సాంకేతికత గత పదేళ్ళలో బాగా పెరిగింది. సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లయ్యాయి. లాప్ టాప్లు టాబ్లెట్లు అయ్యాయి. ఇక పై ఏమి రానున్నాయో? దీని వల్ల మన చేతుల్లోకే బ్యాంకింగ్, షాపింగ్, చాటింగ్ ఇంకా ఎన్నో వచ్చి చేరాయి. ఈ వేగాన్ని మరింత పెంచుతూ ఇంటర్నెట్ 2G పోయి 3G, ఇప్పుడు 4G కూడా వచ్చేసింది. ఫలితం ఫోన్లు, మరింత స్మార్ట్ అయ్యాయి. మరి బాటరీ, ఇంకా అక్కడే వుంది. ఎంతటి స్మార్ట్ ఫోన్ అయినా కొన్ని గంటల్లోనే ఛార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి. ఇక ప్రయాణాల్లో అయితే ఈ అవస్థ చెప్పకర్లేదు. పవర్ బ్యాంకు వున్నా కూడా డాని యొక్క బరువు దానికి ఛార్జింగ్ పెట్టాల్సి రావడం వల్ల అది కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యను గుర్తించి సామ్ సంగ్, ఎల్ జి మొదలైన కంపెనీలు బాటరీ లైఫ్ పెంచడానికి పరిశోధనలు చేస్తున్నాయి. ఈ లోపు వారి కంటే ముందే మన ఛార్జింగ్ కష్టాలను తీర్చడానికి వచ్చేసింది ఈ సోలార్ పేపర్ చార్జర్. అదేంటో చూద్దాం.

SC_1

 

SC_2

పేరులోనే తెలుస్తుందిగా ఇది పూర్తిగా సౌర శక్తితో నడిచే చార్జర్. అందువల్ల ఈ చార్జర్ కు ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేదు. కేవలం కొంత సేపు ఎండలో ఉంచితే చాలు, మీ ఫోన్ ని ఎప్పుడైనా ఎక్కడైనా ఛార్జ్ చేసేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పలుచనైన మరియు తేలికైన చార్జర్. దీనిలో రెండు భాగాలు వున్నాయి. మొదటిది సోలార్ షీట్ రెండోది డిస్ప్లే. ఈ సోలార్ పేపర్లోని సోలార్ షీట్లు కేవలం 1.5 మిల్లీ మీటర్ల మందంతో తయారు చేసారు. ఇక రెండో భాగం ఎల్ సి డి డిస్ప్లే 1.1 సెంటీమీటర్ ల మందంతో తయారు చేసారు. ఈ సోలార్ షీట్లకు ఉన్న యుఎస్ బి పోర్ట్ ద్వారా ఫోన్ కు కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేస్తారు. ఇక ఎంత ఛార్జ్ అయ్యిందో డిస్ప్లే చూపిస్తుంది. ఈ చార్జర్ యొక్క మొత్తం బరువు కేవలం 120 గ్రాములు. ఛార్జింగ్ విషయానికి వస్తే, మనం ఛార్జ్ చేసే వస్తువును బట్టి సోలార్ పానెల్ సామర్ధ్యం (Capacity) మారుతూ వుంటుంది. ఈ సోలార్ పానెల్స్ వివిధ కెపాసిటీ లలో లభ్యం అవుతున్నాయి. ఉదాహరణకు 2.5W, 5W, 7.5W, 10W అన్న మాట. స్మార్ట్ ఫోనుకైతే 2.5W సామర్ధ్యం ఉన్న పానెల్ సరిపోతుంది. అదే టాబ్లెట్ కైతే 10W అవసరం అవుతుంది. ఇందులో ఎంబెడెడ్ మగ్నేట్స్ ఉండడం వల్ల అవసరానికి తగ్గట్టు సోలార్ పానెల్స్ వేసుకోవచ్చు. అంటే రిమోట్ లో సెల్స్ వేసినట్టు అన్నమాట.

SC_3

దీని ధర $70. ఈ చార్జర్ ఈ సెప్టెంబర్ లో మార్కెట్ లోకి రానుంది.

Courtesy