బిగ్ బాస్ సీజన్ (big boss season 5) లో నాలుగో వారం గడిచిపోయింది. నామినేషన్(Nomination) లో ఎనిమది మంది నామినేట్ అవ్వగా, శనివారం నలుగురు సేఫ్ అయ్యారు.
ఇక నిన్నటి ఎపిసోడ్ అంటే అక్టోబర్ ౦౩ ఆదివారంనాడు నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్(eliminate) అయ్యారు. అలాగే ఇంటి నుంచి వెళ్తూ గుంటనక్క ఎవరో చెప్పేసారు.
నాగ్ నటించిన నిన్నే పెళ్లాడుతా సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హౌస్ మాట్స్(House mates) సర్ప్రైజ్ ప్లాన్ చేసారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఆదివారం ఎపిసోడ్ చూద్దాం
రవితేజ పవర్ మూవీ నుంచి నోటంకి ,నోటంకి అనే పాటతో ఎంట్రీ ఇచ్చి షో మొదలుపెట్టిన నాగ్. కెప్టెన్ శ్రీరామ్ ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అంటూ, సీజన్ 5 లో ఐదో వారం లో అడుగుపెడ్తున్నాం ప్రతి వారం మీరు హౌస్ మేట్స్(House mates) కోసం సర్ప్రైజ్ లు, ట్రీట్ లు ఇస్తున్నారు .
ఈ సారి మేము మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాము అని చెప్తాడు శ్రీరామ్. హౌస్ మేట్స్ నాగ్ నటించిన నిన్నే పెళ్లాడుతా మూవీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మూవీ లోని సాంగ్స్ తో అలరించారు. అలాగే నాగ్ కి విషెస్ తెలుపుతారు.
ఆ తరువాత నాగార్జున ఇంటి సభ్యులతో గేమ్స్ (Games) ఆడించాడు. సినిమాల పేర్లు రాయడం, వాటిని గెస్ చేయడం, దాక్కో దాక్కో మేక అంటూ గేమ్స్ ఆడించాడు.
ఇక మధ్యలో యానీ మాస్టర్, సిరి సేఫ్ అయినట్టు ప్రకటించారు. చివర్లో లోబో, నటరాజ్ మాస్టర్లు ఉండగా వారి లో ఒక్కరు ఎలిమినేట్ అవ్వుతారు అని చెప్తాడు.
శ్రీరాం, నటరాజ్, యానీ, ప్రియ, మానస్, జెస్సీ, సిరి, రవిలను ఓ టీంగా, మిగిలిన వారందరినీ కూడా మరో టీంగా విభజించాడు. ఈ టీం లకు శ్రీరామ్ హమీద లను కెప్టెన్ లుగా ప్రకటించాడు.
ఇందులోంచి ఒక్కో కంటెస్టెంట్ రావడం ఓ మూవీ పేరును మాటలతో మాట్లాడకుండా, డ్రాయింగ్ చేసి గెస్ చేయించాలి. అలా కొందరు డ్రాయింగ్ వేసి కనిపెట్ట కలిగారు.
ఆ తరువాత స్యాక్ బ్యాగ్ ద్వారా యానీ మాస్టర్ సేఫ్(Safe) అయినట్టు తెలిపారు. ఆ తరువాత దాక్కో దాక్కో మేక అనే గేమ్ పెట్టాడు. ఇక ఇందులో మేక అని చెప్పిన కంటెస్టెంట్ పులికి దొరక్కుండా పరిగెత్తాలి అని చెప్పాడు. దొరికితే మేక చచ్చినట్టు.. దొరక్కపోతే పులి చచ్చినట్టు తెలిపాడు.
ఓడిన వారికి పనిష్మెంట్ అని చెప్పాడు.ఈ గేమ్ లో ముందు గా హమీద మేకగా పులిని, శ్రీరామచంద్రను పులిగా చెప్పేశాడు. కానీ హమీద దొరికింది. దీంతో ఐదు నిమిషాలు పాటు మ్యూజిక్ (Music)లేకపోయినా డ్యాన్స్ చేయాలని హమీదకు నాగ్ టాస్క్(Task) ఇచ్చాడు.
శ్రీరామచంద్ర పాట పాడగా.. హమీద డ్యాన్స్ చేసింది. అలా ఈ గేమ్ లో మానస్ అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో జారి పడ్డాడు. అయితే పెద్ద గాయాలేవీ కాలేదు.
ఆ తరువాత సిరి, లోబో, నటరాజ్ మాస్టర్లలో సిరి సేఫ్ అయినట్టు ప్రకటించాడు. చివరగా లోబో, నటరాజ్ మాస్టర్లలో ఈసీజీ పెట్టి ఎవరి హార్ట్ సిగ్నల్ ఫ్లాట్ లైన్ వస్తుందో వారే ఎలిమినేట్ అని తెలుపుతాడు.
అలా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్(Eliminate) అవ్వడంతో హౌస్ మేట్స్ ఎమోషన్ అవుతారు
స్టేజి మీద కి వచ్చిన నటరాజ్ మాస్టర్ ఎమోషన్ ఆవ్వుతారు. అలాగే మాస్టర్ కి జంతువులు అంటే ఎక్కువ ఇష్టమని, హౌస్ మేట్స్ ను జంతువులతో పోల్చమని టాస్క్ ఇచ్చాడు నాగ్.
సిరి పాములాంటిదని, తన జోలికి వస్తేనే కాటు వేస్తుంది, లేదంటే తన పని తాను చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు.
లోబో ఎలుకలా దూరి వంటగదిలో మొత్తం తినేస్తాడని అన్నాడు.
విశ్వ ఊసరవెల్లి లాంటివాడని చెప్పాడు. శ్రీరామచంద్ర మొసలిలాంటి వాడని, లేనట్టే కనిపిస్తాడు.. కానీ ఇట్టే పట్టేస్తాడు మూడో వారం నుంచి అదే విధానాన్ని మార్చేశాడు అని చెప్పాడు.
ఇక చివరగా గుంటనక్క రవి అనే విషయాన్ని బయటపెట్టేశాడు. అందరికంటే ఎక్కువ తెలివి ఉంటుందని, కానీ అందరి విషయాల్లో తొంగి చూస్తాడు అని నటరాజ్ మాస్టర్ చెప్పేశాడు.
నటరాజ్ మాస్టర్ భార్య గర్భవతి కావడం వల్ల తన అవసరం బిగ్ బాస్(Big boss) హౌస్ లో కంటే భార్య దగ్గరే ఎక్కువ అవసరం ఉందనుకుని బిగ్ బాస్ మాస్టర్ ని ఎలిమినేట్(Eliminate) చేసారో లేదా ఇది ప్రేక్షకుల డెసిషనో తెలియట్ లేదు.
ఇక ఐదో వారం ఎలా వుండబోతుందో మరి……