వైర్లెస్ ఛార్జింగ్. ఇది ఒకప్పటి కల. కానీ ఫోన్ నిత్యావసర వస్తువు అయిపోయిన దృష్ట్యా దీనితో మన అనుబంధం తెగకుండా ఉండేందుకు ఎన్నో బహుళ జాతీయ సంస్థలు సైతం ఈ వైర్లెస్ ఛార్జింగ్ ను వినియోగదారులకు అందించేందుకు పరిశోధనలు చేస్తున్నాయి. అయితే samsung వంటి కొన్ని సంస్థలు వైర్లెస్ ఛార్జింగ్ అంటూ కొన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చినా, అందులో కూడా ఒక ప్లేట్ వంటి పరికరం మీద ఉంటే తప్ప ఫోన్ ఛార్జ్ కాదు. ఇలా దానికి ఉన్న పరిమితుల వల్ల అది అంతగా ప్రజల్లోకి చేరలేదు. కానీ ఇప్పుడు అమెరికా కు చెందిన arrow electronics అనే సంస్థ MotherBox అనే వైర్లెస్ ఛార్జింగ్ యూనిట్ ను తయారు చేసింది. సుమారు 4 సంవత్సరాలు శ్రమ పడి ఈ MB ను తయారు చేసారు.
ఇప్పటికే పవర్ బ్యాంకు వంటివి ఉన్నా అవి కూడా మొబైల్ కు వైర్లెస్ ఛార్జింగ్ అందించలేవు. మనం ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా, బయట ప్రయాణం లో ఉన్నా సరే వైర్లెస్ ఛార్జింగ్ ను సులువుగా అందిస్తోంది ఈ MotherBox. ఇది చూడడానికి ఒక బంతి ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనికి అనుబంధంగా ఉండే ఒక రిసీవర్ ను ఫోన్ కు పెట్టుకోవాలి. ఈ MB యాప్ ద్వారా ఇది పని చేస్తుంది. దీనిని బ్లూటూత్ లేదా యుఎస్బి కేబుల్ తో మొదట దీనిని ఛార్జ్ చేయాలి. ఆ పైన ఈ యాప్ ద్వారా మన ఫోన్ ను MotherBox కు కనెక్ట్ చేసుకుని దీనిని మనతో పాటు మన బ్యాగ్ లో పెట్టుకుంటే చాలు మన ఫోన్ ను ఛార్జ్ చేసేస్తుంది. ఒకేసారి మూడు ఫోన్లను ఇది ఛార్జ్ చేస్తుంది. ఇక అవసరాన్ని బట్టి ఇందులో MotherBox Mini వంటి వెర్షన్ లు కూడా ఉన్నాయి.
ఇది iOS మరియు ఆండ్రాయిడ్ ఫోన్లకు పని చేస్తుంది. దీనిలో ఉండే 3D అయస్కాంత క్షేత్రం వల్ల ఫోన్ దీని చుట్టూ పక్కల ఎక్కడ ఉన్నా ఫోన్ ను ఛార్జ్ చేస్తుంది. దీని ధర $99-169 వరకు ఉంటుంది. ఇది సెప్టెంబర్ 2017 నుండి అందుబాటులోకి రానుంది.