మంకీపాక్స్ (Monkey Pox) వైరస్ సుమారుగా ౩౦ దేశాలకు వ్యాపించినట్టు నివేధించబడింది. కానీ మన దేశంలో మాత్రం ఈ వైరస్ కేసులు ఇంకా నమోదు కాలేదు.
ఈ వైరస్ గుర్తించబడిన దేశాలన్నింటిలో 780 కంటే ఎక్కువ కేసులు ధృవీకరించబ్డాయి.
వీటిలో ఎక్కువ భాగం ఐరోపాలోనే ఉన్నాయి. కేసులు పెరుగుతున్న కొద్దీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కొత్త మార్గదర్శకాలను మరియు చర్యలను జారీ చేసింది.
WHO Epidemiologist డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ వైరస్ ఎపిడెమియాలజీ (Viral epidemiology), సంక్రమణ మూలాలు, దాని వ్యాప్తి నమూనాలను అధ్యయనం చేసిన తరువాత మంకీపాక్స్ ను ఆపడానికి తీసుకున్న కీలక చర్యల జాబితాను వివరించారు.
వైరస్ వ్యాప్తి చెందని దేశాలలో నిఘాను పెంచాలని సీనియర్ ఆరోగ్య అధికారి సూచించారు. అలాగే మంకీపాక్స్ అంటే ఏమిటి? అది ఎలా వ్యాప్తి చెందుతుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ముఖ్యంగా యుఎస్ (U.S.), కెనడా (Canada), ఆస్ట్రేలియా (Australia), జర్మనీ (Germany), ఫ్రాన్స్ (France) వంటి దేశాలలో దీని బారినపడే వ్యక్తులు తగిన వైద్య సంరక్షణ పొందేలా చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వాలకు వివరించింది.
ఈ వైరస్ వ్యాప్తిని ఆపడానికి రెండవ దశ లో చేయాల్సింది అనేక స్థానికేతర దేశాలలో( human-to-human contraction )ను ఆపడం, ప్రజారోగ్య సాధనాలను ఉపయోగించడం, ఇందులో వ్యాధి తీవ్రతను బట్టి కేసులను వేరు చేయడం, పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయడం, ప్రజలకు ఈ వైరస్ వ్యాప్తి గురించి అర్థమయ్యేలా చెప్పడం వంటివి ఉన్నాయి.
ఫ్రంట్లైన్ వర్కర్ల (Frontline Workers) రక్షణ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారని డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. “వారికి ఈ మంకీపాక్స్ వైరస్ గురించి ఖచ్చితమైన సమాచారం అందించడంతో పాటుగా, తగిన వ్యక్తిగత సంరక్షణ పరికరాలను అందించడం చాలా ముఖ్యం.
ఈ వైరస్ కు వ్యతిరేకంగా (Counter actions) యాంటీ వైరల్స్ (Anti-viral), వ్యాక్సిన్ల (vaccines)ను సమానంగా.. ఎక్కువ ప్రమాదం ఉన్నవారికి తగిన విధంగా అందించడం వంటివి చేయాలి” అని డాక్టర్ కెర్ఖోవ్ అన్నారు. వచ్చే వారం WHO ఒక పరిశోధన, అభివృద్ధి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇది ఎపిడెమియాలజీ నుంచి రోగనిర్ధారణ, చికిత్సలు మరియు టీకాల వరకు అన్నింటినీ కవర్ చేస్తుంది. ఎందుకంటే మంకీపాక్స్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా అవసరం కాబట్టి.
భారతదేశంలో ధృవీకరించబడిన కేసులు నమోదు కానప్పటికీ ఘజియాబాద్ (Ghaziabad)లో మంకీపాక్స్ పరీక్ష కోసం5 సంవత్సరాల బాలిక నమూనాను సేకరించారు. ఇంతలో ఇటీవలి మంకీపాక్స్ కేసుల జన్యు విశ్లేషణ యుఎస్ లో రెండు విభిన్న జాతులు ఉన్నాయని సూచిస్తుంది.
యూరప్ లో ఇటీవలి నమోదైన కేసుల మాదిరిగానే అమెరికాలో చాలా కేసులు ఒకే రకమైన స్ట్రెయిన్(A type strain) వల్ల సంభవించాయని, అయితే కొన్ని నమూనాలు భిన్నమైన స్ట్రెయిన్ ను చూపిస్తున్నాయని ఫెడరల్ హెల్త్ అధికారులు(Federal Health officer) తెలిపారు.
మంకీపాక్స్ Poxviride కుటుంబంలోని OrthoPox virus జాతికి చెందినది. ఇందులో వెరియోలా వైరస్ (Variola virus) (ఇది మశూచికి కారణమవుతుంది), వాసినియా వైరస్ (Vasinia virus)(మశూచి వ్యాక్సిన్ లో ఉపయోగిస్తారు), కౌపాక్స్ వైరస్ (Cowpox virus) కూడా ఉన్నాయి.
మంకీపాక్స్ సోకితే.. సాధారణంగా జ్వరం(Fever), చలి(Shivering), చర్మం(skin)పై దద్దుర్లు(Rashes), ముఖం లేదా జననేంద్రియాలపై గాయాలను కలిగిస్తుంది. ప్రతి 10 మందిలో ఒకరికి ఈ వ్యాధి ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేసింది.