మన నిత్య జీవితంలో ఎన్నో రణగొణ ధ్వనులు. ఇది వరకు దూరంగా ప్రశాంతత కోసం ఊరికి దూరంగా ఇళ్ళు కట్టుకునేవారు. ఇక ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఊళ్లు విస్తరిస్తూ నగరాలుగా మారుతున్నాయి. ఏ మాత్రం ఖాళీ స్థలాన్ని వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. వెరసి ఎక్కడ చూసినా రాత్రి పగలూ లేకుండా శబ్ద కాలుష్యం. ఇక ఎవరింట్లో చూసినా ఆగకుండా మోగె గదికో టి.వి. పైగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే గనక ఇక ఆ అల్లరికీ అంతు లేదు. ఇటువంటప్పుడు ఏదైనా పరీక్ష కాని లేదా ఇంటర్వ్యూ కాని అయితే ఎక్కడికైనా మాయమైపోవాలనిపిస్తుంది కదూ. ఇది నాణేనికి ఒక కోణం అయితే రెండో వైపు, ఏదైనా సముద్ర తీరంలో కూర్చొని సముద్ర ఘోషను ఆస్వాదించాలి అనుకుంటే పక్కనే ఎన్నో శబ్దాలు. ఇక ఏదైనా సినిమా చూసేప్పుడు మంచి డైలాగ్ వచ్చే సమయానికి పక్క సీట్ లో చంటి పిల్లల ఏడుపు. హత విధి! వినాలనుకున్నది వినలేకపోవడం, వద్దనుకున్న శబ్దాలు చెవిన పడడం మనిషికి తీవ్ర అసంతృప్తి ని కలిగిస్తాయి.
దీన్ని గుర్తించింది కనుకనే Doppler Labs అనే ఒక కంపెనీ, ఒక సరికొత్త పరికరాన్ని తయారు చేసింది. అదే ఈ Hear Active Listening System. దీనిలో కేవలం రెండు వైర్లెస్ ఇయర్ బడ్స్ మాత్రమే ఉంటాయి, మరియు ఒక యాప్ ను స్మార్ట్ ఫోన్ కు అనుసంధానం చేసుకోవడం ద్వారా పని చేస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ను పెట్టుకోవడం వల్ల మీ చుట్టూ మీరు వద్దనుకున్న శబ్దాన్ని పూర్తిగా మీ చెవిన పడకుండా చేస్తుంది. అలాగే మీరు వినాలనుకున్న శబ్దాన్ని మరింత ఎక్కువగా మీరు వినవచ్చు. ఉదాహరణకు ఇందులోని ఒక ఆప్షన్ ద్వారా ఏదైనా చంటి పిల్లల ఏడుపు మీకు పూర్తిగా వినపడకుండా చేస్తుంది. దీని ధర $ 249.
https://www.youtube.com/watch?v=zlW_xA6haeU
రానున్న కొద్ది సంవత్సరాల్లో Doppler Labs వారి అంచనా ప్రకారం దీన్ని 24 గంటలు ధరిస్తారని ఒక అంచనా. ఇది ఒక అద్భుతమైన పరికరం. అయితే దీని యొక్క ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తే బావుంటుంది. ఎందుకంటే దీని అవసరం ముసలి వారు, హ్రుద్రోగులకే (Heart patients) ఎక్కువ. ఈ కోణంలో వారు సాధారణ ఫోన్లకు కూడా దీన్ని అనుసంధానం చేయగలిగితే ఇది మరింత ఉపయోగకరంగా వుంటుంది.