర్మాతలు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల(Promotional Works)కు సన్నాహాలు చేసకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్(Pre Release)ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
జూన్ 3న తిరుపతిలో ఎస్.వి.గ్రౌండ్లో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ప్లాన్ చేశారు మేకర్స్(Makers). ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(S.S.Rajamouli) కూడా వస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆది పురుష్’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే.. ఈ సినిమా నుంచి త్రీడీ ట్రైలర్(3D Trailer)ను విడుదల చేయటానికి మేకర్స్ రెడీ అయ్యారట.
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు మే 9న ‘ఆది పురుష్’ త్రీడీ ట్రైలర్‌ను విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారట. అయితే డార్లింగ్ అభిమానులు మాత్రం ఈ ట్రైలర్‌ను ఏకంగా వందకు పైగా థియేటర్స్(Theaters) లో రిలీజ్ చేయాలనకుంటున్నారట.
ఇక ఆ రోజున ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికే ‘ఆది పురుష్’ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నప్పటికీ త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాటు పాత్రలను చూపించిన విధానంపై విమర్శలు గట్టిగానే వచ్చాయి. దీంతో దర్శకనిర్మాతలు సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి మళ్లీ వి.ఎప్.ఎక్స్ పనుల(VFX Works)పై ఫోకస్ పెట్టారు.
కరెక్షన్స్ తర్వాత సరికొత్త త్రీడీ ట్రైలర్‌తో ‘ఆది పురుష్’పై అంచనాలను పెంచాలనేది మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది. టి సిరీస్ బ్యానర్(T Series Banner)పై ‘ఆది పురుష్’ చిత్రాన్ని భూషణ్ కుమార్(Bhushan Kumar) నిర్మిస్తున్నారు(Producer).
రామాయణంను ఆధారంగా వస్తున్న ఆది పురుష్ మూవీలో ప్రభాస్(Prabhas) రాముడి(Ramudu)గా, కృతి సనన్(Kriti Sanon) సీత(Seeta)గా నటిస్తుంటే లంకాధిపతి రావణాసురుడు(Ravanasura)గా బాలీవుడ్ స్టార్(Bollywood Star) సైఫ్ అలీఖాన్(Saif Alikhan) నటించారు.