ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోలు(Star Heroes)గా, నిర్మాతలుగా రాణిస్తున్న ఆ ఇద్దరు హీరోలు . ఒక్కరు మాస్ మహారాజ(Mass maharaja) రవితేజయితే(Ravi Teja), మరొక్కరు నేచురల్ స్టార్(Natural Star) నాని(Nani). వీరిద్దరి సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి.
శ్రీరామ నవమి(SriRama Navami) గిఫ్ట్(Gift) గా మార్చి ౩౦(March 30th)న నాని మూవీ దసరా(Dasara) విడుదల కానుండగా, వారం రోజుల వ్యవధిలో అంటే ఏప్రిల్ 7(April 7th)న అభిమానులను అలరించడానికి రావణాసుర(Ravanasura)గా వచ్చేస్తున్నాడు హీరో రవితేజ.
ఈ మధ్య కాలంలో హీరోలు మూవీ విడుదలకు ముందు తమ సినిమా ప్రమోషన్స్(Promotions) కోసం సరికొత్త ఆలోచనలతో వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ మూవీ ప్రమోషన్స్ కోసం ఈ ఇద్దరు హీరోలు కలిసి కొత్త ట్రెండ్(New Trend) కి శ్రీకారం చుట్టారు. ఒకరినొక్కరు ఇంటర్వ్యూ(Interview) చేస్తూ యూట్యూబ్(You tube)లో సందడి చేసారు. ప్రస్తుతం వీరి ఇంటర్వ్యూ సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్(Viral) అవుతోంది.
ఈ ఇద్దరు హీరోలు ఇంటర్వ్యూ లో తమ కష్టాలను పంచుకున్నారు. హీరోలుగా కాకముందు తమ లైఫ్ ఎలా ఉండేదో తెలిపారు. హీరోగా కెరీర్ ప్రారంభంలో ఎలా ఉండేదో వివరించారు. కష్టాలు, సుఖాలు పంచుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ ఇద్దరు తమ జర్నీని గుర్తు చేసుకుని ఒకరినొకరు అభినందించుకున్నారు. అంతేకాదు ఇందులో ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. మాటల్లో భాగంగా ఇద్దరం కలిసి సినిమా చేయాలని అనుకున్నారు.
రవితేజ, నాని కలిసి హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ(Multi starrer Moive) చేయాలనే ఆలోచనకు వచ్చారు. నాని, రవితేజ కలిసి సినిమా చేద్దామనుకున్నారు. అయితే ఆ సినిమాని తామే నిర్మించుకుద్దామని కూడా అనుకున్నారు. నాని ఇప్పటికే నిర్మాతగా మారారు. వాల్ పోస్టర్ సినిమా(Wall Poster Cinema)`పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఆ, హిట్ చిత్రాలను నిర్మించారు. మరోవైపు రవితేజ కూడా నిర్మాతగా మారారు.
రావణాసుర` చిత్రంతో ఆయన నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అందుకు `ఆర్టీ` పేరుతో ప్రొడక్షన్(RT Productions) మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో రవితేజ, నాని కలిసి నటించాలనుకున్న చిత్రాన్ని వీరిద్దరే తమ నిర్మాణ సంస్థలపై నిర్మించుకోవాలనుకోవడం విశేషం. ఆ అవకాశం ఎవరికీ ఇవ్వద్దు మనమే చేద్దాం అని అనుకున్నారు ఈ ఇద్దరు హీరోలు. ప్రస్తుతం వీరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇద్దరి ఫాన్స్ తెగ మురిసిపోతున్నారు.
వాస్తవానికి రవితేజ, నాని ఇంటర్వ్యూతో ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు మరో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఇద్దరు కలిసి సినిమాలు చేయాలనుకోవడం హీరోల మధ్య ఉన్న అనుబంధాన్ని, తెలుగు హీరోల మధ్య ఉన్న హెల్దీ రిలేషన్(Healthy Relation)ని చాటి చెబుతుంది. ఇది ఇతర హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
అంతేకాదు ఇలా కలసి ప్రమోషన్స్ సైతం తమ సినిమాలకు హెల్ప్ కావడంతో పాటు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణంక్రియేట్ కావడానికి దోహద పడుతుంది. ఇలా చేయడం వల్ల ఒక హీరో సినిమాని మరో హీరో అభిమానులు ఎంకరేజ్ చేస్తారు, ఆదరిస్తారు.
ఇది సినిమా హిట్ కి కలిసొస్తుందని చెప్పొచ్చు. మరి రవితేజ, నాని కలిసి నిజంగానే సినిమా చేస్తారా? లేదో తెలియదుగానీ, వీరి ఇంటర్వ్యూ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రవితేజ హీరోగా నటించిన `రావణాసుర` చిత్రంలో సుశాంత్ విలన్‌గా నటిస్తుండగా, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ మూవీకి సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ పతాకాలపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. మరోవైపు నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన `దసరా` చిత్రానికి శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహించారు.