భూమి మనం నివసించే గ్రహం. భూమి గురించి దీని పై బ్రతికే మనకు పెద్దగా దీని గురించి పట్టింపు లేకపోయినా, వ్యోమగాములకు ఇది ఒక తియ్యని, మరువరాని, ఉద్వేగభరితమైన నివాసం. అంతరిక్షం నుండి మన భూమిని చూసినప్పుడు కలిగే ఆ భావన కేవలం వ్యోమగాములకు మాత్రమే తెలుస్తుంది, అది వారు మాత్రమే అర్ధం చేసుకోగలరు. ఈ అనంత విశ్వంలో, అంతరిక్షంలో వ్యోమగాములుగా వెళ్ళాలంటే, దానికి ఎంతో చదువుకోవాలి, చాలా దేహదారుడ్యo కావలి. సామాన్యులకు అది ఒక తీరని కల. అంతరిక్షంలో ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అని ఊహించుకోవడమే తప్ప కనీసం ఆ అనుభవం దగ్గరగా కూడా భూమి మీద ఏ పరికరం అనుభవాన్ని ఇవ్వదు. ఇప్పుడు సామాన్యులకు ఆ లోటు తీర్చడానికి National Geographic Channel వారు పూనుకున్నారు. వారు రూపొందించిన ఒక ప్రత్యేకమైన హెల్మెట్ పెట్టుకుంటే మీరు ఉన్న చోటు నుండే అంతరిక్షంలో వెళ్లి భూమిని చూడవచ్చు. ఈ సదుపాయం NGC వారి One Strange Rock అనే సిరీస్ కల్పిస్తోంది.
NGC సంస్థ అంతరిక్షం నుండి షూట్ చేసిన చలన చిత్రాన్ని ఒక థియేటర్ లో ప్రదర్శిస్తారు. అక్కడికి ప్రేక్షకులు ప్రత్యేకంగా రూపొందించిన హెల్మెట్ ను ధరిస్తే అంతరిక్షంలోకి వెళ్లి అచ్చం వ్యోమగాముల అనుభవాన్నే పొందవచ్చు. అయితే ఈ అనుభవాన్ని ప్రేక్షకులకు ఇవ్వడం కోసం ఒక థియేటర్ ను, ఈ helmet ను NGC ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ హెల్మెట్ పెట్టుకుని సినిమా మొదలైతే చాలు మీ అంతరిక్ష ప్రయాణం మొదలయినట్టే. ఇక అంతరిక్షం లోకి వెళ్ళే ముందు మన భుజాలకు, పొట్టకు స్ట్రాప్స్ వేసుకోవాలి. ఆ పైన ఈ helmet లో ఉండే స్క్రీన్ లో మనకు సినిమా కనిపిస్తుంది, ఈ హెల్మెట్ అచ్చం మన వ్యోమగాముల పెట్టుకునే హెల్మెట్ లానే ఉంటుంది. ఆ పైన ఈ helmet గాలి ప్రసరణ కోసం ఒక చిన్న ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక రాకెట్ లాంచ్, అంతరిక్షంలో అడుగు పెట్టడం, అక్కడ నుండు భూమిని చూడటం, మన శరీరం అంతరిక్షపు అనుభవాన్ని పొందడం ఇవన్నీ మనం ఆ థియేటర్ లో ఉన్నప్పుడే పొందవచ్చు. ఈ One Strange Rock సిరీస్ ను మార్చ్ 14న manhattan, అమెరికాలో ప్రదర్శించారు. ఈ సిరీస్ ను భవిష్యత్తులో అమెరికాలోని పలు పట్టణాల్లో ప్రదర్శించే అవకాశం ఉంది.