నీరు. ఈ భూమి మీద మూడు వంతులు నీరే ఉంటుంది. మనిషి మనుగడకు అత్యంత ఆవశ్యకమైనది నీరు. మహాత్ముడు చెప్పినట్టు “mother earth can satisfy your needs, but not your greed”. అలా నీటిని వృధా చేయడం వల్లనే నేడు ప్రపంచవ్యాప్తంగా నీటికి కరవు పరిస్థితి ఏర్పడుతోంది. తాగు నీటి కోసం, నిత్యావసరాల కోసం నీరు లేక ఎంతో మంది అలమటిస్తున్నారు. మనకూ ఈ నీటి కష్టాలు కొత్తేం కాదు. ఋతుపవనాలు సరిగ్గా లేకపోవడంతో భూ గర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. ఈ నేపధ్యం లో ఉన్న జలాలను కాపాడుకోవడం ఎంతో అవసరం. ఈ దిశలో ప్రపంచ దేశాలూ ప్రయాణిస్తున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు ఉపయోగించే నీటికి మీటర్లను ఏర్పాటు చేయడం, ఇంకుడు గుంటలను ప్రతీ ఇంటికి ఏర్పాటు చేయడం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు. వీటి తో పాటు వ్యక్తిగత బాధ్యత ఉంటేనే ఇప్పుడు ఉన్న జలాల శాతాన్ని పెంచి భావి తరాలకు అందించగలం.

Nebia Water saver shower

Nebia water saver shower

Nebia water saver shower

సాధారణంగా మనిషి స్నానానికి ఎక్కువ నీటిని వినియోగిస్తాడు. ఇక్కడ ఏమాత్రమైనా నీటిని ఆదా చేయగలిగితే అది చాలా మార్పుకు కారణం అవుతుంది. దీనిని గుర్తించింది కనుకనే తన వంతు బాధ్యతగా అమెరికాకు చెందిన ఒక సంస్థ ఒక ప్రత్యేకమైన షవర్ (Shower) ను రూపొందించింది. అదే ఈ nebia shower. ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.

Nebia Shower - 1

Nebia water saver shower

ఈ nebia shower ను తయారు చేయడానికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లోని సాంకేతికతను ఉపయోగించి H2MICRO technology తో దీనిని తయారు చేసారు. అందువల్ల సాధారణ shower కంటే 70 శాతం నీటిని ఆదా చేస్తుంది. ఎలా అంటే nebia ద్వారా ఒక్కో నీటి బొట్టును కొన్ని కోట్ల నీటి చుక్కలుగా మార్చారు. అలాగే ఈ నీటి చుక్కల యొక్క surface area కూడా సాధారణ shower లోని నీటి బొట్టు కంటే 10 రెట్లు ఎక్కువ. అందువల్ల ఇది శరీరాన్ని చాలా తక్కువ నీటిని ఉపయోగించే శుభ్రం చేయగలుగుతుంది. దీనితో స్నానం సాధారణ షవర్ కంటే మెరుగైన అనుభూతిని ఇస్తుంది. కావాలంటే ఇప్పటికే ఉన్న shower హెడ్ ను తీసేసి ఈ nebia shower హెడ్ ను అమర్చుకోవచ్చు.

https://www.youtube.com/watch?v=19xEx23vZtE

ప్రతీ దాంట్లో కొత్తదనాన్ని కోరుకునే వారు ఈ కొత్త అనుభూతిని $300 కు సొంతం చేసుకోవచ్చు. అయితే మధ్య తరగతి వారు మాత్రం ఏ మేరకు దీనిని ఆదరిస్తారో చూడాలి.

Courtesy