Electricity, విద్యుత్తును కనిపెట్టడం ఒక విప్లవమే కదూ. ఇప్పుడు ఆ విద్యుత్తు లేనిదే ఏ పనీ జరగదు అలాగే మనo కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వేసవి దృష్ట్యా విద్యుత్తు ఉత్పత్తి, వినియోగం అటుంచి లోటు విద్యుత్తు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. మరి ఈ లోటును భర్తీ చేయడానికి పవన విద్యుత్తు, సౌర శక్తిని ఇప్పటికే వినియోగించుకుoటున్నాం. మన దేశంలో ఎక్కువ రోజులు ఎండ ఉండటం వల్ల సౌర శక్తికి (solar power) మన దేశం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రభుత్వం ఇస్తున్న రాయీతీల వల్ల ఇప్పటికే సౌర విద్యుత్తు ను పెద్ద పెద్ద సంస్థలే కాకుoడా గృహ అవసరాలకు కూడా వినియోగిస్తున్నాం. అయినా అధిక శాతం దీని పట్ల మొగ్గు చూపక పోవడానికి కారణాలు ఎన్నో. అవి పక్కనుంచితే సౌర విద్యుత్తుకు ఉన్న ప్రధాన పరిమితి వర్షం. వర్షా కాలంలో ఇది ఎక్కువగా ఉపయోగ పడదు అనేది ఒక పరిమితి.
ఈ పరిమితిని అధిగమిస్తూ చైనా కు చెందిన పరిశోధకులు వర్షపు నీటితో కూడా విద్యుత్తును తయారు చేసుకోగల సోలార్ పానెల్స్ (solar panel) ను తయారు చేసారు. మరి వాళ్ళెవరో ఏం చేసారో చూద్దామా.
Ocean University of China (Qingdao) మరియు Yunnan Normal University (Kunming, China) కి చెందిన శాస్త్రవేత్తలు అన్ని కాలాల్లో పని చేసే సోలార్ పానెల్ ను తయారు చేసారు. అంటే, వర్షపు నీటి నుంచీ కూడా విద్యుత్తును తయారు చేస్తాయన్న మాట. ఇందుకోసం వీరు ద్రవ రూపంలోని గ్రాఫీన్ (Liquid Graphene) ను ఉపయోగించారు. ఇక ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. ఈ liquid grapheme తో తయారైన పానెల్ మీద ఎప్పుడైతే మబ్బు పట్టి వర్షపు చినుకులు పడటం మొదలయిందో అప్పుడు ఈ సోలార్ పానెల్స్ graphene energy collection system కు మార్పు చెందుతుంది. ఇందులో కీలకమైంది ఈ liquid graphene. దీని మీద వర్షపు చుక్కలు పడగానే ఆ నీరు పాజిటివ్ మరియు నెగటివ్ అయాన్లు గా విడిపోతుంది. వర్షపు నీటిలోని పాజిటివ్ అయాన్లు గ్రాఫీన్ లోని నెగటివ్ అయాన్లతో react అవుతుంది. ఈ రెండు పొరల మధ్య ఉన్న voltage డిఫరెన్స్ వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
ఇది ప్రస్తుతానికి ఒక proof of concept స్థాయి నుంచీ ఉత్పత్తి స్థాయి లోకి ఈ సోలార్ పానెల్స్ ను తీసుకువచ్చె పనిలో ఈ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ graphene సోలార్ పానెల్స్ (solar panels) అందుబాటులోకి వస్తే సౌర విద్యుత్తు మరింత ఉపయోగపడుతుంది.