ఐస్ క్రీం. ఇదంటే బహుశా ఇష్ట పడని వారు ఉండరు. పిల్లలు, పెద్దలు సైతం డెసర్ట్ లలో దీనికే ఓటు వేస్తారు. అసలు కేవలం ఐస్ క్రీం లను ఆధారం చేసుకుని ఏటా కొన్ని కోట్ల వ్యాపారమే జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఐస్ క్రీం ను అస్తమానూ తినడం ఆరోగ్యకరమూ కాదు. ఇందులో పోషకాలు తక్కువ కావడం, చక్కెర మరెన్నో పదార్ధాల వల్ల బరువు పెరిగే ఆస్కారం ఉంది. అందువల్ల దీనిని తినే విషయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే వారు కొద్దిగా ఆలోచిస్తారు.

కానీ ఇప్పుడు ఆ చింత అవసరం లేదు. మనందరికీ ఇష్టమైన ఐస్ క్రీం ను మనకు మరింత ఆరోగ్యకరంగా తీర్చి దిద్దారు మన దేశంలోని శాస్త్రవేత్తలు మరియు కొంతమంది వ్యాపారవేత్తలు. వీరి కృషి ఫలితమే పోషకాలతో కూడిన Nutrice Cream. ఇది ఎలా ఉంటుందో చూద్దామా.

మన దేశానికి చెందిన Council of Scientific and Industrial Research (CSIR), Central Food Technological Research Institute (CSIR-CFTRI) మరియు బెంగుళూరు కు చెందిన Oleome Biosolutions, Dairy Classic Ice Creams సంయుక్తంగా పూర్తి శాకాహార పోషకాలతో Nutrice Cream ను తయారు చేసారు. దీనిలో Omega-3 మరియు Vitamin E సమృద్ధిగా ఉన్నాయి. Omega-3 వల్ల పిల్లల్లో మెదడు చురుగ్గా పని చేస్తుంది. అంతే కాదు omega-3 శాకాహారంలో కూడా చాలా తక్కువగా లభిస్తుంది. అందువల్ల రోజులో ఒక్కసారి దీనిని తింటే ఆ రోజుకు కావలసిన omega-3 లభిస్తుందని వీరు అంటున్నారు. అలాగే Vitamin E చర్మ ఆరోగ్యానికీ ఎంతో అవసరం.

CSIR-CFTRI సంయుక్తంగా గతంలోనే పోషకాలతో కూడిన తినుబండారాలను తయారు చేసింది. మనందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీంను ఈ విధంగా ఆరోగ్యకరంగా తీర్చి దిద్దితే మనకు అంత కంటే కావలసింది ఏముంది కదూ.

Courtesy