మన దైనందిన జీవితంలో ఇంటర్నెట్ సాధారణం అయిపొయింది. అలాగే దీనిని ఉపయోగించి ఎంతో సమాచార వ్యవస్థ కూడా నడుస్తోంది. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు మొదలైనవి ఇప్పుడు కంప్యూటర్ లోనే కాదు ఫోన్ లోని బ్లూటూత్ మరియు వైఫై ద్వారా కూడా చేరవేయబడుతోంది. అయితే ఇందుకు ఓ మోడెమ్ అవసరం మళ్ళీ దానికి ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ ఈ తతంగం అంతా ఉంటుంది.
అయితే తాజాగా పరిశోధకులు ఈ క్రమాన్ని సరళీకృతం చేసే పనిలో ఉన్నారు. ఏ వైర్లు అవసరం లేకుండా కేవలం మన స్పర్శ ద్వారా సమాచార మార్పిడి సాధ్యం అంటోంది Panasonic సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం జపాన్ లో జరుగుతున్న CEATEC 2016 Electronics Show లో ఒక నమూనాను ప్రదర్శించింది. అయితే ఇందులో సమాచారానికి గుర్తుగా రంగులను ఉపయోగించడం జరిగింది. ఇందులో ఒక రకమైన రంగు బల్బు పట్టుకున్న వ్యక్తి ఒక receiver ను వాచ్ లా ధరించిన వ్యక్తికి కరచాలనం చేస్తే ఇవతలి వ్యక్తి సమాచారం అదే రంగు అవతలి వ్యక్తికి చేరింది అనడానికి గుర్తుగా అవతలి వ్యక్తి వేసుకున్న స్కర్ట్ ఆ రంగులోకి మారడం మనం చూడవచ్చు.
ఇందులో ఎలాంటి బ్లూటూత్ మరియు వైర్లు అవసరం లేకుండానే కేవలం మన కరచాలనం (hand shake) ద్వారా సమాచార మార్పిడి (Data transmission) జరగడం విశేషం. ఆ వీడియో మీరు పైన చూడవచ్చు. అందులో ఒకరి నుంచి మరొకరికి సమాచారం చేరింది అనడానికి గుర్తుగా ఒక ప్రత్యేకమైన రంగు బల్బు వెలుగుతుంది.
అయితే ఈ సాంకేతికతను భద్రతా వ్యవస్థలో ఉపయోగపడుతుందని ఈ సంస్థ పేర్కొంది. అలాగే స్మార్ట్ హోం సెక్యూరిటీ సిస్టం లలో దీనిని ఉపయోగించవచ్చు. ఉదా మనం చేతి స్పర్శ ద్వారా మాత్రమే మన ఇంటి తలుపు తెరుచుకోవడం వంటివి అన్న మాట. అయితే ఈ పరిజ్ఞ్యానం ఇప్పట్లో మనకు అందుబాటులో రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇవి మనకు అందుబాటులోకి రావచ్చు. అలాగే ఈ పరిజ్ఞ్యానo ఫోన్లలో ఇమిడి రావాలంటే దానికి మరింత సమయం పడుతుందని ఈ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఏది ఏమైనా ఈ వీడియో చూసి దీని సామర్ధ్యాన్ని పరిశీలిస్తే ఔరా అనిపించక మానదు.