వాయు కాలుష్యం, ఇప్పుడు ప్రపంచమంతా ఈ సమస్యకే తలలు పట్టుకుని కూర్చుంటోంది. ఎక్కడో ఆరు బయట కాలుష్యం అయితే దానిని ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ అదే వాయు కాలుష్యం ఇంట్లో ఉంటే? ఉంటే ఏంటి ఉంది మనకు తెలియదు అంతే. కానీ డాని ప్రభావం మన ఆరోగ్యం పైన పడుతోంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్వచ్చమైన నీరు, ఆహారం తింటే సరిపోదు స్వచ్చమైన గాలిని కూడా పీల్చాలి. దురదృష్టవశాత్తు ఈ స్వచ్చమైన గాలి ఉందా లేదా అన్నది కూడా మనం పట్టించుకోం. గణాంకాల ప్రకారం ప్రతీ వ్యక్తి 85% పైగానే రోజులో నాలుగు గోడల మధ్య గడుపుతాడు. అలాంటప్పుడు ఈ నలుగు గోడల మధ్య వాయు కాలుష్యం లేకుండా చూసుకోవడం అత్యవసరం. ఇళ్ళల్లో లేదా కార్యాలయాల్లో మనం గుర్తించాలి కానీ కాలుష్యానికి చాలా కేంద్రాలు కనిపిస్తాయి. పెయింట్, పెర్ఫ్యూమ్, క్లీనింగ్ స్ప్రే, పెంపుడు జంతువులు, ఇంటి రంధ్రాలలో పేరుకొనే దుమ్ము ఇంకా చాలా చాలా ఉన్నాయి. మరి ఎప్పటికప్పుడు ఇంట్లోని గాలిని శుభ్రపరిచి మనకు విషవాయువులను హరించి చక్కని గాలిని పీల్చేందుకు వచ్చేసింది Molekule.

ఈ పరికరాన్ని University of Florida (UF) మరియు University of South Florida (USF)లు సంయుక్తంగా రూపొందించాయి. అంతే కాదు ఈ పరికరాన్ని తయారు చేసేందుకు అమెరికా లోని EPA మరియు US Department of Defence లు సైతం ఈ యూనివర్సిటీలకు సహాయ సహకారాలను అందించాయి అంటే దీని నాణ్యత ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మార్కెట్ లో చాలా ఎయిర్ ప్యురిఫైర్లు ఉన్నా ఇది వాటికంటే చాలా భిన్నం. మిగతా ప్యురిఫైర్లు HEPA ఫిల్టర్ల ఆధారంగా పని చేస్తే ఈ Molekule మాత్రం Photo Electrochemical Oxidation (PECO) అనే పద్ధతి ఆధారంగా పని చేస్తుంది. అంటే ఈ పద్ధతిలో గాలిలో ఉన్న హానికారక పదార్ధాలను మాలెక్యుల్ స్థాయి నుండి నాశనం చేసి స్వచ్చమైన గాలిని మనకు ఇస్తుందన్న మాట. మిగతా ప్యురిఫైర్ల కు దీనికి ప్రధానమైన తేడా ఏంటంటే మిగతావి ఫిల్టర్ల రూపంలో వాటిలో హానికారక పదార్ధాలను పీల్చుకుంటాయి. కానీ ఈ Molekule పీల్చుకోదు ఏకంగా వాటిని నాశనం చేసి అసలు గాలిలో కానీ ఈ పరికరంలో కానీ అలాంటి పదార్ధాలే లేకుండా చేస్తుంది.

ఇక దీనిలో రెండు పద్ధతుల్లో వాయు ప్రక్షాళన జరుగుతుంది (double filtration system). గదిలో నలువైపులా గాలిని లాక్కుని ముందు వాటిలో పెద్ద పెద్ద పదార్ధాలను ఫిల్టర్ చేస్తుంది. ఆ పైన కంటికి కనిపించని అతి సూక్ష్మ పదార్ధాలను ప్రత్యేకమైన UVA కాంతి ద్వారా వాటిని నాశనం చేస్తుంది. దీనినే PECO అంటారు.

ఈ Molekule చూడడానికి సిలిండర్ ఆకారంలో 23 అంగుళాల ఎత్తు, 8.25 అంగుళాల వెడల్పు కలిగి ఉండి విద్యుత్తుతో పని చేస్తుంది. ఈ Molekule ఎయిర్ ప్యురిఫైర్ గంటకు 600 చ.అ మేర గాలిని శుభ్ర పరుస్తుంది. ఈ Molekule ను వాడటం చాలా సులభం. దీనిని ప్లగ్ లో పెట్టి దీని పై ఉండే బటన్ వత్తితే చాలు దాని పని అది చేసుకుని పోతుంది. రెండవది దీనిని యాప్ ద్వారా నియంత్రించవచ్చు. అంతే కాదు ఈ యాప్ లో ఫిల్టర్ ను మార్చాల్సి వచ్చినప్పుడు అది మీకు ముందే తెలియపరుస్తుంది కూడా. ఇక దీనిలోని ఫిల్టర్ ఏడాది పాటు పని చేస్తుంది.

దీని ధర కొంచెం ఎక్కువే అని చెప్పాలి. ఇది అమెరికాలో $799 కి లభ్యం అవుతోంది. ఇక ఫిల్టర్ $99.

Courtesy