ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ మోటోరోలా (Motorola) మన దేశం లో సరి కొత్త మోటోరోలా స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.
మోటోరోలా ఎడ్జ్ 20 , మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ మోడల్స్ ను కస్టమర్స్ (customers) అందుబాటు లోకి తీసుకురానుంది. ప్రముఖ ఈ -కామర్స్ ఫ్లిప్ కార్ట్ మోటరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్ల అమ్మకాలను ప్రారంభించనుంది.
మోటోరోలా ఎడ్జ్ 20 ని ఆగష్టు 24 న, మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ని ఆగష్టు 27 న అమ్మకాలను ప్రారంభించాలని మోటోరోలా అనుకుంటోంది.
అయితే ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఆగష్టు 24 న ఫ్లిప్ కార్ట్ (Flipkart)లో ప్రీ – ఆర్డర్లును ప్రారంభించాలని మోటోరోలా సంస్థ ప్రారంభించింది.
మోటోరోలా స్మార్ట్ ఫోన్ల ధరలు
ఇందులో కేవలం మోటోరోలా ఎడ్జ్ 20 (Motorola – Edge 20) అందుబాటులో ఉండనుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.29,999గా నిర్ణయించారు.
ఫ్రాస్టెడ్ పెరల్, ఫ్రాస్టెడ్ ఎమరాల్డ్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. కాగా మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 6 ర్యామ్ (RAM)+ 128 ర్యామ్ స్టోరేజ్ (Storage) కలిగిన ఈ ఫోన్ ధర 21,499గా నిర్ణయించారు అని తెలుస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 20 స్పెసిఫికేషన్లు(Specifications)
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టం సప్పోర్ట్ గా పని చేయనుంది. దీని లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ మ్యాక్స్ విజన్ డిస్ప్లే (OLED Max vision Display) ను అమర్చారు.
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4 ర్యామ్‌ను అందించా గా, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి వుంది. ఫోన్ బ్యాటరీ కెపాసిటీ (Battery Capacity) 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల వివరాలలోకి వెళితే
ఇందులో వెనుక భాగం లో 3 కెమెరాలను పొందుపరిచారు.వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో వున్నాయి.
ముందువైపు 32 మెగాపిక్సెల్ వున్న కెమెరాను వీడియో కాల్స్ , సెల్ఫీలు, కోసం అందించారు.
యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలరో మీటర్,గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా మోటొరోలా స్మార్ట్ ఫోన్ లో పొందుపరిచారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6 నెటవర్క్ (Wifi-6 Network) ల తో పాటు, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ చార్జర్ (USB Type-C Charger) కూడా మోటోరోలా స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.
దీని బరువు 200 గ్రాములు కాగా , మందం 0.89 సెంటీమీటర్లు గా ఉంది.
ఫీచర్స్ అన్నీ బాగుండి ,ధర ప్రజలకు అందుబాటులో ఉంటే సాధారణం గా అందరూ ఇష్ట పడతారు కదా !
మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్స్ ఎంత వరకు మార్కెట్ లో ఆదరణ పొందుతాయో చూద్దాం ..