Fruits (పండ్లు) మరియు Vegetables (కూరగాయలు), ఇవి మానవాళికి అత్యంత ఆవస్యకమైన పోషకాలను అందజేస్తున్నాయి. శాకాహారి అయినా మాంసాహారి అయినా వారు తీసుకునే ఆహారంలో ఇవి భాగమే. ధనిక, మధ్య, పేద వర్గాల వారు సైతం ధరలు ఎంత మండిపోతున్నా వీటిని కొనుగోలు చేస్తారు. ఇదే అదనుగా చేసుకొని పండ్లు, కూరగాయలను పండించే రీతిలో విపరీతమైన పద్ధతులు చోటు చేసుకున్నాయి. ఎరువులతో పండినవి తినడం మనకు కొత్తేమి కాదు. కానీ, అవి మోతాదుకు మించితే మాత్రం ఆరోగ్యానికి ముప్పేనన్డోయ్. ఉదాహరణకు మామిడిని కార్బైడ్ (Carbide) తో పండించి అమ్మే విషయం మనకు తెలిసినదే. దాని ఫలితంగా ఎక్కువ ధర పెట్టి కొన్న పండ్లు, కూరగాయలు అంత రుచి లేకపోవడం, ఒక్కోసారి లోపల పాడైపోయి, ఇంకా చేదుగా కూడా ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం.

Fresh Fruits at Indian Market

దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనల ఫలితంగా బ్రిటన్ లో ఒక కొత్త స్కానర్ పరికరాన్ని వెలుగులోనికి తీసుకు వచ్చారు. వాటి సహాయంతో  పండ్లు లేదా కూరల యొక్క నాణ్యతను పరీక్షించవచ్చు. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుకుందాం.

మొట్ట మొదట వారు ఈ స్కానర్ సహాయంతో బత్తాయి పండ్లను పరీక్షించారు. అది ఎలాగంటే, ఒక కన్వేయర్ బెల్ట్ (Conveyor Belt) మీద ఒక్కో బత్తాయిని ఒక లైటు ద్వారా స్కాన్ చేసి ఆ పండు యొక్క లక్షణాలను గ్రాఫ్ (Graph) ద్వారా సేకరిస్తారు. అంటే, ఆ పండు రంగు, తీయదనం మొదలైనవి అన్న మాట. విచిత్రంగా వుంది కందండి, మరి రుచి చూస్తే కాని తెలియని విషయాలు ముందే ఎలా తెలుస్తాయి ? అని అనుకుంటున్నారా.

ఎమీలేదండి ఈ స్కానర్ బత్తాయి లోని ఆంతోసైయానిన్ (Anthocyanin) అనే మాలిక్యూల్ (Molecule) ను పసిగట్టి దాని శాతాన్ని గ్రాఫ్ (graph) ద్వారా చూపిస్తుంది. ఆoతోసైయానిన్ అనేది ఒక వర్ణ ద్రవ్యక పదార్థం (Pigment) అది బత్తాయికి రంగుని ఇస్తుంది, దీని యొక్క శాతం ఎక్కువగా ఉంటే పండు తీయగా ఉంటుంది లేదంటే లేదన్నమాట. అంతే.

ఈ విధంగా స్కాన్ చేసిన పండ్లను కొంచెం ఎక్కువ ధరకే అమ్ముతారు. అయితే ఏమి ? ధర ఎక్కువైనా మనకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన తీయని పండ్లు లభిస్తున్నాయి కదండి.

FruitScan_1FruitScan_2

ఇలా పండ్లను స్కాన్ చేసినట్టే కూరగాయలకూ స్కానర్ ను కనిపెట్టారు. అవి కూరగాయలలో ఉన్నపుచ్చులు, కుళ్ళిపోయిన వాటిని కనిపెట్టేస్తుంది. ఆయా పండ్లు లేదా కూరగాయలలో ఉండేటటువంటి వర్ణ ద్రవ్యక (pigment) మాలిక్యూల్స్ ద్వారా ఈ స్కానర్ లు పని చేస్తాయి. ఆ విధంగా పండ్లు లేదా కూరగాయలలో మనకు నాణ్యమైనవి దొరుకుతాయి.

అయితే ఇప్పటికి ఇవి మన దేశ మార్కెట్లోనికి ఇంకా రాలేదు. వస్తే వాటిని కైవసం చేసుకునేవి ముందుగా సూపర్ మార్కెట్లే.  ఇటువంటి స్కానర్ లను ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో పంటలను పండించే పద్ధతుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే హానికారక ఎరువులతో పెరిగిన పండ్లను, కూరగాయలను ఇవి గుర్తించి నిరాకరించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే పంటలు సేంద్రియ పద్దతుల్లో పండించడానికి ఈ స్కానర్ లు కారణమవుతాయి.

Courtesy