మన ఆరోగ్యాని(Health)కి మూలం నోరు ఎందుకంటే శరీరాని(Body)కి శక్తినిచ్చే ఆహారపదార్దాలు(Food Items), పానీయా(Drinks)లు అన్ని నోటి ద్వారానే అందుతాయి.
అలాంటి నోరు పరిశుభ్రంగా ఉండాలి. కానీ తీసుకునే ఆహారపదార్దా(Food)ల వల్ల కావచ్చు లేదా ఇతరేతర కారణాల వల్ల కావచ్చు నోటి దుర్వాసన(Bad Breathe) మొదలవుతుంది.
ఈ నోటి దుర్వాసన ఏ కారణం వల్ల వస్తుంది. దాన్ని తగ్గించుకునే మార్గాలు ఉన్నాయా అనేది ఇక్కడ తెలుసుకుందాం. శరీరానికి శక్తినిచ్చే ఆహారాలు ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు ప్రస్తుతం వున్న పరిస్థితులు పాస్ట్ ఫుడ్స్(Fast foods), స్పైసీ ఫుడ్స్(Spicy Foods), ఇలా చాలా రకాలుగా ఆహారం తీసుకుంటున్నారు.
మద్యం(Alchol), శీతల పానీయాలు(Cool Drinks) తాగుతున్నారు ఇవ్వని నోటిగుండానే శరీరం లోకి వెళ్ళతాయి. అయితే సరిగా నోరు శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి నోరు శుభ్రం చేసుకున్న కూడా నోటి దుర్వాసన సమస్య వస్తుంది. రాత్రి నిద్రపోయే సమయంలో నోరు తడారిపోతోంది. నోటిలో అవసరమైన మేరకు లాలాజలం(Saliva) ఉత్పత్తి కాదు దింతో నోటి దుర్వాసన సమస్య వస్తుంది.
అలాగే నాలుక(Tongue) పై చెడు బాక్టీరియా(Bad Bacteia) పేరుకుపోయినపుడు విపరీతమైన నోటి దుర్వాసన(Bad Breathe) వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎప్పటికపుడు చక్కగా బ్రష్(Brush) చేసుకోవాలి. ముఖ్యంగా నాలుకపై వున్నా చెడు బాక్టీరియాను తొలిగించేందుకు టంగ్ క్లీనర్స్ (Tongue Cleaners) వాడుకోవాలి. స్థూలకాయం రాకుండా చక్కటి ఆరోగ్యం కోసం చాలా మంది డైట్(Diet) లో పిండి పదార్థాలను తగ్గించి, ప్రోటీన్(Protein) ఎక్కువ వున్న ఆహారాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రోటీన్ ఎక్కువ గా తీసుకున్నపుడు శరీరం లో కొవ్వు(Fat) కరిగి శక్తి లభిస్తుంది. అయితే ఈ ప్రక్రియ కోసం శరీరం లో ఎక్కువగా కీటోన్స్(Ketones) ఉత్పత్తవుతాయి. కాబటి ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని అవసరమైన మేరకే తీసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు . అలాగే జలుబు(Cold) చేసినపుడు కూడానోటి దుర్వాసన సమస్య ఎదురవుతుంది. ఆ సమయంలో శ్వాసకోశ నాళ్లలో వుండే చెడు బాక్టీరియా నోటి దుర్వాసనను కలిగిస్తుంది.
మరో వైపు కడుపులో అల్సర్(Ulcer) లు ఏర్పడినపుడు కూడా నోటి దుర్వాసన(Bad Breathe) సమస్య వస్తుంది.అల్సర్ లకు కారణమాయే హెచ్ పైలోరీ అనే బాక్టీరియా నోటి దుర్వాసనను కలిగిస్తుంది. కాబట్టి అల్సర్లకు త్వరగా చికిత్స చేసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. జీర్ణ కోశ సమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన కలిగే అవకాశం వుంది. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల శరీరం ఉత్పత్తయిన ఆమ్లాలు గ్యాస్ ఉత్పత్తి చేస్తాయి.
ఇవి నోటి ద్వారా బయటకు రావడం వల్ల నోటి దుర్వాసన కలుగుతుంది. అలాగే దంత సమస్యలు వున్నపుడు నోటి లో చెడు బాక్టీరియా నోటి దుర్వాసనకు కారణముతుంది. కాబట్టి వీలైనంత వరకు దంత సమస్యలు రాకుండా క్రమంగా వైద్యులతో పరీక్షా చేయించుకోవాలి డ్రై ఫ్రూప్ట్స్(Dry Fruits) తీసుకోవం శరీరానికి మంచిది.
అయితే తాజా పండ్లకంటే డ్రై ఫ్రూప్ట్స్ లో చెక్కర శాతం(Sugar Levels) కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన కలిగించే బాక్టీరియా కూడా ఎక్కువగానే ఉంటుంది . డ్రై ఫ్రూప్ట్స్(Dry Fruits) తిన్నపుడు దంత లో కొంత ఇరుక్కుపోయి ఇది దుర్వాసనను కలిగిస్తుంది.
అందుకే డ్రై ఫ్రూప్ట్స్ తిన్న తరువాత వెంటనే బ్రష్(Brush) చేసుకోవాలి. అయితే తాజా పండ్లు తీసుకున్నపుడు దంతాలు(Teeth) జిగుర్లు శుభ్రపడతాయి.
దీంతో నోటి దుర్వాసన సమస్య రావడం చాలా తక్కువ. నోటి దుర్వాసన(Bad Breathe) పోవడానికి ఆయా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నోరు శుభ్రం చేసుకోవడం మంచిది. రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా బ్రష్ చేయడం అలవాటు చేసుకుంటే నోటి దుర్వాసన సమస్యకు సులభంగా స్వస్తి చెప్పచు .
అలాగే నోటి దుర్వాసన సమస్యకు కారణమాయే దూమపానం(Smoking) , మద్యపానం(Drinking) , చెక్కర(Sugar)తో కూడిన శీతల పానీయా(Cool Drinks)లు కెఫిన్(Caffine) వుండే కాఫీ(Coffee), టీ(Tea), లకు దూరంగా ఉండడం మంచిది.