బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5), బుల్లితెర రియాలిటీ షో(Reality Show) బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే(Grand Finale) కి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి వుంది. ఆదివారం తో ఈ షో పూర్తి కావస్తోంది. అలాగే బిగ్ బాస్ విజేత(Winner) ఎవరో తేలిపోనుంది.
ఇక 102 వ ఎపిసోడ్ లో హౌస్ లో కంటెస్టెంట్స్ (Contestants)ఏమి చేయాలో తోచక చిన్నపిల్లలుగా మారి కాసేపు సరదాగా దాగుడుమూతలు ఆడారు.
ఆ తరువాత సన్నీ, మానస్ ముచ్చట్లు పెట్టుకున్నారు, ఈ క్రమం లో సన్నీ జర్నలిస్ట్(Journalist) గా మారి మానస్ ని ఇంటర్వ్యూ చేశాడు. సీజన్ 5 మొత్తంలో నీకు ఎవరి గేమ్(Game) నచ్చదు అని అడిగిన ప్రశ్నకు మానస్, శ్రీరామ్ ఆట తనకి నచ్చదని అన్ని అలోచించి ఆడతాడని చెప్తూ ఫస్ట్ నుంచి ఇప్పటివరకూ శ్రీరామ్‌తో మానస్ కనెక్ట్ కాలేదన్నాడు.
ఆ తరువాత సిరి తన జర్నీ చూసే ఛాన్స్(Chance) కల్పించిన బిగ్ బాస్(Big Boss). గార్డెన్ ఏరియా లో వున్నా తన పిక్స్ చూసి సంతషంతో కేరింతలు పెట్టింది.
బిగ్ బాస్(Big Boss) లో సిరి ప్రయాణం అందరి కన్నా ముందుగా మొదలైంది. ఒక ‘అల్లరి పిల్లగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సిరిగా మీరు అందరికీ పరిచయం.
మీ అనుభవాల పునాదులపై మీకుగా మీరు సిరి అంటే ఏంటో ప్రపంచానికి చూపాలన్న తపన ఈ ప్రయాణంలో కళ్ళకు కట్టినట్టు అందరికి కనిపించింది. ప్రతి టాస్క్(Task) లో మీ పోటీదారులు మీకన్నా శారీరకంగా బలంగా వున్నా ఎప్పుడు భయపడకుండా బుద్ధి బలంతో దైర్యంగా విజయం కోసం ప్రయత్నించిన తీరు అందరిని మెప్పించింది. కానీ ఎంతో ధైర్యంగా ఉండే సిరిలో జరుగుతున్న సంఘర్షణ వల్ల మీరు కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎంచుకునేలా చేశాయి. మీ కన్నీళ్లు ఆ విషయాన్ని మౌనంగా చెప్పాయి.
కానీ మీ నవ్వు చేసిన సందడిలో కన్నీళ్లు ఇంకిపోయాయి. ఈని సవాళ్లు వచ్చిన గట్టిగా వాటిని ఎదుర్కొంటు, పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాట మీ విషయంలో నిజమని నిరూపించారు సిరి అల్లరి బిగ్ బాస్ హౌస్ ఇంటికే కళను తీసుకొచ్చింది అని తెలిపాడు.
ఈ బిగ్‌బాస్ ఇల్లు భావోద్వేగాల(Emotional) నిధి అయితే అందులో సిరి మీరు’ అంటూ బిగ్‌బాస్ ఆమెను ప్రశంసించారు. తర్వాత ఆమె జర్నీ వీడియో(Journey Video) చూపించడంతో సిరి ఎమోషనల్(Emotional) అయింది. మరీ ముఖ్యంగా చోటు కనిపించగానే కన్నీళ్లు ఆగలేదు.
