స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) CGL పరీక్ష(Exam)ను ప్రతీ ఏడాది నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వంలోని వివిధ సంస్థలు, విభాగాలు, కార్యాలయాల్లోకి అభ్యర్థులను రిక్రూట్(Recruit) చేయడానికి ఈ నియామకాలు నిర్వహిస్తారు. ఇది జాతీయ స్థాయి పరీక్ష(National Exam) .
ప్రభుత్వ శాఖలలో గ్రూప్ B మరియు గ్రూప్ C పోస్టులకు ఈ పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్(Recruitment) జరుగుతుంది. అయితే పోస్టల్ డిపార్ట్ మెంట్లో(Postal Department) ముఖ్య పోస్టులుగా పరిగణించే పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను(Postal Assistant And Sorting Assistant) SSC సీహెచ్ఎస్ఎల్(CHSL) ద్వారా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపడుతున్నారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే పరీక్షను నిర్వహించి నియమిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై పోస్టల్ డిపార్ట్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి CHSL ద్వారా కాకుండా.. సీజీఎల్ (Combined Graduate Level) ద్వారా ఈ పోస్టులను నియమించనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాదు.. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్(Intermediate) అర్హత(Qualification)గా ఉన్న ఈ పోస్టల్ పోస్టులకు డిగ్రీ(Degree) అర్హతగా మార్చారు.
వచ్చే సంవత్సరం వెలువడే నోటిఫికేషన్ లో ఈ మార్పులు చేయనున్నారు. సెలక్షన్ ప్రక్రియ SSC CGL ఎంపిక విధానం(Selection Process) నాలుగు దశలను కలిగి ఉంటుంది. టైర్ I – కంప్యూటర్ ఆధారిత పరీక్ష. టైర్ II – కంప్యూటర్ ఆధారిత పరీక్ష. టైర్ III – పెన్ మరియు పేపర్ మోడ్ (Descriptive Mode) టైర్ IV – కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్(CPT)/డేటా ఎంట్రీ(Data Entry) స్కిల్ టెస్ట్(Skill Test).
ఈ నాలుగు దశ(Four Rounds)ల్లో ఎక్కడా ఇంటర్వ్యూ(Interview) అనేది నిర్వహించడం జరగదు.