Landmine (ల్యాండ్ మైన్). ఈ మధ్య ఈ పదాన్ని సరదాగా పాటల్లో కూడా ప్రయోగిస్తున్నారు. కానీ ల్యాండ్ మైన్ పేలితే ఎలా ఉంటుందో కొలంబియా వాసులకు బాగా తెలుసు. ప్రపంచంలో అత్యధికంగా ఈ ల్యాండ్ మైన్స్ కు కొలంబియా లో 1990 నుంచి ఇప్పటి దాకా 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. దీన్ని గొరిల్లా యుద్ధం కోసం పొలాల్లో, అడవుల్లో పాతి పెట్టేవారు. అది తెలియక అటుగా వచ్చిన వారు, సైనిక దళాలు, సామాన్యులు కూడా ఈ ల్యాండ్ మైన్స్ కు ప్రాణాలు కోల్పోయారు. దీని నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడానికి కంకణం కట్టుకుంది Lemur Studio అనే ఒక సంస్థ. ఈ సంస్థ ల్యాండ్ మైన్స్ ను కనిపెట్టడానికి ఒక పరికరం తయారు చేయనుంది. మరి అదేంటో తెలుసుకుందామా…
ఈ సంస్థ ఈ ల్యాండ్ మైన్ డిటెక్టర్ కు saveonelife అని పేరు పెట్టింది. ఈ పరికరాన్ని షూ లో అమర్చుకునే విధంగా తయారు చేసారు. దీంట్లో ఒక conductive material మీద ఒక coil ను అమర్చారు. దీన్ని షూ లోని అడుగు భాగంలో పెట్టారు. ఈ coil కు ఉండే electro magnetic field వల్ల వ్యక్తి నడుస్తున్నప్పుడు భూమిలో పాతి పెట్టిన ల్యాండ్ మైన్స్ ను దాని electromagnetic field ఆధారంగా గుర్తిస్తుంది. అలా గుర్తించగానే, ఈ పరికరం లో భాగంగా ఆ వ్యక్తి చేతికి పెట్టుకునే ఒక wearable band వంటి వాచ్ లో అలెర్ట్ కనిపిస్తుంది. అలాగే ఈ దిక్కుకు వెళ్ళాలో కూడా ఈ వాచ్ సూచిస్తుంది. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు రక్షించబడతాయి.
ఇది ప్రస్తుతానికి తోలి దశ లోనే ఉంది. దీన్ని ఈ సంస్థ వారు కొలంబియా మిలిటరీ సహాయంతో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఈ పరికరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి, వారు పెట్టుకున్నట్టు ఒక్క ప్రాణాన్ని కాదు ఎంతో మంది ప్రాణాలు కాపాడాలని ఆశిద్దాం.