తర్వాత ఒక ఫోటోను తనతో తీసుకెళ్ళమనగా, సిరి దొరికిందే ఛాన్స్ అని ఐదారు ఫొటోలు తీసుకొచ్చేసింది. షణ్నుతో కలిసి డ్యాన్స్ చేసిన ఫొటో కూడా పట్టుకొచ్చింది కానీ సర్‌ప్రైజ్(Surprise) ఇద్దామని దాన్ని డైనింగ్ టేబుల్ మాట్స్ మధ్యలో దాచిపెట్టింది.
ఇంతలో బిగ్‌బాస్(Big Boss) అక్కడున్న సెట్‌నంతా తొలగించే క్రమంలో ఆ ఫొటోను కూడా మాయం చేయడంతో సిరి చాలా బాధపడింది. జర్నీ వీడియో(Journey Video)లో మనిద్దరం కంటెంట్ (Content)ఇవ్వడానికే వచ్చాం అని మానస్ అన్నాడంటూ షణ్నుకు చెప్పింది సిరి. దీంతో కోపగించుకున్న షణ్ను ఇందుకే వాళ్ల సాయం తీసుకోవద్దంటాను అని క్లాస్ పీకాడు.
ఇక ఆ తర్వాత టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లను వారి మరపురాని క్షణాలను షేర్ చేసుకోవాలని అక్కడున్న కొన్ని ఫొటోలను బిగ్‌బాస్‌కు ఇవ్వాలని చెప్పాడు. ముందుగా మానస్ మాట్లాడుతూ, టెడ్డీబేర్ టాస్కు(Teddy bear Task)లో విన్ అయినప్పుడు నేను, సన్నీ, యానీ మాస్టర్‌ను సంతోషంతో ఎత్తుకున్నాం అంటూ ఆ ఫొటోను బిగ్‌బాస్‌కిచ్చాడు.
షణ్ముఖ్ మాట్లాడుతూ బిగ్‌బాస్ జర్నీ(Big Boss Journey)లోనే బాధాకరమైన విషయం అమ్మ లెటర్ ముక్కలు కావడం అంటూ దానికి సంబంధించిన ఫొటోను బోర్డుపై పెట్టాడు. సిరి వంతు రాగా ‘బ్రిక్స్ ఛాలెంజ్(Bricks Challenge) కంటే ముందు షణ్నుకు, నాకు గొడవ అయింది.
ఫేక్ ఫ్రెండ్(Fake Friend) అని తిట్టాను కానీ అది తప్పని ఈ టాస్క్ తో తెల్సింది. ఈ జర్నీ మొత్తంలో నాకు అండగా నిలిచింది షణ్ను ఒక్కడే’ అని చెప్పుకొచ్చింది.
ఇక శ్రీరామ్ మాట్లాడుతూ ఈ ఇంట్లో నాకు మంచి బాండ్ కుదురిన ఫస్ట్ పర్సన్ హమీదా. ఆమె వెళ్లిపోయాక చాలా బాధేసింది. చాలా మిస్ అవుతున్నాను, ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఈమె ఉండుంటే డల్ అయ్యిపోయాడు అన్న ట్యాగ్ వచ్చేది కాదని ఫీల్అయ్యాడు.
సన్నీ వంతురాగానే బెల్లున్ టాస్కు(Balloon Task)లో నా టీమ్ వాళ్లే నన్ను వరస్ట్ పర్ఫామర్(Worst performer) అన్నారు. అప్పుడు జైల్లో పడి బాధపడితే మానస్ కూడా ఏడ్చాడు అని చెప్పుకొచ్చాడు. అందరినీ నవ్వించడమే తన గోల్ అని పేర్కొన్నాడు.
ఇక ప్రోమో(Promo)లో కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో ? ఈ టాస్క్ ద్వారా బిగ్ బాస్(Big Boss) కంటెస్టెంట్స్(Contestants) కి ఏ మెలిక పెట్టనున్నారో తెలియాలంటే గురువారం ఎపిసోడ్(Episode) వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే……
.