యువ దర్శకుడు(Young Director) వివేక్ ఆత్రేయ(Vivek Atreya) డైరెక్షన్(Direction)లో న్యాచురల్ స్టార్(Natural Star) నాని(Nani) హీరో(Hero)గా రూపొందిన చిత్రం ‘అంటే సుందరానికి'(Ante Sundaraniki).
రొమాంటిక్ కామెడీ(Romantic Comedy) ఎంటర్టైనర్ (Entertainer) గా వస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mytri Movie Makers Banner)పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు.
జూన్ 10న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ‘అంటే సుందరానికి’ ప్రేక్షకుల(Audience) ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయి లో పేరు తెచ్చుకోలేదు. అంటే సుందరానికి సినిమా ఓటీటీ హక్కుల(OTT Rights)ను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరు మూవీ రిలీజ్‌కి ముందే ఇన్స్టాగ్రామ్(Instagram)లో ప్రకటించారు. ఈ చిత్రం మలయాళీ భామ నజ్రియా నజీమ్(Nazriya Nazeema), నాని సరసన హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ చిత్రం ఓటీటీలో వెంటనే విడుదల కాదని ఆయన చెప్పినా ఇప్పుడు మాత్రం విడుదలకు రెడీ గా వుంది. ఇటీవల కాలంలో టాప్ హీరోల సినిమాలు అయినా సరే సరిగ్గా కలెక్షన్స్ కనుక రాకుంటే రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్(Agreement) ఇదివరకే జరిగి ఉన్న క్రమంలో ఈ సినిమా నిర్మాత చెప్పినట్టు లేట్ కాకుండా సరిగ్గా 28 రోజులకే డిజిటల్(Digital) లో టెలికాస్ట్ కానుంది. ఈ చిత్రంలో సుందర్‌గా నాని, లీల పాత్రలో నజ్రియా నజిమ్ కనిపించగా నరేశ్, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తాజాగా ‘అంటే సుందరానికీ!’ ఓటీటీ రిలీజ్(OTT Release)పై అప్డేట్(Update) వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్(OTT Platform) నెట్‌ఫ్లిక్స్(Netflix) లో తెలుగు(Telugu), తమిళం(Tamil), మలయాళం(Malayalam) భాషల్లో జులై 8(July 8th) నుంచి ఈ సినిమా ప్రసారం(Telecast) కానుంది. మతాంతర వివాహం అనే ఒక సీరియస్ సబ్జెక్ట్ ను ఎంచుకుని చాలా కామెడీగా చూపించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Atreya).
ఇక ఈ సినిమా నెలలోపే నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతున్న క్రమంలో ఇప్పట్లో విడుదల కాదన్న నిర్మాత కామెంట్స్ ను గుర్తు చేస్తూ కామెంట్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు(Netizens) మరికొంతమంది మాత్రం సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్(Comment) చేస్తున్నారు.