వాయు కాలుష్యం ప్రపంచమంతటా ఎలా తాoడవిస్తోందో చెప్పేదేముంది. ప్రపంచ దేశాలు హుటా హుటిన వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మన దేశంలోని అన్ని నగరాల్లో కూడా ఈ సమస్య పెద్ద సవాలుగా కూర్చుంది. ఇక మన దేశ రాజధాని ఢిల్లీ, నిజంగానే వాయు కాలుష్యంలో మిగతా నగరాల కంటే ముందు ఉంది. ఈ నగరం మన దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఇక్కడి ప్రజలకు పలు రకాల ఊపిరితిత్తుల సమస్యలు వెంటాడుతున్నాయి. అందువల్ల ఈ సమస్యను సామన్యులు అధిగమించే విధంగా దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా IIT Delhi ప్రొఫెసర్లు, విద్యార్ధులు కలిసి చాలా చౌకగా Nasofilter ను తయారు చేసారు. వివరాల్లోకి వెళ్దామా.

how to use Nasofilter

how to use Nasofilter

IIT ఢిల్లీ పరిశోధకులు అలాగే Nanoclean Global అనే ఫార్మా సంస్థ సంయుక్తంగా ఒక respiratory filter ను రూపొందించాయి. ఇవి గాలిలో ఉండే Particulate Matter (PM) (ఊపిరితిత్తులకు హాని కలిగించే వాయువు లేదా గాలిలో కంటికి కనిపించని పదార్ధాలు) 10 నుండి 2.5 వరకు మన ముక్కు నుండి లోపలి చేరకుండా అడ్డుకుంటాయి. తద్వారా మనల్ని వాయు కాలుష్యం నుండి కాపాడతాయి. ఈ ఫిల్టర్ ను ముక్కులో జాగ్రత్తగా ఈ photoలో చూపించిన విధంగా అమర్చుకోవాలి. ఇవి ఒకసారి పెట్టుకుంటే ఇంచుమించు 8 – 10 గంటలు పని చేస్తుంది. అలా వీటిని వాడి పడేయవచ్చు, పైగా ఇవి మనకు ఏ మాత్రం అసౌకర్యం కలిగించవు. అంతే కాదు ఈ Nasofilter పూర్తిగా biodegradable పదార్ధాలతో తయారైంది. అలా దీనిని రోజూ కార్యాలయానికి వెళ్ళే రహదారిలో, లేదా ట్రైన్లలో ఇంకా పలు రవాణా ప్రాంతాల్లో నిత్యం సంచరించే వారికి బాగా పనికొస్తుంది. ఇక దీని సామర్ధ్యం విషయానికి వస్తే, ఈ ఫిల్టర్ PM 10 ను 100 శాతం అలాగే PM 2.5 ను 95 శాతం సమర్ధవంతంగా అడ్డుకుంటుంది.

Nasofilter

Nasofilter

ఈ Nasofilter ఈ ఏడాది ప్రారంభం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇక దీని ధర ఒక్కోటి కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇవి ప్రస్తుతం amazon వంటి అన్ని e-commerce వెబ్ సైట్లలో కూడా లభిస్తున్నాయి. దీనిని NanoClean Global అనే సంస్థ 10 filters మరియు 30 filters బాక్స్లలో విక్రయిస్తోంది. అంటే, కేవలం 300 కే ఇవి దొరుకుతాయి.

ఈ Nasofilter కు 2017 Startup National Award లభించింది. ఈ అవార్డును ఈ బృందం మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. అంతే కాదు ఈ Nasofilter ను సౌత్ Korea ప్రభుత్వం ప్రపంచపు అత్యుత్తమ 50 స్టార్ట్ అప్స్ లో ఒకటిగా గుర్తించింది.

ఇక పై వాయు కాలుష్యానికి వెరచి ముఖాన్ని కప్పుకోనవసరం లేదు. స్వేచ్చగా ఉండచ్చు కదూ, పిల్లలు, పెద్దలు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు కదూ. ఇది ఇంటిల్లిపాదీ వాడదగిన ఫిల్టర్ అనడంలో సందేహం లేదు. ఇటువంటి వాటిని ప్రభుత్వం గుర్తించి, వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో పేదలకు, తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉచితంగా పంపిణీ చేస్తే బావుంటుంది.

Courtesy