ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే దాన్ని తయారు చేయడానికి ఆ వస్తువు పరిమాణము, కావలసిన ముడి సరుకు, తయారు చేయబడే పద్ధతి ఇలా ఎన్నో అంశాలు లెక్కలోకి వస్తాయి. వెరసి ఎంతో డబ్బు, సమయం పట్టేది. కానీ ఇప్పుడు 3D ప్రింటింగ్ పుణ్యమా అని క్షణాల్లో మనకు కావలసిన వస్తువు మన కళ్ళ ముందు మనమే తయారు చేసుకోగలుగుతున్నాము. ఈ 3D ప్రింటింగ్ అనేది అన్ని రంగాల్లో పెను విప్లవాత్మకమైన మార్పులకు కారణం కానుంది. వైద్య రంగంలో కూడా ఈ పద్ధతి ఆధారంగా అవయవాలు సైతం తయారు చేసే పనిలో ఉన్నారంటే దీని సామర్ధ్యం ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఆగండి ఆగండి – ఈ 3D ప్రింటింగ్ గూర్చి చెప్పుకుంటూ పోతున్నారు, అసలు ఈ 3D ప్రింటింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారా. అదే ముందు చూద్దాం. ఏదైనా ఒక వస్తువును 3D స్కానర్ ల ద్వారా స్కాన్ చేస్తే అది 3D డిజిటల్ మోడల్ అవుతుంది. ఈ డిజిటల్ మోడల్ ను స్కాన్ చేసి కానీ లేదా మన సృజనాత్మకతను ఉపయోగించి ఏదైనా ఒక కొత్త వస్తువును 3D modelling program ద్వారా కానీ కంప్యూటర్లో సృష్టించాలి. అటు పైన ఈ 3D ప్రింటర్ కు ఆ photoను పంపిస్తే అవి – ఆ వస్తువును కింద నుంచీ పై వరకూ పొరలు పొరలుగా తయారు చేసుకుంటూ పై భాగం పూర్తి అయ్యేసరికి మొత్తం వస్తువు తయారు అయిపోతుంది అన్న మాట.
సరే ఈ 3D ప్రింటర్లు ఉపయోగించే రంగాన్ని బట్టి తయారయ్యే వస్తువు దాని పరిమాణము ఉంటుంది. అలాగే ఇవి ఎంతో ఖరీదైనవి కూడా. కానీ మనం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఒక 3D ప్రింటర్ గురించి చెప్పుకుందాం.
OlO అనే సంస్థ ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా కేవలం $99 కు ఒక విప్లవాత్మకమైన స్మార్ట్ ఫోన్ ప్రింటర్ ను తయారు చేసింది. ఇది ఎలా పని చేస్తుంది అంటే, ఈ Olo యాప్ లో ఉండే ఏ డిజైన్ అయినా 3D ప్రింట్ చేయాలనుకుంటే మన ఫోనులోని యాప్ లో ఆ డిజైన్ ఓపెన్ చేసి, ఫోనును ఈ 3D ప్రింటర్ compartment లోని గాజు కింద పెట్టి, ప్రింటర్ పై భాగంతో మూసి ఉంచగానే ప్రింటింగ్ మొదలవుతుంది. క్షణాల్లో మనకు కావలసిన high resolution 3D ఆబ్జెక్ట్ మన కళ్ళ ముందే తయారై పోతుంది.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ Olo 3D ప్రింటర్ చాలా తక్కువ భాగాలతో తయారైనది. ప్రింటింగ్ చేసేటప్పుడు ఎలాంటి చప్పుడూ లేకపోవడం విశేషం. ఈ సంస్థ ఈ విప్లవాత్మకమైన 3D ప్రింటర్ ను పేటెంట్ చేయదలచుకుంది. డిజిటల్ మోడల్ ను ఈ కింద resolution తో ప్రింట్ చేస్తుంది
X/Y resolution: up to 42 microns
Z resolution: up to 36 microns.
ప్రస్తుతానికి విచిత్రంగా అనిపించే ఈ పద్ధతి భవిష్యత్తులో సర్వ సాధారణం కానుంది. ఏమో ఇది మన దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూద్దాం.
Courtesy