ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మూవీస్ కోసం ఫాన్స్(Fans) ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్నెళ్ల నుంచి తారక్ రాబోయే సినిమాలపై ఎలాంటి అప్డేట్(Update) రాకపోవడంతో అప్సెట్ అవుతున్నారు. ఎన్టీఆర్ 30, 31వ చిత్రాల నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు తెగ ఎదరుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ 31’ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందపడేలా అదిరిపోయే వార్త ఒకటి సోషల్ మీడియా(Social Media) వైరల్(Viral) అవుతుంది. మరికొద్ది నెలల్లో ఈ సాలిడ్ యాక్షన్ ఫిల్మ్(Action Film) సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటి నుంచే కొద్దికొద్దిగా పనులు మొదలు పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ‘ఎన్టీఆర్31’ను తెలుగు బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్(Mytri Movie Makers) సంస్థ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా(Pan India) స్థాయిలో రూపొందించనున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) చిత్ర నిర్మాణం(Movie Production)పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, NTR31ను కేవలం తెలుగులోనే రూపొందించకుండా కన్నడ(Kannada)లోనూ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మొదట తెలుగులో నిర్మించిన మిగితా భాషల్లో డబ్ చేయాలని భావించారంట. కానీ, ఒకేసారి తెలుగుతో పాటు కన్నడలోనూ నిర్మించబోతున్నట్టు సమాచారం తెలుస్తోంది.
తారక్ కు కూడా కన్నడ భాష స్పష్టంగా రావడంతో పాటు అక్కడా ఆయనకు వీరాభిమానులు ఉండటం మూలంగా డైరెక్ట్ గా కన్నడలోనే నిర్మించాలని భావిస్తున్నారంట. మరోవైపు ఎన్టీఆర్ తల్లి కూడా కన్నడ ప్రాంతానికి చెందినది కావడంతో ‘ఎన్టీఆర్ 31’ను కన్నడ, తెలుగులో బైలింగ్వల్(Bilingual) గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ‘ఎన్టీఆర్31’ నుంచి వచ్చిన పోస్టర్ తోనే అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్(Action Film) ‘సలార్’ను తెరకెక్కిస్తున్నారు. ఇక తారక్ కూడా తన నెక్స్ట్ మూవీ ‘ఎన్టీఆర్ 30’పై ఫోకస్(Focus) పెట్టారు.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ‘ఎన్టీఆర్31’ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నట్టు ఇప్పటికే ప్రశాంత్ నీల్ కూడా క్లారిటీ(Clarity) ఇచ్చారు.