మొహర్రం(Muharram), వేడుక కాదు త్యాగానికి ప్రతీక, ముహర్రం తెలంగాణాలో ఈ పండుగను పీర్ల (Pirla) పండుగ(Festival)గా పిలుస్తారు.
దట్టమైన ఊదుపొగలు, డప్పుల మోతలు, జన్న కోళ్ల తో ‘దూలో’(dhulo) అనుకుంటూ పేర్లను వూరిలో ఊరేగిస్తారు. శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన ముస్లిం(Muslim) వీరుల త్యాగానికి ప్రతీకగా మోహుర్రం పండుగను జరుపుతారు. చాలా మందికి ముహుర్రం పండుగా ఎందుకు జరుపుతారో తెలీదు.
అందుకే ముహుర్రం శుభాకాంక్షలు అని చెబుతుంటారు. 40 వ శతాబ్దంలో జరిగిన ప్రాణ త్యాగాని (Sacrifice)కి ప్రతీకగా జరిపే ఈ పీర్ల పండుగా గురించి మరిన్ని వివరాలు!
గ్రామీణ ప్రాంతం(Villagers)లోని ప్రజలకు పీర్ల పండుగ అంటేనే తెలుసు, ముహుర్రం అంటే చాలా మంది గుర్తుపట్టారు. తొమ్మిది రోజుల (Nine Days)పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో ప్రతి రోజు ఉద పొగలు పీరిలా కోసం అర్పిస్తారు, మేకను బలిదానం ఇచ్చి ఆ రక్తాన్ని అర్పిస్తారు.
ఆ తరువాతే దూలో ఆట(Doolo Game) మొదలు పెడతారు. ముజావర్ (Mujhawar) ఇంటి నుంచి మొదలు పెట్టి ఊరంతా పీరీలను ఊరేగిస్తారు. వూరు పొలిమేరలు చుట్టుపక్కల వుండే తండాలో కలియ తిరిగి అభయమిస్తారు. పీరీలను ఏర్పాటు చేసే స్థలాన్ని అసుర్ ఖానా(Asur Khana) అంటారు.
కొన్ని ప్రాంతాల్లో పీర్ల కొట్టం అని కూడా అంటారు. ఈ అసుర్ ఖానా ముందు ఒక పెద్ద గుంత తవ్వి అందులో నిత్యం కట్టెలు కలుస్తారు. నిప్పుల కొలిమిలా మరీనా తరువాత, దానిలో నుంచి పీరిలు ఎత్తుకుని నడుస్తారు ఆ నిప్పులగుండం చుట్టూ తిరుగుతూ దూల ఆడుతారు. కొన్ని ప్రాంతాల్లో గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహిస్తారు. కుల మతాలకు అతీతంగా అన్ని మతాలు,కులాల వాళ్ళు పీర్ల పండుగలో పాలు పంచుకుంటారు.
ముహుర్రం మాసం ఆరంభం రోజున ఇస్లాం(Isam) నూతన సంవత్సరం(New Year) ప్రారంభమవుతుంది. ఇది అరబిక్(Arabic) కేలండర్(Calendar) యొక్క మొదటి నెల(First Month). ముస్లింలు మొహర్రం నెలలో మొదటి పది రోజులను విషాద దినాలు(Sad Days)గా పాటిస్తారు.
నల్ల దుస్తులు ధరించి సంతాపం పాటిస్తారు. ఆ పది రోజుల హస్సన్(Hassan) ,హుసేన్ల(Hussan) వీరోచిత పోరాటానికి సంబంధించిన జ్ఞాపకాల(Memory)ను గుర్తు చేసుకుంటారు. చాలా మంది పీరీలు అంటే ఏంటో తెలుసుకోవలనుకుంటారు. నిజానికి పీరీలు అంటే ముస్లిం త్యాగ మూర్తుల జ్ఞాపకంగా భావించే జెండాలు వీటినే దట్టీలు అని కూడా అంటారు. ఆ జెండాల(Flags)నే పవిత్రంగా భావించి దేవుడుగా కొలుస్తారు.
పంజా, హస్తం, నెలవంక వంటి ఆకారాలు జెండాలో ఉంటాయి . మొహర్రం నెలల్లో చంద్రుడు(Moon) స్పష్టంగా కనిపించిన, ఐదొవ రోజు రాత్రి బాంజోఖ పీటారా(Bazooka Petara) లేదా తబుధ్(Thabood) అనే బంజాల్ లో ఉంచిన పెట్టేను ముజావర్ ఇంటి నుంచి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ బంజాలకు, విగ్రహాలకు పది రోజులు ఫాతిహాలు జరుగుతాయి.
పేరులు అంటే వీరుల యొక్క హస్త కృతులు మరియు బంజాల రూపంలో కొలుస్తారు దేశవ్యాప్తంగా జరిగే అతి పెద్ద మాత ఉత్సవాలు ముహుర్రం ఒకటి. అయితే ఈ ఉత్సవంలో అన్ని మతాల వాళ్ళు పాలుపంచుకుని, మాత సామరస్యానికి మన దేశం ఎంత ప్రాధాన్యతను ఇస్తుందో చెప్పకనే చెబుతారు. ఈ సమయంలో కొంత మంది ఉపవాసాలు కూడా వుంటారు. ముస్లిం మతంలో ఉండే సున్నీలు,షియాలు రెండు తెగలు వేరువేరుగా ఈ మొహర్రం నిర్వహిస్తారు.
వారు పండుగ నిర్వహించే పద్ధతులు, విధానాలు వేరువేరుగా ఉంటాయి. పీరీలు అంటే సవార్లు భద్రపరిచే పెట్టెను కదిలించినప్పటి నుంచి పీరీలు నిమ్మజ్జనం, అంటే జెండాలను తొలిగించి, దాచడం జరిగే వరకు వుండే హుంగామ అంత ఇంత కాదు. అసుర్ ఖానా ముందు వుండే నిప్పుల గుండం చుట్టూ కాళ్ళకు గజ్జలు కట్టుకుని డప్పులు మోగుతుండగా అలావ్ (Alaav) ఆడుతారు రాగ యుక్తంగా పాటలు పాడుతారు.
ముస్లిం అమర వీరులను తలుచుకుంటూ, బాధాతత్తా హృదయాలతో దూల ఆడుతారు. ఓ వైపు ధూల్ ఆడుతుంటే మొక్కులు వున్నా వారు పీర్లకు మార్ధిలు తీస్తారు, ఫతేహా(Fatheha)లు ఇస్తారు, దట్టి కడతారు అంటే మట్టి కుండలో బెల్లం నీళ్లు కలిపి ఊదు పొగతో పీరీలకు సమర్పించి అందరికి పంచుతారు. జొన్న రొట్టెలు, బెల్లం తో చేసిన మలిద ముద్దలు ప్రసాదంగా పంచుతారు.
తొమ్మిది రోజులు పూర్తయిన తరువాత పీరీలను అల్లవ చుట్టూ తిప్పి అల్లవ్ గుంత పూడ్చడానికి చాలా మంది పోటీ పడతారు.
ఈ పండుగను చేసుకోవడం వల్ల గ్రామాల్లో సుఖశాంతులు వర్దిల్లుతున్నాయని వాళ్ళ నమ్మకం. పరుల కోసం తమ జీవితం సర్వస్వాన్ని, చివరకు ప్రాణాన్ని ధారపోసే వారు ధరిత్రి పై అమరుల. పీర్ల పండగా అంటే ఊరితో వున్న పేగుబంధాన్ని పెనవేసుకోవడమే అని భావిస్తారు.