ప్రపంచంలో ఎక్కువ మంది ఇప్పటికే నగరాల్లో జీవిస్తున్నారు. ఈ నగరాల్లో జనాభా ఎక్కువ అవడం వల్ల ఒకే ఊరిలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి ఎంతో సమయం పడుతోంది. అది ప్రభుత్వ పని తీరులోనూ, ప్రజా జీవనంలోనూ ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న 20 ఏళ్ళల్లో ప్రపంచంలో నగరాల్లో నివసించే వారి సంఖ్య మూడింతలు పెరగనుంది. అప్పటి అవసరాలకు రవాణా రంగం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. ఆ పని ఇప్పుడే మొదలు పెట్టింది Airbus సంస్థ. రానున్న 20 ఏళ్లలో కార్, ట్రైన్, ప్లేన్ ఈ మూడింటినీ ఒక్కటి చేస్తూ multimodal transport కు శ్రీకారం చుట్టింది. ఆ కొత్త రకo రవాణా విధానం ఏంటో చూద్దామా.
విమానయాన రంగం మరియు ఆటోమొబైల్ రంగంలోని దిగ్గజాలైన Airbus మరియు Italdesign సంస్థలు రెండూ కలిసి ఒక కొత్త రకం రవాణా పద్ధతిని రూపొందించాయి. అదే ఈ Pop up. ఇది చూడడానికి ఒక చిన్న కార్ లా ఉంటుంది. కానీ కారు చక్రాలకు పాసెంజర్ కాప్సుల్ విడిగా ఉంటుంది అన్న మాట. అంటే అవసరం వచ్చినప్పుడు పైన నాలుగు చక్రాలు తగిలించుకుని కింద కారు చక్రాలను వదిలేసి, ఈ పాసెంజర్ కాప్సుల్ ప్లేన్ లాగా కూడా మరో చోటుకి ప్రయాణీకులను తీసుకు వెళ్ళగలదు. అలాగే ఈ పాసెంజర్ కాప్సుల్ ను ట్రైన్ కు తగిలించి ట్రైన్ లాగా కూడా మారగలదు. అదెలాగో ఇక్కడ వీడియో లో చూడండి. ఈ సంస్థల CEO అభిప్రాయం ప్రకారం రానున్న 20 ఏళ్లలో రోడ్ల మీద పెరిగే రద్దీ ను దృష్టిలో పెట్టుకుని ఒకటే సాధనం బహువిధాలుగా సేవలు అందిస్తేనే నగర జీవనం సజావుగా ఉంటుంది అంటున్నారు Italdesign సీఈఓ Jorg Astalosch. అంతేనా ప్రస్తుతం వాణిజ్య విమానాలు తప్ప ఆకాశ మార్గాన్ని అంతగా వినియోగించుకోవట్లేదని ఇలాంటి బహురూప రవాణ సాధనాల ద్వారా రైలు, రోడ్డు, ఆకాశ మార్గాలను వినియోగించుకోవడం ద్వారా ప్రజా జీవితం మరింత మెరుగవుతుందని అంటున్నారు.
అయితే ఇది ప్రస్తుతం కాన్సెప్ట్ మాత్రమే నని దీనిని వృద్ధి చేసే పనిలోనే ఈ రెండు సంస్థల భాగస్వామ్యం పని చేస్తుందని వీరు అభిప్రాయ పడుతున్నారు. ఈ కాన్సెప్ట్ కార్ ను ఈ సంస్థలు Geneva International Motor Show లో ప్రదర్శించారు.